ఉప్పాధ్యాయ దినోత్సవం

ఉప్పాధ్యాయ దినోత్సవం


ప్రాచీన కాలము నుండి భారతీయ సమాజంలో గురువులకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. ఈనాడు ఉపాధ్యాయులను గురువులుగా పూజిస్తూ విద్యార్ధులు పూజోత్సవాలు చేసుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. అయితే గురువు పాత్ర వేరు, ఉపాధ్యాయుడి పాత్ర వేరు. గురువు జీవితాన్ని ప్రభావితం చేస్తే ఉపాధ్యాయుడు బడికి, పాఠాలకు పరిమితం అయ్యి ఉంటారు. ఉపాధ్యాయుడు గురువు స్థానంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉపాధ్యాయుడు పాత్రను, గురువు పాత్రను రెండిరటిని కలిపి చూడ కూడదు. వేరువేరుగా చూడాలి. మనం గత కాలంలోని గురువుల పాత్రని మరిచి పోవాలి. ప్రాచీన కాలపు గురువుల జీవితం నిరాడంబరతకు, త్యాగనికి, జ్ఞానికి ప్రత్యేక రూపాలు.

అలాంటి గురువుల పాత్రను నేటి ఉపాధ్యాయులని కోరటం న్యాయం కాదు. ఈనాటి ఉపాధ్యాయులది, అన్ని వృత్తుల్లాగా ఒక వృత్తి జీవానోపాధి కోసం వచ్చిన వాడే కాని జీవితమంత విద్యకోసం, విద్యార్ధుల కోసం ధారపోయటానికి వచ్చిన వాడు కాదు. ఇది వాస్తవం. అయితే సమాజంలో గొప్ప ఆశతో వచ్చిన ఉపాధ్యాయులు కూడా కొద్ది కాలంలోనే నిరాశ, నిశృహలకు లోనుకాక తప్పదు. ఉపాధ్యాయుడు కూడా బడిలో అచేతనుడై, మొండిగా, బండగా మారిపోక తప్పటం లేదు. ఈ స్థితిలో పిల్లలు మానసిక వికలాంగులై బయటికి నెట్టబడుతున్న స్థితి మన కళ్ళ ఎదుటే కనబడుతుంది. బడికి సెలవు అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఉపాధ్యాయులు ఆనందంగా ఊపిరి పీల్చుకుంటారు. ఇది ఈనాటి వాస్తవం.

ఈనాటి ఉపాధ్యాయుడు పాత్ర పలు రూపాలుగా విస్తరించింది. సినిమా, టి.వి, ఇంటర్‌నెట్‌, సీడి, కోచింగ్‌ సెంటర్‌లు, పుస్తకాలు, తల్లిదండ్రులు... ఇలా ఎన్నో అంశాలు ఉపాధ్యాయుడు పాత్రను పోషిస్తున్నాయి. ఇది కాదనలేని వాస్తవం.

కాని తల్లిదండ్రులు తప్ప మిగిలినవేవి విద్యార్ధితో మానవ సంబంధాలను నెలకొల్పకోలేవు. విద్యార్ధి వీపు తట్టి ప్రోత్సహించ లేవు. అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యం. అందుకే బడిలో ఉపాధ్యాయుడు పాత్ర అసాధారణ మైనది. పిల్లలకు పౌర సమాజానికి మధ్య వారధి లాంటి వాడు ఉపాధ్యాయడు. కళాశాల అధ్యాపకుడు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వీరిద్దరికి కంటే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాత్ర భిన్నమైనది. ఇతడు నాలుగు అక్షరం ముక్కల్ని మాత్రమే నెర్పేవాడు కాదు, ఇతడు గురు పాత్రను పోషించాలి. అనేక సమస్యలకు పరిష్కార మార్గములను చూపుతూ, వినోదం పాటు, విజ్ఞానాన్ని అందించాలి.

వేద వ్యాస మహర్షి గురూణామ్‌ గురు:గురువుకు గురువు జ్ఞాన భాండాగారమైన వేదసారాన్ని మహాభారత రూపంలో మనకు అందించారు. అందువలనే ఆషాడ పూర్ణిమను వ్యాసపూర్ణిమ’, గురు పూర్ణిమ నిర్వహించు కొంటాం. అటువంటి మహాను భావుడు నాస్థి మాతృ నమో గురు:

తల్లితో సమానమైన గురవు లేరని నొక్కి వక్కాణించారు. ప్రణమ్య మాతారం పశ్చాత్‌, ప్రణమేత్‌ పితరం గురుమ్‌ అంటే మొదటి తల్లికి నమస్కరించాలి తర్వాత తండ్రికి అతర్వాత గురువుకి నమస్కారం చేయాలని శాస్త్రమే చెబుతుంది. ఉపాధ్యాయాన్‌ దశాచార్య:.... ఆచార్యుడు (గురువు) పదిమంది ఉపాధ్యాయులతో సమానం. అట్టి గురువు యొక్క మహోత్సవాన్ని జరుపుకోటానికి సమాజ పరమైన సమన్వయ కార్యక్రమమును రూపొందించి కీ॥శే భారత మాజీ రాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవం అయిన సెప్టెంబరు 5వ తేదీన జరుపుకోటానికి ఉపాధ్యాయులను ప్రోత్సహించారు.

No comments:

Post a Comment