గురువుల పవిత్రీకరణ కొరకు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భముగా
పొప్ లియో XIV సందేశము
[27 జూన్ 2025, యేసు తిరు హృదయ మహోత్సవము]
ప్రియ సోదర గురువులారా!
యేసు
పవిత్ర హృదయ మహోత్సవమును పురస్కరించుకొని మనం జరుపుకుంటున్న గురువుల
పవిత్రీకరణ దినోత్సవం నాడు,
ప్రియ గురువులైన మీ అందరికీ నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను.
ప్రేమతో
గాయపడిన క్రీస్తు హృదయం, సజీవంగా,
జీవంతో నిండిన శరీరమై మనందరినీ అక్కున చేర్చుకుంటుంది. అది మనల్ని మంచి కాపరి స్వరూపంలోకి
మారుస్తుంది. అక్కడే మన సేవ యొక్క నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటాం.
దేవుని దయతో నిండినవారమై, స్వస్థపరిచే, తోడుగా
ఉండే, మరియు విమోచించే ఆయన ప్రేమకు మనం ఆనందంతో
సాక్ష్యమిస్తాం.
నేటి ఈ
మహోత్సవము, దేవుని పవిత్ర ప్రజలకు సేవ చేయడానికి మనల్ని
పూర్తిగా అంకితం చేసుకోవాలనే పిలుపును మన హృదయాల్లో తిరిగి నింపుతుంది. ఈ సేవ ప్రార్థనతోనే ప్రారంభమై, ప్రభువుతో
ఐక్యతలో కొనసాగుతుంది. ఆయన
మనలో యాజకత్వానికి సంబంధించిన పవిత్ర వరాన్ని నిరంతరం పునరుజ్జీవింపజేస్తూనే ఉంటారు.
ఈ అనుగ్రహాన్ని మనం
హృదయంలో నిలుపుకోవడం అంటే, పునీత అగుస్తీను గారు చెప్పినట్లుగా, “విశాలమైన
మరియు లోతైన అంతర్గత మందిరంలోకి” ప్రవేశించడమే (cf. కన్ఫెశ్శన్స్,
X, 8.15). ఇది కేవలం గతాన్ని గుర్తుచేసుకోవడం కాదు,
దాని గొప్ప సంపదలను ఎల్లప్పుడూ నూతనముగా, ప్రస్తుతానికి
తగినట్లుగా నిలుపుకోవడం. ఇలాంటి జ్ఞాపకం ద్వారానే ప్రభువు మనకు అప్పగించిన, ఆయన
పేరిట పంచమని ఆదేశించిన ఆ వరాన్ని మనం అనుభవించగలం, పునరుద్ధరించగలం. ఈ జ్ఞాపకం,
మన హృదయాలను క్రీస్తు హృదయంతో, మన
జీవితాలను ఆయన జీవనంతో ఏకం చేస్తుంది. తద్వారా, ప్రేమతో
నిండిన సఖ్యతగల లోకాన్ని తీసుకురావడానికి,
దేవుని పవిత్ర ప్రజలకు రక్షణ
వాక్యాన్ని, దివ్యసంస్కారాలను అందించడానికి
ఇది మనకు మార్గం సుగమం చేస్తుంది. యేసు
హృదయంలోనే మనం దేవుని బిడ్డలుగా, ఒకరికొకరు
సోదరసోదరీమణులుగా మన నిజమైన మానవత్వాన్ని గుర్తించగలం. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో
ఉంచుకొని, ఈరోజు నేను మీకు ఒక హృదయపూర్వక
విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, అదేమిటంటే, మీరు ఐక్యతను, శాంతిని నిర్మించండి!
ప్రపంచవ్యాప్తంగా,
కుటుంబాల్లో, అలాగే వివిధ సంఘాలలో కూడా ఉద్రిక్తతలు
పెరుగుతున్న ఈ తరుణంలో, గురువులు సఖ్యతను ప్రోత్సహించి, ఐక్యతను
పెంపొందించడం అత్యవసరం. ఐక్యతను,
శాంతిని నిర్మించాలంటే, మనం వివేకవంతమైన
విచక్షణ గల కాపరులుగా ఉండాలి. మనకు అప్పగించిన
జీవితాల్లోని చీలికలను తిరిగి ఏకము చేయగలిగే నైపుణ్యం మనకు
ఉండాలి. అప్పుడే జీవితంలోని కష్టాల మధ్య కూడా ప్రజలు సువార్త
వెలుగును చూడగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకొని, విశ్లేషించే
సామర్థ్యం దీనికి చాలా ముఖ్యం. అంతేకాకుండా, క్షణికమైన
భావోద్వేగాలు, భయాలు, తాత్కాలిక పోకడల ఒత్తిడిని అధిగమించగలగాలి. దీనివల్ల, మంచి
సంబంధాలను, ఐక్యతా బంధాలను, సహభాగ్యపు
స్ఫూర్తితో ప్రకాశించే సంఘాలను నిర్మించడం ద్వారా విశ్వాసాన్ని
పునరుజ్జీవింపజేసే మరియు తిరిగి నిలిపే ఆధ్యాత్మిక పరిష్కారాలను అందించడం
సాధ్యపడుతుంది. ఐక్యతకు, శాంతికి నిర్మాతలుగా ఉండటం అంటే సేవ చేయడమే తప్ప,
అధికారం చెలాయించడం కాదు. మనం
గురువులుగా కలిసి సాగే ప్రయాణంలో యాజక
సహోదరత్వం ఒక ప్రత్యేక లక్షణంగా ఉన్నప్పుడు, అది పునరుత్థానమైన ప్రభువు మన
మధ్య ఉన్నాడనడానికి నమ్మదగిన సంకేతం అవుతుంది.
ఈ రోజు,
మీ గురుపట్టాభిషేకం నాడు దేవునికి, ఆయన
పవిత్ర ప్రజలకు మీరు ఇచ్చిన “అవును”
అను మాటను క్రీస్తు హృదయమునందు పునరుద్ధరించుకోవాలని నేను
మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కృప ద్వారా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఆ
రోజు మీరు పొందిన ఆత్మ అగ్నిని కాపాడుకోండి.
తద్వారా, ఆయనతో ఐక్యమై, మీరు
లోకంలో యేసు ప్రేమకు సజీవ సంస్కారంగా మారవచ్చు.
మీ వ్యక్తిగత బలహీనతకు భయపడకండి: ప్రభువు పరిపూర్ణ గురువులను కోరడు, కానీ మారుమనస్సుకు సిద్ధంగా ఉన్న, ఇతరులను
ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్న వినయపూర్వకమైన
హృదయాలను మాత్రమే కోరతాడు.
ప్రియమైన
సోదర గురువులారా, పోప్ ఫ్రాన్సిస్ గారు మనల్ని పవిత్ర హృదయానికి తిరిగి
అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఇది ప్రభువుతో మన వ్యక్తిగత అనుభవానికి (cf.
అపోస్తలుల
రాణి, గురువుల తల్లి అయిన మరియ
మాతకు మీ అందరినీ అప్పగిస్తూ, హృదయపూర్వక
ఆశీస్సులు మీకు అందిస్తున్నాను.
వాటికన్, జూన్ 27, 2025
లియో PP. XIV
మూలము:
గురుశ్రీ
ప్రవీణ్ గోపు OFM
Cap.
No comments:
Post a Comment