జపమాల మాత పండుగ (7
అక్టోబరు)
జపమాలను మెడలో కాదు హృదిలో ధరించాలి. జపమాల
ప్రార్థనను నోటితో కాదు హృదయముతో ధ్యానం చేయాలి.
మే మాసమునకు, అక్టోబర్ మాసమునకు మన శ్రీసభలో ప్రత్యేక విశిష్టత ఉన్నది. ఎందుకంటే, ఈ రెండు నెలలు కూడా మనము మరియతల్లికి అంకితం చేస్తూ మన యొక్క ప్రార్ధనా అవసరతను తన యొక్క ప్రియ కుమారునికి మనవి చేయమని ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను అర్థిస్తూ ఉంటాము. ఈసందర్భంగా పండుగ యొక్క చరిత్రను, మరియతల్లి మనందరికీ ఇచ్చిన జపమాల ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని గూర్చి ధ్యానం చేద్దాం.
పండుగ చరిత్ర
క్రీస్తు శకం 1571లో తురుష్కులు క్రైస్తవ దేశాలపై దండెత్తి వచ్చినప్పుడు యావన్మంది క్రైస్తవులు
మరియతల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనకు
ఫలితంగా క్రైస్తవుల చేతిలో తురుష్కులు ఓటమి పాలు చెందారు. ఈ విజయానికి గుర్తుగా మన
తల్లి శ్రీసభ అప్పటి పోప్‌గార్ల ఆమోదంతో ఈ పండుగను కొనియాడుతూ వస్తున్నది. మొదట ఈ
పండుగ కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చెందినది తరువాత శ్రీసభ పితరు కృషి
ద్వారా విశ్వవ్యాప్తం చెందినది.
మరియతల్లి తన స్వహస్తాతో మనందరికీ ఇచ్చిన జపమాల ప్రార్థన యొక్క
ఔన్నత్యాన్ని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం:
జపమాల అంటే అర్థం జపముతో కూడిన మా అని అర్థం.
ఇక్కడ జపము అంటే ప్రార్థను అని అర్థం. క్రీస్తు శకం 13వ శతాబ్ద ఆరంభంలో మరియతల్లి తన యొక్క స్వహస్తాల
ద్వారా పునీత దోమినిక్ గారికి జపమాలను ఇచ్చి జపమాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను
ఆయనకు చెప్పి ఉన్నారు. జపమాల ప్రార్ధనలో మనం ధ్యానం చేసినట్లయితే జపమాలలో మొత్తం 20 గురుతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఐదు
సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ
దేవరహస్యాలు, ఐదు మహిమ
దేవరహస్యాలు, ఐదు వెలుగు దేవరహస్యాలు
ఉంటాయి. క్రైస్తవుడుకి మొదట క్రీస్తు అంటే ఎవరు ఆయన మనకొరకు ఎందుకు వచ్చారు అనే
విషయాలు తెలియకుండా ఆరాధనలో కూర్చుంటే దానికి విలువ ఉండదు. క్రైస్తవులకు క్రీస్తు
బోధనలు, క్రీస్తు ప్రేమ గురించి
ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది తెలియకపోతే
క్రైస్తవులుగా మన జీవితాలు వ్యర్థం. అందుకే మనకు శ్రీసభ మరియతల్లి ద్వారా
జపమాల ప్రార్థనను ఇచ్చి ఉన్నది. ఈ దేవరహస్యాలు మొత్తంలో కూడా మనము క్రీస్తు
ప్రభువు గురించి అధికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఆయన జననము, మరణము, మనకోసం అనుభవించిన శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద
స్థాపన. అదేవిధంగా మరియమాతకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను మనము ఇందులో
ధ్యానం చేయవచ్చు. అసలు జపమాల ప్రార్థన మరియతల్లి మనకు ఎందుకు ఇచ్చారు? అని ఆలోచిస్తే ఇకనుండి జపమాల ప్రార్థన మనము
ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాము.
పూర్వ నిబంధన రోజులవి. యెషయా ప్రవక్త రాబోతున్న
దైవ కుమారుడు మెస్సయ్య గురించి జనులకు ఈ విధంగా చెబుతున్నారు. ఆయన రాకకు
సంబంధించిన ఒక సూచన వారికి చూపిస్తూ ఉన్నారు. ‘సరే వినుడు, ప్రభువే మీకొక
గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును’ (యెషయ 7:14).
