ప్రభువుని జ్ఞానస్నాన పండుగ
ఈరోజు యావత్ కతోలిక శ్రీసభ ప్రభువుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొనుచున్నది. ఈ ఆదివారంతో సామాన్య కాలములోనికి ప్రవేశిస్తున్నాము. యేసు క్రీస్తు జ్ఞానస్నాన పండుగ సందర్భములో క్రీస్తు ప్రభువు పొందిన జ్ఞానస్నానము యొక్క అంతరార్ధమును పరిశీలించుట, దానికి మన క్రైస్తవ జీవితానికి మధ్యనున్న సన్నిహిత సంబంధమును గ్రహించుట, మన విశ్వాస జీవితమునకు ఎంతో ముఖ్యము! జ్ఞానస్నానములోని భాగ్యమును మరియు భాధ్యతను గుర్తెరుగుట చాలా ప్రాముఖ్యము!
జ్ఞానస్నానము
జ్ఞానస్నానమును తపోస్నానమని, బప్తిస్మమని కూడా పిలుస్తారు. జ్ఞానస్నానమును అనగా ఏమి? ‘‘జన్మపాపమును మరియు ఇతర పాపమును పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానము. జన్మపాపము ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము నుండి సంక్రమిస్తుంది. ఇతర పాపము స్వయం కృతాపరాధము వన జరుగుతుంది.
యేసు క్రీస్తు బప్తిస్మము
జన్మపాపమును, ఇతర పాపమును పోగొట్టి ప్రజలను, విశ్వాసులను దేవుని బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానమే జ్ఞానస్నానము. మరి క్రీస్తులో ఏపాపమును లేదు (హెబ్రీ 4:15, యోహాను 18:38, 19:4,6) మరియు ఆయన దేవుని కుమారుడు (లూకా 1:32, 35, మత్తయి 3:17). మరి యేసు క్రీస్తుకి జ్ఞానస్నానము అవసరమేనా? ఎందుకు, ఆయన జ్ఞానస్నానమును స్వీకరించారు? దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు (మత్తయి 3:15). మనతో తన సంఫీుభావమును తెలియజేయు నిమిత్తము, దేవుని సేవకులను, సేవకు మాటలను గౌరవించాని మనందరికీ ఒక సుమాత్రుకను నిచ్చుటకు (యోహాను 13:15), ఆయన జ్ఞానస్నానము స్వీకరించారు.
యేసు క్రీస్తు జ్ఞానస్నానములో ఇమిడియున్న పరమ రహస్యము: నీటిలోనికి ప్రవేశించుట, సిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తున్నది. నీటిలోనుండి బయటకు వచ్చుట ఆయన మరణమును సమాధిని జయించుటను సూచిస్తున్నది, ఇచ్చట జ్ఞానస్నాన సమయములో పవిత్రాత్మను స్వీకరించిన ఆయన మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తున్నది. ఆది తల్లిదండ్రుల పాపఫలితముగా మూయబడిన స్వర్గద్వారము, క్రీస్తు జ్ఞానస్నాన సమయములో తెరువబడెను (మత్తయి 3:16).
క్రీస్తు అభిషేకం
యేసు క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నాన మొందినప్పుడు పవిత్రాత్మచే అభిషిక్తులైనారు (మత్తయి 3:16). దేవుడు క్రీస్తు ప్రభువును అభిషేకించారు (యెషయా 42:1, 6. 61:1-2, ూకా 4:18, అ.కా. 10:38).
పూర్వవేదములో ఎవరైనా ఒక వ్యక్తి ప్రముఖమైన పనికి లేదా పదవికి నియమింప బడినప్పుడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిపై దిగివచ్చేది. ఉదా: కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలును ఇస్రాయెలీయులకు, రాజుగా నియమించబడినప్పుడు యావే ఆత్మ అతని మీదికి దిగివచ్చెను (న్యాయా. 3:9-10). గిద్యోనును దేవుని ఆత్మ ఆవేశింపగా అతడు బూరనూదెను (న్యాయా. 6:34). యోఫ్తా విషయములోను దేవుని ఆత్మ అతనిని ఆవేశింపగా (న్యాయా. 11:29), యావే సౌలును తన ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు (1 సమూ. 10:1), సౌలు రాజు యుద్ధమునకు పోవునప్పుడు (1 సమూ. 11:6), ప్రవిత్రాత్మ ప్రేరణముచే ప్రజలు ప్రవచనము పలుకుట చూస్తున్నాం.
No comments:
Post a Comment