మహిమగిరి క్షేత్రం (Mahimagiri Shrine 26.1.2026)

 మహిమగిరి క్షేత్రం (Mahimagiri Shrine)

ఏలూరు మేత్రాసనం, జానంపేట విచారణ మరియాపురం క్యాంపస్ నడిబొడ్డున వెలసిన మహిమగిరి క్షేత్రం, ఒక చిన్న కొండపై ప్రతిష్టించిన ఒక సాధారణ సిలువ నుండి ఉద్భవించింది. ఖాళీగా ఉన్న సిలువ, క్రీస్తు పునరుత్థానమైన మహిమకు చిహ్నం. అందుకే, దీనికి ‘మహిమగిరి’ అని పేరు వచ్చింది. 1993 ఈస్టర్ ఆదివారం నాడు దీనికి పునాది రాయి పడగా, సరిగ్గా తర్వాతి ఏడాది 1994 ఈస్టర్ ఆదివారం నాటికి ఆశీర్వదించబడింది. దివంగత బిషప్ జాన్ ములగడ గారి ధైర్యవంతమైన ప్రేరణ మరియు ప్రోత్సాహం, బ్రదర్ ఇమ్మాన్యుయేల్ (OFM Cap) గారి ఇంజనీరింగ్ మార్గదర్శకత్వం, మరియు ఫాదర్ జాన్సన్  (OFM Cap) మరియు మరెంతో మంది వ్యక్తులు, సంస్థల సహకారంతో ఈ మహిమగిరి క్షేత్రం రూపుదిద్దుకుంది. దివంగత బిషప్ జాన్ ములగడ గారి ఆత్మీయ ప్రేరణకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను!

ఈ పుణ్యక్షేత్రంలో లేదా ఈ ప్రాంగణంలో ఖాళీ సిలువ, గెత్సెమనే తోటలో వేదన పడుతున్న యేసు స్వరూపం, పియెత ఉన్న చిన్న ప్రార్థనా మందిరం, యేసు ఖాళీ సమాధి, మేత్రాసన గురువుల స్మశానవాటిక, మరియు పరలోకారోహణ దృశ్యాలతో కూడిన పెద్ద వేదిక ఉన్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం మహిమగిరి టవర్!

రక్షణ చరిత్రకు ప్రతిబింబం: ఈ మహిమగిరి టవర్ మొత్తం రక్షణ పరమ రహస్యాలను వివరిస్తుంది:

పాత నిబంధన నుండి, విశ్వసృష్టి, అబ్రాహాము పిలుపు, మోషే ద్వారా ధర్మశాస్త్రం, ప్రవక్తల పశ్చాత్తాప పిలుపు మరియు ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసిన బప్తిస్మ యోహాను దృశ్యాలు అలాగే, నూతన నిబంధన నుండి, మంగళవార్త, యేసు జననం, యేసు పరిచర్య, సిలువ మరణం మరియు పునరుత్థాన దృశ్యాలు కనులకు కట్టినట్లుగా ఉంటాయి! టవర్ పైన ఉన్న భారీ జ్వాల రూపం పరిశుద్ధాత్మ పవిత్రపరిచే సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. మహిమగిరి టవర్, లైట్-హౌస్ లేదా వెలుగుతున్న కొవ్వొత్తి ఆకారంలో నిర్మించబడింది! ఇది పునరుత్థాన క్రీస్తుకు చిహ్నం! అందుకే దీనిని ‘పునరుత్థాన గోపురం’ లేదా ‘మహిమగిరి టవర్’ అని పిలుస్తారు.