ఇది రాబోతున్న క్రీస్తు ప్రభువు గురించి
మరియతల్లి గురించి యెషయా ప్రవక్త
ప్రవచించిన ప్రవచనం. ‘భవిష్యత్తులో
జరగబోయే దాని గురించి ముందే చెప్పటం’
దానిని ప్రవచనం
అంటారు. క్రీస్తు ప్రభువు పుట్టక మునుపే అంటే 700 సం.ల క్రితమే పవిత్రాత్మ ప్రేరణతో దీని గురించి యెషయా ప్రవచించారు. పూర్వ
నిబంధన కాలములో క్రీస్తు ప్రభువు రాక కోసం ఎంతో మంది ఎదురు చూశారు. అదేవిధంగా ఆయన
ఒక యువతి గర్భం ద్వారా వస్తారు అని
యెషయా ప్రవచించిన విధముగా ఆ యువతి కోసం కూడా ఎంతో మంది ఎదురు
చూశారు వారిలో మరియమాత ఒకరు. ‘‘సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును
యువతి గర్భవతియై ఉన్నది ఆమె
కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అతడు పెరిగి పెద్దవాడై చెడును
నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చువరకును తేనెను, పెరుగును ఆరగించును’’ (యెషయ 7:14-15). ఇది పూర్వ నిబంధనలో రాబోతున్న క్రీస్తు ప్రభువు గురించి
యెషయా ప్రవచించిన ప్రవచనం. పాత నిబంధన కాలములో ఎంతోమంది ఈ యొక్క వచనాలను ధ్యానం
చేసి ఉంటారు. వారితో పాటు నజరేతు గ్రామంలో ఉన్న మరియకూడా ధ్యానం చేసి ఉంటారు.
ఇక్కడ మనం మనసుపెట్టి ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. నూతన నిబంధనలో మరియమ్మగారే
ఆ యువతి అయ్యారు, ఆ కన్య అయ్యారు.
తన స్వహస్తాలతో ప్రభువుని పెంచారు,
ప్రభువును
కాపాడారు. మరియమ్మ గారు అంటున్నారు,
‘‘ఏలయన, సర్వశక్తిమంతుడు నాయెడల గొప్ప కార్యములు
చేసెను. ఆయన నామము పవిత్రమైనది’’
(లూకా. 1:49). మరియమ్మగారి జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప
కార్యాలు చేశారు, కారణం ఆమె వాక్యాన్ని విశ్వసించారు. వాక్యాలు నోటితో మాత్రమే
కాదు హృదయంతో ఆమె స్వీకరించారు. అందుకే నజరేతు గ్రామంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నా
లోకరక్షకునికి జీవం పోసే భాగ్యం మరియమాతకు మాత్రమే వచ్చింది. మనం పెద్దపెద్ద
పుణ్యక్షేత్రాలలో చూసినట్లయితే జపమాల దేవ రహస్యాలను స్వరూపాల రూపంలో ప్రతిష్టిస్తూ
ఉంటారు. సంతోష దేవ రహస్యాలలో మొదటి దేవ రహస్యం మనం చూసినట్లయితే ఇందులో గబ్రియేలు
దూత మరియతల్లి దగ్గరికి వచ్చి, ‘‘అమ్మ మీరు
పవిత్రాత్మ ప్రభావంతో క్రీస్తు ప్రభువును కంటారు’’ అని చెప్పే సంఘటనను మనం చూడవచ్చు. ఇందులో గాబ్రియేలు దేవదూత శుభవార్తను
చెప్పేటప్పుడు మరియతల్లి ప్రార్థనలో ఉంటారు. ఆమె ఎదురుగా దైవ గ్రంధం కూడా
ఉంటుంది. మరియతల్లి ప్రార్థనలో లీనమై ఉన్నప్పుడు, తన యొక్క దేవదూతను దేవుడు శుభవార్తను అంటే తాను చేయబోతున్న మంచి పని చెప్పడం
కోసం పంపించారు. ఆమెకు ఆ భాగ్యం రావటానికి ల కారణం తాను జీవించిన ప్రార్థన జీవితం.
అందరూ రాబోతున్న మెస్సయ్య కొరకు నిరీక్షణతో ఎదురు చూశారు, ప్రార్థను చేశారు కానీ ఎవ్వరికి రానటువంటి
అవకాశం మరియతల్లికి వచ్చింది. కారణం విశ్వాసముతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన నిరీక్షణ. మనము కూడా ఇదే విశ్వాసాన్ని కలిగి జీవించాని మరియతల్లి తన
జపమాలను మనందరికీ ఇచ్చి ఉన్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక క్రీస్తుప్రభువు
జన్మించిన తర్వాత అక్కడనుండి మనం అనేకమైన ఘట్టాలను జపమాలలో ధ్యానం చేస్తూ ఉంటాము:
బాలయేసు దేవాలయములో కానుకగా సమర్పించుట (లూకా. 2:28), దేవమాత కానకపోయిన బాయేసును దేవాలయములో కనుగొనుట
(లూకా. 2:46), గేత్సేమని తోటలో
యేసుక్రీస్తు మహా ఆవేదన పొందుట (మార్కు. 14:35), యేసు క్రీస్తును రాతి స్తంభానికి బంధించి కొరడాతో కొట్టి
హింసించుట (మార్కు. 15:15), యేసుక్రీస్తు
తిరుశిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టి,
అదిమి కొట్టుట (మార్కు. 15:17), యేసుక్రీస్తు సిువను
మోయుట (యోహాను 19:17), యేసుక్రీస్తు
సిువపై మరణించుట (లూకా. 23:33), యేసుక్రీస్తు
పునరుత్థానం అగుట (మార్కు. 16:6), యేసుక్రీస్తు
మొక్షారోహణం చేయుట (మార్కు. 16:19),
పవిత్రాత్మ
అపోస్తులపై వేంచేయుట (అ.కా. 2:4).
