ప్రభువు మోక్షారోహణము, Year C

ప్రభువు మోక్షారోహణము, Year C
అ.కా. 1:1-11; ఎఫెసీ. 1:17-23; లూకా. 24:46-53


ప్రభువు మోక్షారోహణము ఒక పరమ రహస్యము
ప్రభువు తన శిష్యులను వీడి తన తండ్రి వద్దకు వెళ్లాడనిఅంతిమ దినమున తిరిగి మరల వస్తారని వాగ్ధానం చేసినట్లుగా బైబిలులో చదువుచున్నాముఈనాటి మొదటి పఠనము, సువిశేష పఠనము క్రీస్తు మోక్షారోహణము గూర్చి చెబుతున్నాయిప్రభువు తన భూలోక పరిచర్యను ముగించుట వలనతద్వారా తిరుసభ పరిచర్య ఆరంభమైనదిశిష్యులు ప్రభువునకు వీడ్కోలు చెబుతున్నారుప్రభువు ఈ లోకమును వీడి వెళ్లుచుండగా శిష్యులకు కొన్ని అనుగ్రహాలను దయచేసారు: (i). లేఖనములు అర్ధమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసెను (లూకా 24:45); (ii). పైనుండి పవిత్రాత్మ శక్తిని వారు పొందుతారని వాగ్ధానం చేసాడు (లూకా 24:49; .కా.1:4); (iii). తన చేతులెత్తి వారిని ఆశీర్వదించి (లూకా 24:50), (iv). అంతిమ దినముల వరకు వారితో ఉంటానని వాగ్ధానం చేసియున్నారుఅప్పుడు శిష్యులు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిఅక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించిరి (లూకా 24:52-53). 

శిష్యులలో గొప్ప మార్పు కలిగినదిక్రీస్తు సిలువ మరణము తరువాత భయముతో పారిపోయి దాగుకొనిన వారిలో ఇప్పుడు గొప్ప మార్పు సంభవించినదికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందారువిశ్వాసములో బలపడిభవిష్యత్తుపై గొప్ప నిరీక్షణ కలిగి యున్నారుయెరూషలేమునుండి భూదిగంతముల వరకు వారు తనకు సాక్షులుగా ఉండవలెనని ప్రభువు వారిని ఆదేశించారు (అ.కా.1:8). ప్రభువు తన అంతిమ సందేశములో, "వెళ్లిసకల జాతి జనులకు పితపుత్రపవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచువారిని నా శిష్యులు చేయుడు" (మత్త. 28:19) అని శిష్యులను కోరారుఅలాగే పవిత్రాత్మశక్తి వరము కొరకు వేచియుండాలని ఆదేశించారుపరలోక దూతలు (తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుష్యులు) శిష్యుల యొద్ద నిలిచి యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరోఅట్లే ఆయన మరల వచ్చును అని వారికి భయమును ఇచ్చారు (అ.కా.1:11).

ప్రభువు మోక్షారోహణ పండుగతన మహోన్నత ఉత్థానము తరువాత 40 రోజులకుతన శిష్యుల సమక్షంలో యేసు ప్రభువు తన శక్తి చేత పరలోకమునకు ఎత్తబడుటను కొనియాడుచున్నదిఈ పండగ ప్రభువు భూలోకంలోని తన రక్షణ కార్యము పరిపూర్తి అయినదని తెలియ జేయుచున్నదిఉత్థానమునకు మోక్షారోహణమునకు మధ్యలో ప్రభువు అనేకమంది విశ్వాసులకు కనిపించి ముఖ్యముగా రెండు విషయాలను రూఢీపరచినారు: మొదటగాతాను వాగ్ధానము చేయబడిన మెస్సయ్య అని నిరూపించారురెండవదిగామరణాన్ని జయించిన తాను ఎవరయితే విశ్వాసములో చివరికంటా జీవిస్తారో వారు కూడా మరణాన్ని జయించి దైవరాజ్యాన్ని పొందుతారని నిరూపించారుపునీత అగుస్తీను వలన ఈ పండుగ విశ్వశ్రీసభ అంతయూ కొనియాడటం జరుగుతుంది.

ప్రభువు మోక్షారోహణ దినమున తాను తన శిష్యులకు ఇచ్చిన సందేశము - వారు ప్రపంచమంతట వెళ్లి సువార్తను బోధించాలిసువార్తను విశ్వసించి జ్ఞానస్నానము పొందువారు రక్షింపబడుదురువిశ్వసింపనివారు ఖండింపబడుదురుక్రీస్తును విశ్వసింపనివారు ఆయన సన్నిధానమును కోల్పోవుదురుఆయనను విశ్వసించువారిని ఆధ్యాత్మిక వరములతో నింపునుప్రభువు నామమున వారు దయ్యములను వెడలగొట్టెదరుఅనేక భాషలలో మాట్లాడగలుగుదురుపాములను చేతులలో ఎత్తి పట్టుదురుఅనారోగ్యులపై వారి చేతులు చాచిన వారు స్వస్థత పొందెదరుక్రీస్తు మోక్షారోహణము అయిన తరువాత శిష్యులు అంతటా వెళ్లి సువార్తను బోధించారు.