దైవ సాన్నిధ్యానికి నిదర్శనం - ఒక అద్భుతం: ఈ టవర్ నిర్మిస్తున్న సమయంలో, ఇది దైవసన్నిధి గల పవిత్ర స్థలమని దేవుడు ఒక అద్భుతం ద్వారా నిరూపించారు! పద్నాలుగేళ్ల ఒక బాలుడు సుమారు 75 అడుగుల ఎత్తు ఉన్న టవర్ పైకప్పు నుండి రాళ్లు, ఇనుప ముక్కల కుప్పపై పడిపోయాడు. కింద పడేటప్పుడు ఎక్కడా స్కాఫోల్డింగ్ లేదా నిర్మాణ సామాగ్రి తగలకుండా, ఎటువంటి గాయం లేకుండా క్షేమంగా నేలపై పడ్డాడు! తాను పైనుంచి జారిపడేటప్పుడు కళ్లు మూసుకుని గట్టిగా అరిచానని, ఎవరో అదృశ్య హస్తాలు తనను కిందకు దించినట్లు అనిపించిందని ఆ బాలుడు చెప్పాడు. ఈ సంఘటన మహిమగిరిలో, మరియాపురంలో మరియు ఏలూరు మేత్రాసనంలో దేవుని సాన్నిధ్యం ఉందని చాటిచెప్పింది.

మరణం మరియు పునరుత్థానం: క్రీస్తు మహిమపరచబడటం అనేది ఆయన సిలువ మరణం నుండి వేరు చేయలేనిది! సిలువ యొక్క సమాంతరం, మరణాన్ని మరియు పునరుత్థానాన్ని అనుసంధానిస్తే, నిలువు దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని, పరలోకాన్ని మరియు భూలోకాన్ని కలుపుతుంది!

మహిమగిరిలో మరియమాత: క్రీస్తు మరణం మరియు పునరుత్థాన పరమరహస్యం మరియమాతలో పరిపూర్ణంగా కనిపిస్తుంది! అందుకే మహిమగిరిలో మరియకు విశిష్ట పాత్ర ఉంది! ఆధ్యాత్మికంగా మరియమ్మను ‘సహ-రక్షకురాలు’ అని పిలుస్తారు. యేసుప్రభువు రక్షణ యాత్రలో మరియమ్మ వెన్నంటే ఉంది. తన జీవితంలోని ప్రతి క్షణంలో ఆమె మరణాన్ని మరియు పునరుత్థానాన్ని అనుభవిస్తూనే ఉంది.

మరియమ్మ, మరణం (దుఃఖం) మరియు పునరుత్థానం (సంతోషం) రెండింటినీ సమానంగా స్వీకరించి, ప్రశాంతంగా ఉండగలిగింది. ప్రతి క్రైస్తవుడు కూడా జీవితంలోని కష్టసుఖాలను దైవిక దృష్టితో స్వీకరించాలని మరియమ్మ మనకు ఆదర్శంగా నిలుస్తుంది.

ముగింపు: ఈ సంవత్సరం కూడా మహిమగిరి పండుగను ఒక ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకోవటం దైవసంకల్పం! మరియమ్మ సంరక్షణలో ‘మరియాపురం క్యాంపస్’ అంతా ఏకమై ఈ దివ్యబలిపూజలో పాల్గొందాం! ఈ బలిపూజను నడిపించడానికి విచ్చేసిన మన మేత్రాసన చాన్సలర్ రెవ. ఫాదర్ ఇమ్మానుయేలు గారికి హృదయపూర్వక స్వాగతం! అలాగే విజయరాయి విచారణ గురువులు రెవ. ఫాదర్ దివాకర్ గారికి, మరియు ఇక్కడకు విచ్చేసిన గురువులకు, మఠకన్యలకు, విశ్వాసులందరికీ హార్దిక స్వాగతం పలుకుచున్నాను. ఇప్పుడు దివ్యబలిపూజ ద్వారా మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ఫాదర్ ఇమ్మానుయేలు గారిని హృదయపూర్వకంగా కోరుచున్నాను!

