32 వ సామాన్య ఆదివారము, Year B

32 వ సామాన్య ఆదివారము, Year B
రాజులు మొదటి గ్రంథము 17:10-16; హెబ్రీ. 9:24-28; మార్కు.  12:38-44

ఓ సర్వేశ్వరా! నా ప్రార్ధన మీ సమక్షము చేరునుగాక. చెవియొగ్గి కనికరముతో నా ప్రార్ధన నాలకింపుడు.

ఈనాటి (32 వ సామాన్య ఆదివారము, 11 నవంబర్ 2012) పఠనాలలో ఇద్దరు విధవరాల్ల జీవితాలను గూర్చి వింటున్నాం. మొదటి పఠనములో (1 రాజు. 17:10-16) సారేఫతుకు చెందిన విధవరాలు తన చెంతనున్న కొద్దిపాటి పిండిని, నూనెను, ఏలియా ప్రవక్తతో పంచుకొనియున్నది.  ఆమె మంచితనం, సహాయత, ఔదార్యతకు దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు: కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగి పోలేదు. ఈ సంఘటన, సువిషేశములో చెప్పబడిన - ఐదు రొట్టెలు, రెండు చేపల ఉద్దాంత్తాన్ని గుర్తుకు చేస్తుంది.  ఉన్నది కొద్దిదైనా, ఇతరులతో పంచుకొన్నప్పుడు, అందరికీ సరిపడగా, దేవుడు ఇంకా మిగులునట్లు చేయును.

ఈనాటి సువిశేష పఠనములో (మార్కు. 12:38-44) ధర్మశాస్త్రబోధకులు కానుకల పెట్టెయెద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలు వేయురీతిని పరీక్షించుచుండిరి. వారి యొక్క చూపు ఎక్కువగా డబ్బు వేయు ధనికులపై మాత్రమే ఉండెను. కాని, అక్కడే నున్న యేసుప్రభువు మాత్రం, రెండు రాగి నాణెములను మాత్రమే వేసిన ఒక పేద విధవరాలును చూసెను.  అంతేగాక, ఆయన శిష్యులను పిలచి, "ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే, ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినది" అని చెప్పెను.  ధనికులు తన సమృద్ధి నుండి కానుకలు వేసారు. కాని, పేద విధవరాలు, తన లేమినుండి, తనకు ఉన్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది.

మనకు ఉన్న సమస్తాన్ని అర్పించడం అనగా మన సంపూర్ణ జీవితాన్ని అర్పించడం. ఈ సంఘటనలో ప్రభువు, తాను యేరూషలేమునకు వెళ్లి తనను తాను బలిగా అర్పించుకొనుట వలన ఈ లోక పాపాన్ని రూపుమాపును అని గుర్తించాడు (హెబ్రీ. 9:24-28).

ఈ ఇద్దరు విధవరాల్ల జీవితం మనకి, ఈ లోకానికి నేర్పే పాఠ౦: మనం దేవునికి చెందిన వారముగా జీవించాలి. ఎలా? మన జీవమును పరిపూర్ణము చేస్తూ, ఇతరుల జీవితమును పరిపూర్ణము చేయాలి.

No comments:

Post a Comment