పునీత లూసియమ్మ (13
డిశంబర్)
పునీత లూసి గారిది గ్రీకు వంశం. ధనిక కుటుంబంలో
‘సిసిలీ’ ద్వీపక్పంలో ‘సిరకూసె’ నగరంలో క్రీ.శ. 283లో జన్మించారు. ‘లూసి’ అనగా ‘వెలుగు’ అని అర్ధం. పసిప్రాయంలోనే తండ్రి చనిపోగా తల్లి యుతీబియా పెంపకంలో పెరిగారు. లూసియమ్మకు
ఒక ధనిక కుర్రాడితో వివాహం జరిపించాలని తల్లి తలంచి, బవంతంగా నిశ్చిత్తార్ధం జరిపించింది. కన్యగా దేవునికి తననుతాను అర్పించుకోవాలన్న
లూసియమ్మ కోరికకు తల్లి అడ్డుపడింది.
అయితే ఆ యువకుడు క్రైస్తవేత్తరుడు.
డియోక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న రోజులవి.
అయినప్పటికిని తనకు కాబోయే భర్తను తన దారికి తెచ్చుకోవాలని లూసి భావించారు. ఎంతో
కాలంగా రక్తస్రావంతో బాధపడుతున్న తన తల్లిని అగతగారి సమాధి వద్దకు తీసుకొని వెళ్లి
ప్రార్ధింపగా పూర్తి ఆరోగ్యాన్ని పొందినది. దీనితో తల్లికి లూసిమీద నమ్మకం
కుదిరింది. ఈ సందర్భంగా తమ ఆస్తిలో కొంతభాగం పేదలకు దానం చేయ నిర్ణయించు కున్నారు.
కాని ఆస్తికోసం ఆశపడి లూసి గారిని వివాహమాడ నిశ్చిత్తార్ధమైన యువకుడు తీవ్రంగా
వ్యతిరేకించాడు. గవర్నరుకు పిర్యాదు చేశాడు. గవర్నరు తల్లి కూతుళ్ళను
హెచ్చరించాడు. అనేక ఆటంకాలు కలిగించాడు. బాధలు పెట్టాడు.
డియోక్లేషియన్ చక్రవర్తి వేద హింసలు
కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్ దేవతలనే ఆరాధించాలని చక్రవర్తి శాసనం. లూసీగారు
దీనిని గట్టిగా వ్యతిరేకించారు. యేసు క్రీస్తు ప్రభువును విడిచి పెట్టేది లేదని
నిక్కచ్చిగా తెలిపారు. ఆమెను వేశ్య గృహానికి తరలింప వలసినదిగా గవర్నరు
అజ్ఞాపించాడు. కాని లూసి నిలబడ్డ చోటనుండి కదిలించడం ఎవరి తరం కాలేదు. ఆమె కనులు
దేవునిపై నిలిపింది. ఆమెను కాల్చి చంపాల్సిందిగా ఆజ్ఞ జారీ చేయబడినది. కాని మంటలు ఆ
పవిత్రురాలిని తాకలేక పోయాయి. పిమ్మట పదునైన బాకులతో ఆయమ్మ గొంతులో దూరేవిధంగా బలంగా
పొడవడంతో ఆ కన్య తన అంతిమ శ్వాస విడిచారు. ఇది క్రీ.శ. 304లో జరిగింది. లూసియమ్మ ఎందరో విశ్వాసులకు ఆదర్శ
ప్రాయమైంది. లూసి అనగా ‘జ్యోతి’, ‘వెలుగు’, ‘ప్రకాశం’ అని అర్ధం.
‘‘క్రియాశీలకంగా ప్రవర్తించండి. గాలిలో ఎగిరే పక్షి చేసే వాగ్దానాలు, విని, పోసపోకండి. నేల విడిచి సాము చేయకండి. మీ ముందు ఉన్న అవకాశాన్ని, ఇప్పుడే, ఇక్కడే సద్వినియోగ పరచుకోండి. ఈ లోకంలో మీ జీవితం శాశ్వతం కాదు’’ అని లూసియమ్మ పలికి యున్నారు.
Thank you so much father 🙏
ReplyDelete