కృతజ్ఞతా వందనములు

ఈ మహోన్నతమైన మహిమగిరి పండుగను ఇంతటి ఆధ్యాత్మిక శోభతో విజయవంతంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

దేవునికి వందనములు: ముందుగా, ఈ వేడుక అంతా నిర్విఘ్నంగా జరిగేలా దీవించి, మనందరినీ తన సన్నిధిలో చేర్చిన ఆ సర్వేశ్వరునికి కోట్లాది స్తోత్రాలు మరియు వందనాలు! అలాగే మరియాపురం క్యాంపస్ పాలిట సంరక్షురాలు అయిన మరియమ్మకు వందనాలు!

ఫాదర్ ఇమ్మానుయేలు గారికి: ఈ రోజు మన మధ్యకు విచ్చేసి, పవిత్ర దివ్యపూజాబలిని సమర్పించి, మనందరి కొరకు ప్రార్ధన చేసిన ఏలూరు మేత్రాసన చాన్సలర్ రెవ. ఫాదర్ ఇమ్మానుయేలు గారికి మరియాపురం క్యాంపస్ తరుపున, వియాన్ని కాలేజి తరుపున, మరియు ఇక్కడకు విచ్చేసిన మహిమగిరి విశ్వాసులు, భక్తులందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు (Felicitation).

ఫాదర్ బాల గారికి: ఈ రోజు చక్కటి, మధురమైన దేవుని వాక్యాన్ని అంతే మధురంగా బోధించిన రెవ. ఫాదర్ బాల, ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ గారికి మనందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు (Felicitation).

గురువులకు: ఈ దివ్య బలిపూజలో పాల్గొని, భక్తిపూర్వకంగా ప్రార్థించిన గురువులందరికీ, ముఖ్యంగా, విజయరాయి విచారణ గురువులు రెవ. ఫాదర్ దివాకర్ గారికి, ఏలూరు మేత్రాసన గురువులకు, వివిధ మఠవాస, సభ గురువులకు, కపూచిన్ సభ గురువులకు మా కృతజ్ఞతలు!

మరియాపురం క్యాంపస్ రెక్టర్లకు మరియు సుపీరియర్లకు: ఈ పండుగ ఏర్పాట్లలో అడుగడుగునా మాకు అండగా నిలిచి, ఆర్ధికంగా, ఆధ్యాత్మికంగా తమ సహకారాన్ని అందించిన మరియాపురం క్యాంపస్ రెక్టర్లకు మరియు వివిధ సుపీరియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.

SFC గురువులకు మరియు గురు విద్యార్థులకు: ఎంతో క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో, మరియతల్లి స్వరూపంతో ప్రదక్షిణను ముందుండి నడిపించి, దానిని విజయవంతం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి రెక్టర్ ఫాదర్ అనిల్ సుత్తి గారికి, ఇతర గురువులకు మరియు గురు విద్యార్థులకు ధన్యవాదాలు!

గాయక బృందానికి: తమ మధురమైన గొంతులతో, భక్తి గీతాలను ఆలపించి మనల్ని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లిన గాయక బృందానికి, ముఖ్యంగా లూసి సిస్టర్లకు, వియాన్ని కాలేజ్ బ్రదర్లకు, అలాగే కీ బోర్డ్ ప్లే చేసిన MF బ్రదర్కు, పాడ్ ప్లే చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు!

FCC సిస్టర్లకు: పీఠాన్ని ఎంతో అందంగా, భక్తి భావం ఉట్టిపడేలా అలంకరించిన FCC సిస్టర్లకు మా ధన్యవాదాలు.

సహాయం చేసిన గురు విద్యార్థులకు: పూజా కార్యక్రమాలలో మరియు పీఠం వద్ద సేవలందించిన, బ్రిందిసీ భవన్ గురు విద్యార్థులకు, వారి రెక్టర్ ఫాదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు!

కమిల్లస్ బ్రదర్లకు: విశ్వాసుల సౌకర్యం కోసం కుర్చీలు అమర్చడంలో మరియు ఇతర పనులలో శ్రమించిన కమిల్లస్ బ్రదర్లకు, వారి రెక్టర్ ఫాదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు!

