గుడలూప్ మరియ మాత (12
డిశంబర్)
జ్వాన్‌డిగో ఆశ్చర్యకరమైన ఆనందముతో స్థానిక
బిషప్ జుమర్రా గారికి ఈ విషయమును తెలియ జేశాడు. ఏదైనా నిదర్శనం ఉంటే తప్ప తాను
నమ్మజాలనని వారు పలికారు. మరో మూడు రోజులైనాక డిసెంబరు 12న
జ్వాన్‌డిగోకు దేవమాత రెండవమారు దర్శన మయ్యారు. అతని వద్ద ఉన్న
దుప్పటిలాంటి ముతక వస్త్రాన్ని పరిపించుకొని దానిపై రోజా పుష్పాలను ఆ మరియ తల్లి
పేర్చారు. పిమ్మట అంతర్ధాన మయ్యారు.
దుప్పటిని పూలతో సహా తీసుకొని పోయి జ్వాన్‌డిగో
స్థానిక బిషప్ గారికి ప్రదర్శించారు. వారు ఆ దుప్పటి వస్త్రంపై పరిశీలనగా చూడగా
గుడాలుప్ మరియమాత బొమ్మ విస్పష్టంగా గోచరించింది. ఇది నిజంగా అద్భుతమేనని
నమ్మారు. బిషప్ జుమర్రా గారు ‘టెపెయక్’ కొండపై గుడాలుప్ మరియమాత బృహద్దేవాలయాన్ని
(బసిలికా) నిర్మింప జేశారు. ఇది క్రీ.శ. 1709లో ప్రారంభింప బడినది. మరియ తల్లి బొమ్మ అద్భుతంగా అచ్చుకాబడిన ఆ దుప్పటి
వస్త్రాన్ని ఆ దేవాలయంలోనే భక్తుల సందర్శనార్ధం ప్రదర్శింప బడినది.
ప్రపంచంలో దేవమాత పుణ్యక్షేత్రాలలో ఇది కూడా గొప్పదిగా పేర్కొన బడుతుంది. మెక్సికో ప్రజలు దీనిని తమ జాతీయ సంపదగా గౌరవిస్తారు.
No comments:
Post a Comment