క్రీస్తు ప్రభువు సిలువ శ్రమలు అనుభవించి
మరణించి పునరుత్థానముతో లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరియమాత తన జీవితాన్ని
ఏకాంతంగా గడిపేవారు. చిన్నతనం నుండి క్రీస్తు ప్రభువు సిలువమీద మరణించే వరకు కూడా
ఆమెతో ఉన్నారు... క్రీస్తు ప్రభువు యొక్క జీవిత ఘట్టాలను తలచుకుంటూ ఎక్కువ సమయం
ప్రార్థనలో గడిపేవారు, ధైర్యముగా
జీవించేవారు. అందుకే జపమాల రూపంలో తన యొక్క పవిత్రమైన చేతిద్వారా క్రీస్తు ప్రభువు
యొక్క జీవిత ఘట్టాలను మనము మన అనుదిన
జీవితాలో స్మరించాలని జీవితంలో ఎటువంటి కష్టం వచ్చిన ధైర్యముతో పోరాడి గెలవాని
మరియతల్లి జపమాలను శ్రీసభకు ఇచ్చి ఉన్నారు.
అదేవిధంగా జపమాల ప్రార్థనలో మనము ఫాతిమామాత
ప్రార్థనను ధ్యానం చేస్తూ ఉంటాము. ఇది సాక్షాత్తు మరియతల్లి తన యొక్క నోటితో
పలికిన ప్రార్థన. ఈ ప్రార్థనను మరియతల్లి ముగ్గురు చిన్న పిల్లల ద్వారా మనందరికీ
ఇచ్చి ఉన్నారు. శ్రీసభ మరియతల్లి ఇచ్చిన జపమాల ప్రార్థనలో దీనిని కూడా కలిపి ఉన్నారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవున్నిదర్శిస్తారు అని వాక్యము సెలవిస్తుంది.
అటువంటి హృదయశుద్ధి జపమాల ప్రార్థనలో కలుగుతుంది. జపమాల ప్రార్ధనలో, ‘‘నేను పాపిని ప్రభువా! నా పాపమును మన్నించండి’’ అని చెప్పటం వలన దేవుడు అధికముగా మనలోనికి
ప్రవేశిస్తారు. పాపమును ఒప్పుకొని ఎంతో మంది ప్రవక్తలు, పునీతులు గత జీవితాన్ని విడిచిపెట్టి మారుమనసు
పొంది సువార్త సేవ కొరకు తమ యొక్క ప్రాణాను సైతం దేవునికి అర్పించిన గొప్ప గొప్ప
వారు ఉన్నారు. ఉదాహరణకు, పునీతుల చేతిలో అనునిత్యం జపమాల ఉంటుంది.
చివరికి వారి ప్రాణాలను విడిచేటప్పుడు కూడా జపమాలను పట్టుకొని ప్రాణాలు విడిచారు.
ఇది జపమాల ప్రార్థన యొక్క గొప్పతనం. ఈ మధ్యకాలములో చాలామంది సందేహిస్తున్న విషయం
ఏమిటి అంటే జపమాల ప్రార్థన చేయడం అంటే, మరియమాతకు ఆరాధన చేయటం అని, జపమాల ప్రార్థన
చేయటం మరియతల్లికి ఆరాధనచేయడం కాదు,
అలా అనుకోవటం
పొరపాటు. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, మరి జపమాల ప్రార్ధన చేసేటప్పుడు మీరు ఎందుకు మరియతల్లి స్వరూపం ఎదురు
కూర్చుంటారు మరియు మీరు జపించే మంగళవార్త జపములో, పరిశుద్ద మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ముమై యుండెడు మా కొరకు ఇప్పుడును, మా మరణ సమయ మందును ప్రార్ధించండి. ఆమెన్. అని అంటూ ఉంటారు? ఇవి బైబుల్లో ఎక్కడ ఉన్నాయి చూపించండి అని
అడుగుతూ ఉంటారు. పునీతులు మన కొరకు ప్రార్థన చేస్తారు. మనయొక్క విన్నపమును దేవుని
చెంతకు తీసుకు వెళతారు అని వాక్యం సెలవిస్తుంది. ‘‘వారు సింహాసనమునకును, గొర్రెపిల్లకును
ఎదురుగా నిలచిరి. వారుత్లెని దుస్తులు వేసుకొని యుండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను
పట్టుకొని ఉండిరి. దేవదూతలను, పెద్దలను, నాలుగుజీవులను, ఆ సింహాసనమును పరివేష్టించిరి. అంతట వారు సింహాసనముకు ఎదురుగా నేలవ్రాలి
దేవుని పూజించిరి. ఆమేన్! మన దేవునికి సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు కలుగునుగాక! అని వారు పలుకు చుండిరి’’ (దర్శన 7:11-12).