సిస్టర్లకు, క్యాంపస్ వాసులకు: వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొనిన సిస్టర్లకు, మరియాపురం నివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు!

MSFS బ్రదర్లకు: టవర్ వద్ద విశ్వాసులను, భక్తులను ఆశీర్వదించిన MSFS బ్రదర్లకు, వారి రెక్టర్ ఫాదర్ గారికి కృతజ్ఞతలు. Announcements చేసిన ఫాదర్ బాల తేజ MSFS గారికి ప్రత్యేక కృతజ్ఞతలు!

పోలీసు వారికి: ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి విచ్చేసిన పెదవేగి పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు!

లైట్, సౌండ్ మరియు టెంట్ వారికి: ఈ కార్యక్రమానికి అవసరమైన సౌండ్ సిస్టం, విద్యుత్ దీపాలు మరియు టెంట్లను సమకూర్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు.

చివరగా, ఈ పండుగలో పాల్గొన్న భక్తులందరికీ మరియు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

పూజ ముగిసిన వెంటనే, మీ అందరి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని తిలకించ వలసినదిగా కోరుచున్నాము. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు SCJ బ్రదర్స్ నిర్వహిస్తున్నారు. వారికీ మా మందస్తు కృతజ్ఞతలు!

మహిమగిరి క్షేత్రం (Mahimagiri Shrine)

ఏలూరు మేత్రాసనం, జానంపేట విచారణ మరియాపురం క్యాంపస్ నడిబొడ్డున వెలసిన మహిమగిరి క్షేత్రం, ఒక చిన్న కొండపై ప్రతిష్టించిన ఒక సాధారణ సిలువ నుండి ఉద్భవించింది. ఖాళీగా ఉన్న సిలువ, క్రీస్తు పునరుత్థానమైన మహిమకు చిహ్నం. అందుకే, దీనికి ‘మహిమగిరి’ అని పేరు వచ్చింది.

1993 ఈస్టర్ ఆదివారం నాడు దీనికి పునాది రాయి పడగా, సరిగ్గా తర్వాతి ఏడాది 1994 ఈస్టర్ ఆదివారం నాటికి ఆశీర్వదించబడింది. దివంగత బిషప్ జాన్ ములగడ గారి ధైర్యవంతమైన ప్రేరణ మరియు ప్రోత్సాహం, బ్రదర్ ఇమ్మాన్యుయేల్ (OFM Cap) గారి ఇంజనీరింగ్ మార్గదర్శకత్వం, మరియు ఫాదర్ జాన్సన్  (OFM Cap) గారి సహకారంతో పాటు, మరెంతో మంది దాతల, సంస్థల కృషితో ఈ మహిమగిరి క్షేత్రం రూపుదిద్దుకుంది.

ఈ ప్రాంగణంలో గెత్సెమనే తోట, పియెత మందిరం, యేసు ఖాళీ సమాధి, సిలువ, మేత్రాసన గురువుల స్మశానవాటిక, పెద్ద వేదికతో కూడిన స్థలం ఉన్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం మహిమగిరి టవర్!

ఇది పాత నిబంధన సృష్టి నుండి నూతన నిబంధన పునరుత్థానం వరకు రక్షణ చరిత్రను కళ్లకు కడుతుంది. టవర్ పైనున్న జ్వాల పరిశుద్ధాత్మ సాన్నిధ్యానికి గుర్తు. మహిమగిరి టవర్, లైట్-హౌస్ లేదా వెలుగుతున్న క్రొవ్వొత్తి ఆకారంలో నిర్మించబడింది! ఇది పునరుత్థాన క్రీస్తుకు చిహ్నం! అందుకే దీనిని ‘పునరుత్థాన గోపురం’ లేదా ‘మహిమగిరి టవర్’ అని పిలుస్తారు.

