పునీత మత్తియాసు, 14 మే
(అపోస్తలుడు, వేదసాక్షి
1వ శతాబ్దం)
పునీత మత్తియాసు గురించి అపోస్తలుల
కార్యములు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఏసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో
బాప్తిజం పొందిన కాలం నుండి ప్రభువు అనుచర్లలో ఒకరుగా ఉంటూ వచ్చారు. ప్రభువునకు నమ్మక ద్రోహం చేసిన యూదా ఇస్కారియోత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఏసు
వారి పండ్రెండు మంది ప్రధాన శిషుల్లో ఒక ఖాళీ ఏర్పడింది. వేదవాక్యం నెరవేరునట్లుగా
ఆ ఖాళీ పూరింప బడా ల్సివుంది [అ.కా. 1:20] మరో
శిష్యున్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం ఏసుప్రభువు వారి మోక్షరోహణం
అనంతరం అపోస్తుల్లు ఇరువురు అనుచరుల్ని ఎంపిక చేసారు. వారిలో ఏ ఒక్కరినో అదృష్ట
చీట్లు వేసి ఎన్నుకోవాలనుకున్నారు. వారిరువురిలో ఒకరు యూస్తు అను మారుపెరుగల
బర్సబ్బా అనబడిన యోసేపు మరియు మత్తియాసు [మత్తయ]
గారు. అపోస్తళ్ళు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్ధించి అదృష్ట చీట్లు వేశారు.
చీటి మత్తియాస్ గారి పేరట వచ్చింది. దాంతో పండ్రెండవ అపోస్తాలునిగా
చేర్చుకోబడ్డారు [అ.కా. 1:23-26]. సీమోను పేతురుగారు శ్రీ సభ జగద్గురువులుకాగా
మిగతా అపోస్తళ్ళందరూ పీఠాధిపతులుగా క్రీస్తువారు జీవించిన రోజుల్లో తమ మాటలు చేతలతో అభిషేకితులైనవారే. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం అపోస్తలుడైన మత్యాసుగారు యూదయా, ఇతియోపియా
ప్రాంతాలలో క్రైస్తవాన్ని గురించి భోదించి, అక్కడే సిలువ వేయబడినారని తెలుస్తుంది.
మరికొందరి వాదన ప్రకారం యేరుషలేం వద్ద వారు క్రూరంగా శిరచ్చేదనం గావింపబడ్డారని
ప్రచారంలో ఉంది. మొత్తం మీద క్రిస్తు వారి విశ్వాసం కోసం వేదసాక్షి మరణం పొందారని రుఢీ అవుతుంది. పునీత మత్యాసుగారిని దర్జీపనివాళ్ళు,
వడ్రంగి పనివాళ్ళుకు త్రాగుడు మానే వారికి పాలక పునీతులుగా శ్రీ సభ నియమించింది.
మశూచి ప్రబలినప్పుడు మత్తియాసు గారిని ప్రార్దిస్తే అది తగ్గిపోతుందని ఆనవాయి తీగా
వస్తున్న సనాతన నమ్మకం. మత్యాసు అనగా ‘దేవుడిచ్చిన కానుక’ అని అర్ధం.
ధ్యానాంశం :- నీవు నోరులేనివారి పక్షమున మాటలాడుము.
నిస్సహాయుల కోపు తీసికొనుము [సామె. 31:8]
No comments:
Post a Comment