మరియమాత మోక్షారోహణ పండుగ, ఆగష్టు 15

మరియమాత మోక్షారోహణ పండుగ, ఆగష్టు 15


ఆగష్టు నెలలో మనము మరియమాత మోక్షారోహణ పండుగను, మన దేశ స్వతంత్ర దినోత్సవమును కొనియాడు చున్నాము. ఈ రెండు పండుగలు కూడా ఎంతో త్యాగాన్ని గుర్తుకు చేస్తాయి. ఈనాడు సమాజములో స్వేచ్చాయుతముగా జీవిస్తున్నామంటే, ఎంతోమంది వీరుల త్యాగఫలమని మనము గుర్తించాలి. తమ ప్రాణములను సైతము దేశము కొరకు అర్పించియున్నారు. మువ్వెన్నల జెండా ఈ రోజు దేశమంతటా రెపరెప లాడుతున్నదంటే, ఎంతో మంది జీవితాల త్యాగ ఫలమని గుర్తించాలి.

మరియతల్లి కూడా ఈలోకమునకు దేవుని ప్రణాళికతో పంపబడినారు. ఈలోకములో ఒక పావన మందసముగా జీవించినటువంటి మరియతల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడినది. దీనిని మనము ఒక గొప్ప పండుగగా కొనియాడు చున్నాము. మరియ మనందరి తల్లి. తొలి క్రైస్తవురాలు. తొలి శ్రీసభకు ముందుగా నడచిన క్రైస్తవ నాయకి. క్రీస్తును వెంబడించిన విధేయురాలు, విశ్వాసి, విరక్తత్వ ప్రియ మార్గదర్శి, దైవాంకిత, రక్షణమూర్తి. జపమాల ద్వారా క్రీస్తు జీవితమును ధ్యానిస్తూ మన విన్నపములను ఆ తల్లి ద్వారా దేవునకు మొరపెట్టు కొనుచున్నాము. దేవుని యొక్క అనుగ్రహము కొరకు ఆ తల్లి నిత్యము ప్రార్ధన చేస్తున్నది. దేవుడు ఆ తల్లిని ఉన్నత స్థానమునకు చేర్చారు. ‘‘స్త్రీందరిలో ఆశీర్వదింప బడిన దానవు. నీ గర్భ ఫము ఆశ్రీర్వదింప బడెను’’ (లూకా. 1:42).

తన జీవితమంతయు కూడా మరియతల్లి దేవుని చిత్తానికి తలొగ్గి జీవించినది. పవిత్రాత్మ ద్వారా దేవుని మందసముగా రూపొందింప బడినారు. ఎ్లప్పుడూ దేవున్ని స్తుతిస్తూ జీవించారు. ఈలోక ఆశల వలయములో చిక్కుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి ఉన్నది. జన్మ పాపమే లేనట్టి పవిత్రురాలు. జన్మ పాపము లేక జన్మించి, పవిత్ర పుణ్య మూర్తిగా జీవించి, రక్షణ కార్యములో దేవునికి భాగస్వామియై సహకరించి దైవప్రణాళికను దిగ్విజయ మొనర్చడములో గుంభనముగా ప్రార్ధనతో మనసావాచా కర్మణా తనవంతు పాత్రను నిర్వహించిన నిత్యకన్య మరియకు తగిన గౌరవం ఇవ్వబడినది. సంపూర్ణ దైవ ప్రేమతో దేవయిష్ట వరప్రసాదాలతో నిండి యున్నది.

పునీత అన్సేల్మో గారు ఇలా అన్నారు: ‘‘రక్షకుడైన యేసు తన తల్లికంటె ముందుగా మోక్షానికి ఎందుకెళ్ళారో తెలుసా! ఆ తల్లికి తగిన సింహాసనం, మోక్ష కిరీటం సంసిద్ధ పరచడానికి. సమయం ఆసన్నమైనప్పుడు సకల మోక్ష వాసులతో కూడి ఎదురేగి ఆ పవిత్రురాలిని స్వర్గములోనికి సాదరముగా స్వాగతించడానికి. ఆమెను మోక్ష రాజ్ఞిని చేసి సకల మోక్ష వాసులతో గౌరవ వందనం సమర్పింప చేయటానికే.’’

ఈనాడు మనము పాపమును వీడి పుణ్య మార్గములోనికి రావాలి. అందుకు మరియతల్లిని, ఆమె జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాము. మన దేశము కొరకు ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. దేశ నాయకుల కొరకు ప్రార్ధన చేద్దాం. మన దేశం ఇంకా నిజమైన స్వతంత్రమును, స్వేచ్చను, విడుదలను పొందవసి యున్నది. మరియతల్లి ప్రార్ధన విన్నపము ద్వారా దేశములో శాంతి, సమాధానము, భద్రత గురించి ప్రార్ధన చేద్దాం.

‘‘మరియమాత దేహం క్రీస్తుకు మందసముగా ఉండిపొయినది. కనుక ఆ కుమారుడు ఉన్నచోటే ఆ తల్లి దేహము కూడా ఉండి పోవడము సముచితమే. ఏ దేహము నుండి క్రీస్తు తన దేహాన్ని చేసుకొన్నాడో, ఆ పునీత దేహము ప్రాణం విడిచాక నాశన మవుతున్నదంటే నేను నమ్మజాలను. కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధి చేరి ఉండాలి’’ (పునీత అగుస్తీను).

No comments:

Post a Comment