అద్భుతం సాక్ష్యం: ఈ టవర్ నిర్మిస్తున్న సమయంలో, ఇది దైవసన్నిధి గల పవిత్ర స్థలమని దేవుడు ఒక అద్భుతం ద్వారా నిరూపించారు! ఒక బాలుడు సుమారు 75 అడుగుల ఎత్తు ఉన్న టవర్ పైకప్పు నుండి రాళ్లు, ఇనుప ముక్కల కుప్పపై పడిపోయాడు. అయితే, అద్భుతరీ తిన, ఎటువంటి గాయం లేకుండా క్షేమంగా నేలపై పడ్డాడు! “తాను పైనుంచి జారిపడేటప్పుడు కళ్లు మూసుకుని గట్టిగా అరిచానని, ఎవరో అదృశ్య హస్తాలు తనను కిందకు దించినట్లు అనిపించిందని” ఆ బాలుడు సాక్ష్యమిచ్చాడు! ఈ సంఘటన మహిమగిరిలో, మరియాపురంలో మరియు ఏలూరు మేత్రాసనంలో దేవుని సాన్నిధ్యం ఉందని చాటిచెప్పింది!

మరణం మరియు పునరుత్థానం: క్రీస్తు మహిమపరచబడటం అనేది ఆయన సిలువ మరణం నుండి వేరు చేయలేనిది! సిలువ యొక్క సమాంతరం, మరణాన్ని మరియు పునరుత్థానాన్ని అనుసంధానిస్తే, సిలువ యొక్క నిలువు, దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని, పరలోకాన్ని మరియు భూలోకాన్ని కలుపుతుంది!

మహిమగిరిలో మరియమాత: క్రీస్తు మరణం, పునరుత్థాన పరమరహస్యం, మరియమాతలో పరిపూర్ణంగా కనిపిస్తుంది! అందుకే మహిమగిరిలో మరియకు విశిష్ట పాత్ర ఉంది! యేసుప్రభువు రక్షణ యాత్రలో మరియమ్మ వెన్నంటే ఉంది. తన జీవితంలోని ప్రతి క్షణంలో ఆమె మరణాన్ని మరియు పునరుత్థానాన్ని అనుభవిస్తూనే ఉంది. మరియమ్మ, మరణం (దుఃఖం) పునరుత్థానం (సంతోషం) రెండింటినీ సమానంగా స్వీకరించి, ప్రశాంతంగా ఉండగలిగింది. ప్రతి క్రైస్తవుడు కూడా జీవితంలోని కష్టసుఖాలను దైవిక దృష్టితో స్వీకరించాలని మరియమ్మ మనకు ఆదర్శంగా నిలుస్తుంది!

ముగింపు: ఈ సంవత్సరం కూడా మహిమగిరి పండుగను ఒక ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకోవటం దైవసంకల్పం! మరియమ్మ సంరక్షణలో ‘మరియాపురం క్యాంపస్’ అంతా ఏకమై ఈ దివ్యబలిపూజలో పాల్గొందాం! ఈ బలిపూజను సమర్పించడానికి విచ్చేసిన మన మేత్రాసన చాన్సలర్ రెవ. ఫాదర్ ఇమ్మానుయేలు గారికి హృదయపూర్వక స్వాగతం! అలాగే, ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ రెవ. ఫాదర్ బాల గారికి సుస్వాగతం! విజయరాయి విచారణ గురువులు రెవ. ఫాదర్ దివాకర్ గారికి, మరియు ఇక్కడకు విచ్చేసిన గురువులకు, మఠకన్యలకు, మరియు విశ్వాసులకు, భక్తులందరికీ హార్దిక స్వాగతం పలుకుచున్నాను. దివ్యబలిపూజ ద్వారా మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా, ఫాదర్ ఇమ్మానుయేలు గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కోరుచున్నాను!

No comments:

Post a Comment