మరియ జన్మదినోత్సవం (8
సెప్టెంబరు)
మరియ మాతను గురించి పునీత అల్ఫోన్సస్ లిగోరి
ఈవిధంగా అన్నారు: ‘‘పరలోక వాక్కుకు
తల్లిగా నుండుటకు ఆమె ఎన్నుకోబడినది. అందుకే ఆమె నిష్కళంకోద్భవిగా - అనితర
సాధ్యమైన గొప్ప వరాలతో అభిషేకింపబడి జన్మించింది. పవిత్రతలో పునీతులను, దేవదూతలను మించింది. దేవుని తల్లిగా ఉండే
అర్హతకై ఉన్నతమైన దైవ వరానుగ్రహాలతో నింపబడినది. ఆమె అత్యంత అధికమైన పరమ పునీతగా
జన్మించింది. తన సృష్టిలోనే అంతకు ముందెన్నడూ కలిగించనంత సుందరంగా ఆమె ఆత్మను
దేవుడు తీర్చి దిద్దారు. ఆమె ఇహపరలోక దృష్టిలో మనోహరమైన, అందమైన, ఆత్మ కలిగి సంతోషపూరిత పాపగా ఆవిష్కరింప బడినది. ఆమె పరమ పావన దేవునికి అత్యంత
ప్రియమైనదై, పూర్ణవరాలతో
నింపబడినది. మనం మధురమైనట్టి ఆ పసిపాపను చేరి మహానందంతో పరవశించి పోదాం.’’ ఆమె ‘‘జన్మపాపరహితోద్భవి. నిష్కళంక హృదయ మరియ నామధేయ. అదే ఆమె జన్మకు మన జన్మకు మధ్య
తేడా.’’
పిత దైవానికి ప్రియమైన కుమార్తె. ఈలోకంలో
పునీత జ్వాకీము అన్నమ్మ సంతానంగా ఆవిర్భవించి, దేవుని ఏర్పాటు చొప్పున మానవ రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ భాగస్వామిని అయ్యింది.
ఈమెయే రెండవ ఏవ. పవిత్ర గొర్రెపిల్లను ప్రసవింపబోవు మహా మంచి తల్లి గొర్రె. దైవ
రక్షణలో తొలిమెట్టు. సాతాను ప్రారబ్దానికి ఆఖరి మెట్టు.
ఈ రెండవ ఏవ గురించి పరిశుద్ధ గ్రంథము, ఆది. 3:15, యెషయ 7:14లో దేవుని
వాక్కుగా ప్రజావళికి తెలుప బడినది. ఏ ప్రదేశంలో మరియ జన్మించింది ఇమిద్ధముగా
తెలియదు. యేరూషలేము పవిత్ర నగరమందు జన్మించి ఉండవచ్చని గట్టి నమ్మకం. మొదటగా ఆరవ
శతాబ్దంలో మరియ జయంతిని సిరియా లేక పాస్తీనాలో కొనియాడ బడినట్లు తెలుస్తున్నది.
మరో నూరేండ్ల అనంతరం రోము నగరంలో ఆమె జన్మదినోత్సవం జరుప బడటం ఆనవాయితి అయ్యింది.
యేసు జననం, బప్తిస్త యోహాను జననం, మరియమాత జననం
ఉత్సవాల్ని శ్రీసభచే ఆరంభ సంవత్సరాలనుండే కొనియాడ బడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగవ
శతాబ్దంలోనే యేరూషలేములో పునీత అన్నమ్మగారి దేవళంలో మరియ జయంతిని తొలిసారిగా
కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే రోము నగరములో శ్రీసభ ఆయమ్మ జనన వార్షికోత్సవాన్ని
ఆచరించడం ఆరభించింది.
క్రీస్తు యేసు ద్వారా లోక రక్షణ ప్రణాళికలో ‘‘మేరిమాత జననం’’ ఒక ముఖ్య ఘట్టంగా దేవుడు ఏర్పరచినట్లు వేదాలు ఘోషిస్తున్నాయి. పూర్వ వేద అంత్యానిక, నూతన వేద ఆరంభానికి మధ్యస్థ వేదాంత రేఖ ఆ జగజ్జనని జన్మదినం. మరయ నామం ఉన్నత దైవ వరానుగ్రహాలతో నింప బడినది.
No comments:
Post a Comment