మోక్షారోహణము ద్వారా క్రీస్తు తండ్రిలో సంపూర్ణముగా కలకాలము ఐక్యమై యున్నారు"శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెనుఅప్పుడు వారి కన్నులకు కనబడకుండఒక మేఘము ఆయనను కమ్మివేసెను." బైబిలులో "మేఘము" దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుందితండ్రి దేవుడు తన కుమారున్ని తిరిగి తన దరికి తీసుకొని వెళ్ళారు.

మోక్షారోహణముతో శ్రీసభ పరిచర్య మొదలైనదిఅనగా మన పరిచర్య మొదలైనదిక్రీస్తు జీవితముబోధనశ్రమలుమరణముఉత్తానము గూర్చి బోధింపవలసిన బాధ్యత మనందరిపై యున్నదిదేవుని ప్రేమనుదయా కనికరమునుపాపమన్నింపునుదేవునితో, తోటివారితో సఖ్యతను బోధించాలికనుక ఈ సువార్తా పరిచర్యకు మనలను మనము సంసిద్ధము చేసుకోవాలిదీనినిమిత్తమై, పరిశుద్ధాత్మను పొందాలిఅందుకే ప్రభువు శిష్యులను పవిత్రాత్మ రాకడ కొరకు వేచియుండాలని పదేపదే కోరారుమనముకూడా ఆత్మపూరితులము కావాలిఅప్పుడే సువార్త పరిచర్య చేయగలంక్రీస్తుకు సాక్షులముగా ఉండగలంసువార్తా ప్రచారంలో పవిత్రాత్మ మనకి తోడుగా ఉండును

ఈరోజు క్రీస్తు మహిమను ధ్యానిస్తున్నాముతండ్రి మహిమలో కుమారుడు సమానముగా పాలుపంచుకొని యున్నారుతన మహిమలో శ్రీసభను ఎప్పుడు కూడా విడిచిపెట్టరుత్రిత్వైక సన్నిధి శ్రీసభతో ఎల్లప్పుడూ ఉంటుంది (మత్త. 28:20). యేసు మన హృదయాలలో వాసము చేయుచున్నారు అని ఈనాటి పండుగ మనకు గుర్తు చేయుచున్నదిఅలాగే ఆయన శ్రీసభలో వాసము చేయుచున్నారుదివ్యసత్ప్రసాదములో వాసము చేయుచున్నారుఆయన మోక్షారోహణము అయినప్పటికిని ఆయన మనతోనే ఉన్నారు.

మోక్షారోహణ పండుగ క్రీస్తు మెస్సయ్య అని నిశ్చయముగా తెలియజేయు చున్నది. "యేసు నామము"న శిష్యులు పరిచర్య చేయవలెనుఅనగా క్రీస్తు దైవానుసంభూతుడని నిరూపితమగుచున్నదిమోక్షారోహణమున ప్రభువు "తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను." ఇది ఒక సాధారణమైన ఆశీర్వాదము కాదుగొప్ప ప్రధాన యాజకుడిగా వారిని ఆశీర్వదించారు

క్రీస్తు మోక్షారోహణము ఆయన తండ్రి వద్దకు వెళ్లిపోవడము మాత్రమే కాదుఆయన సాన్నిధ్యం మనతో కలకాలం ఉన్నదని ఈ మహోత్సవం మనకు గుర్తు చేయుచున్నదిమనకు ప్రభువు చేసిన రక్షణ కార్యమును మనము కొనసాగించాలిమన ప్రేషిత కార్యములో మనము చేయవలసిన కార్యములు: సువార్తను బోధించాలిఅనగాక్రీస్తు జీవితమునుఆశయమును తెలియ జేయాలిశారీరకఆధ్యాత్మికమగు క్రీస్తు స్వస్థతా పరిచర్యను కొనసాగించాలిపవిత్రాత్మ శక్తిని అనుభవించులాగా చేయాలిక్రీస్తు సాన్నిధ్యమును అనుభవించులాగా చేయాలి.

"మీకు ఆత్మను ప్రసాదింప వలసినదిగమన ప్రభువైన క్రీస్తు దేవుడుమహిమాన్వితుడగు తండ్రిని అర్ధించుచుందునుమీరు ఆయనను ఎరుగునట్లుగఆ ఆత్మ మీకు వివేకమును కలిగించిదేవుడు మీకు విదిత మొనర్చునుఆయన వెలుగును చూచునట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్ధనఅప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచినఆ నిరీక్షణ ఎట్టిదియోఆయన తన ప్రజలకు వాగ్ధానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవోవిశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలిసికొనగలరు" (ఎఫెసీ. 1:17-18).

No comments:

Post a Comment