ఇదే పరలోకములో ఉన్న పునీతులు, మరియతల్లి మన కొరకు చేసే పని. మన కొరకు
ప్రార్థన చేస్తూ, దేవుని
స్తుతిస్తున్నారు. పునీతులు, దేవదూతలు అనువారు
పరలోకములో దేవుని సింహాసనం చుట్టూ నిలచి, దేవుని అహోరాత్రులు స్తుతించువారు.
వీటిని దృష్టిలో పెట్టుకొని వాక్యానికి విన్నవిస్తూ
శ్రీసభ పునీతు ప్రార్థన సహాయాన్ని వాడుకోవచ్చు అని ఆమోదించింది. ఇదే జపమాల
ప్రార్థనలో చేర్చడం జరిగింది. అందుకే దేవునితల్లికి జపమాల ప్రార్థనద్వారా మన
విన్నపములను తెలియపరుస్తూ ఉన్నాము. అంతేకానీ మరియతల్లికి మనం ఆరాధన చేయము.
మరియతల్లి ఏ విధముగా అయితే తన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించి అనునిత్యం దేవుని
గురించి ఆలోచించారో, అదేవిధంగా ప్రతీ
క్రైస్తవుడు జీవించి తన యొక్క ప్రియ కుమారుని మార్గంలో నడిపించాలి అనేది మరియమాత
యొక్క కోరిక. అందుకే తాను దర్శనమిచ్చిన
ప్రతి ప్రాంతంలో అధికంగా వాడిన పదం జపమాలను జపించి ప్రభువు మార్గంలో నడవండి అని.
మనం జపమాల ప్రార్థనలో ఒక్కొక్క గుర్తు చెప్తుంటే ఒక్కో గుర్తు ఒక రోజా పువ్వుగా
మారి మరియతల్లి యొక్క శిరస్సును కిరీటము వలె అలంకరిస్తాయి. అదేవిధంగా వీటితో పాటు
మన యొక్క మనవులు మరియతల్లి చెంతకు చేరి
ఆమె మన కొరకు తన ప్రియ కుమారుని ప్రార్ధిస్తారు.
దావీదు మహారాజు మరియు గొల్యాతుకు మధ్య యుద్ధం
జరుగుతుంది. గొల్యాతును ఎంతోమంది చంపుతామని పెద్దపెద్ద ఆయుధాలతో యుద్ధం చేస్తారు
కానీ అందరూ ఓడిపోతారు. చిట్టచివరికి దావీదు ఒడిసెతో తనని అంతం చేస్తాడు. ఇక్కడ
ఒడిసె చాలా చిన్నది కానీ దాని యొక్క శక్తి చాలా పెద్దది. ఎందుకు అంటే దావీదు
మహారాజు ప్రార్థించి ఆ ఒడిసెతో యుద్ధంలో గెలుపొందారు. ఈనాడు కొంతమంది జపమాల
ప్రార్థన గురించి చాలా హేళనగా తక్కువ చేసి మాట్లాడతారు. జపమాల ప్రార్థన శక్తి
వారికి తెలియక పోవచ్చు కానీ అనుభవించే మనకు తెలుసు.
కాబట్టి, ప్రార్థన చేయటం బైబిల్ గ్రంథమునకు
వ్యతిరేకం కాదు. ‘‘ఈ ప్రజలు పెదవులతో
నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి’’ (మత్తయి 15:8).
మన హృదయాలను ప్రభువు ప్రేమతో నింపే జపమాల ప్రార్థన యొక్క శక్తిని గ్రహిద్దాం. మరియతల్లి ఏ ప్రణాళికతో ఈ జపమాల ప్రార్థనను ఇచ్చి ఉన్నారు అనే విషయాను హృదయముతో ఆలోచన చేద్దాం. భక్తిశ్రద్ధతో జపమాల ప్రార్థన ద్వారా మన విన్నపమును మరియతల్లికి తెలియచేద్దాం. అందరికీ మరోమారు జపమాల మాత పండుగ శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.
Amen....alleluah
ReplyDeleteMay Our Mother Mary intercede for us
ReplyDelete