లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 28 మే 2025
ఉపదేశం – జూబిలీ
2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 7.
“యేసుక్రీస్తు మన నిరీక్షణ. సమరీయుడు. “వానిని
చూడగనే అతడు జాలిపడెను” (లూకా 10:33).
ప్రియమైన సహోదరీ సహోదరులారా,
సువార్తలోని కొన్ని ఉపమానాలను మనం ధ్యానిస్తూనే ఉందాం. ఇవి మన దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు నిరీక్షణకు మనల్ని మనం తెరచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట, మొండి మరియు మూసివేసిన రీతిలో విషయాలను చూడటం వలన నిరీక్షణ లేకపోవడం కలుగుతుంది. ఇలాంటి సమయాలలో ఉపమానాలు వాటిని మరొక కోణం నుండి చూడటానికి మనకు సహాయపడతాయి.
ఈరోజు నేను ఒక నిపుణుడైన, విజ్ఞానం గల, ధర్మశాస్త్ర బోధకుని గురించి చెప్పాలనుకుంటున్నాను. తనలో తాను లీనమై, తనపైనే దృష్టిని సారించడం వల్ల, ఇతరులను గమనించలేకుండా ఉన్నందున అతను తన దృక్పథాన్ని మార్చుకోవాలి (లూకా 10:25-37). వాస్తవానికి, నిత్య జీవం పొందుటకు ఏమి చేయాలి? అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాడు. నిత్య జీవాన్ని నిస్సందేహమైన హక్కుగా భావించే పదాన్ని అతను ఉపయోగించాడు. అయితే, బహుశా ఈ ప్రశ్న వెనుక నున్న ఉద్దేశాన్ని గమనించాలి: “నా పొరుగువాడు ఎవడు?” అని ప్రశ్నించడం ద్వారా, ‘పొరుగువాడు’ అనే పదాన్ని వివరించమని యేసును కోరుచున్నాడు. ‘పొరుగువాడు’ అన్న పదానికి ‘దగ్గరగా ఉన్నవాడు’ అని అర్థం.
అందువల్ల, యేసు సమాధానమిస్తూ ఒక ఉపమానాన్ని చెప్పియున్నారు. ఈ ఉపమానం "నన్ను ఎవరు ప్రేమిస్తారు?" అనే ప్రశ్న నుండి "నన్ను ఎవరు ప్రేమించారు?" అన్న దానిపై దృష్టిని మరల్చడానికి ఒక మార్గం. మొదటిది అపరిపక్వమైన ప్రశ్న. రెండవది తన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్న వ్యక్తియొక్క ప్రశ్న. మొదటి ప్రశ్న మనం ఒక మూలగా కూర్చుని వేచియున్నప్పుడు అడిగేది. రెండవది మనల్ని మార్గంలో నడచుటకు పురికొల్పే ప్రశ్న.
యేసు చెప్పిన ఉపమానంలో, వాస్తవానికి ఒక త్రోవ/మార్గం నేపథ్యంగా ఉంది. అది జీవితం వలె కష్టమైన మరియు అసాధ్యమైన మార్గం. పర్వతం మీదనున్న యెరూషలేము నగరం నుండి, సముద్ర మట్టానికి దిగువనున్న యెరికో నగరానికి ఒక వ్యక్తి క్రిందికి వెళ్ళే మార్గం అది. ఎప్పుడు ఏమి జరుగునోనని ముందుగానే తెలియజేసే ఒక చిత్రం అది: ఊహించినట్లుగానే, ఆ వ్యక్తి దాడి చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, దోచుకోబడ్డాడు మరియు కొన ఊపిరితో వదిలివేయబడ్డాడు. పరిస్థితులు, వ్యక్తులు, కొన్నిసార్లు మనం నమ్మినవారే మన నుండి సమస్తాన్ని దోచుకుని మనల్ని నడి రోడ్డున పడవేసినప్పుడు ఎదురయ్యే అనుభవం లాంటిదే ఇది.
అయితే, జీవితం పోరాటాలను ఎదుర్కోవడంతో కూడి ఉంటుంది. ఈ పోరాటాలను ఎదుర్కోవడంలో, మనం ఎవరో మనం తెలుసుకోగలుగుతాము. ఇతరుల ముందు, వారి పెళుసుదనం, బలహీనతను ఎదుర్కొంటూ, మనం ఏమి చేయాలో నిర్ణయించుకోవచ్చు: వారిని జాగ్రత్తగా చూసుకోవడం లేదా ఏమీ తప్పు చేయనట్లు నటించడం. ఒక యాజకుడు మరియు ఒక లేవీయుడు అదే మార్గంలో వెళ్లారు. వారు యెరూషలేము దేవాలయంలో సేవ చేసే వ్యక్తులు, పవిత్ర స్థలంలో జీవించేవారు. అయినప్పటికీ, ఆరాధన చేసినంత మాత్రాన కరుణతో ఉండటానికి దారి తీయదు! నిజానికి, మతపరమైన విషయం కంటే ముందుగా, కరుణ మానవత్వానికి సంబంధించిన విషయం! విశ్వాసులం కాకముందే, మనం మానవులుగా ఉండాలని పిలవబడ్డాము.
యెరూషలేములో చాలా కాలం గడిపిన తర్వాత, ఆ యాజకుడు మరియు ఆ లేవీయుడు ఇంటికి తిరిగి వెళ్ళడానికి తొందరపడుతున్నారని మనం ఊహించవచ్చు. మన జీవితాలలో కూడా ఈ ‘తొందరపాటు’ చాలా తరచుగా ఉండటం వలన కరుణను అనుభూతి చెందకుండా మనల్ని అడ్డుకుంటుంది. సొంత ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వాలని భావించేవారు మరొకరి కోసం ఆగడానికి సిద్ధంగా ఉండరు.
కానీ ఇక్కడ ఆగగలిగే ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక సమరీయుడు. అతను తృణీకరించబడిన ప్రజలకు చెందిన వ్యక్తి (2 రాజులు 17). సమరీయుని విషయంలో, సువార్త పఠనం అతని దిశను నిర్దిష్టంగా చెప్పలేదు, కానీ అతను అటు పయనమై పోవుచున్నట్లుగా మాత్రమే చెబుతుంది. ఇక్కడ మత సంబంధమైన విషయాలకు చోటు లేదు. ఈ సమరీయుడు గాయపడిన వ్యక్తిని చూసి ఆగాడు, ఎందుకంటే అతను సహాయం అవసరమైన మరొక వ్యక్తిని ఎదుర్కున్నాడు.
కరుణ (జాలి) ఆచరణాత్మక చర్యల ద్వారా వ్యక్తమవుతుంది. లూకా సువార్తీకుడు సమరీయుని చర్యలను పరిశీలిస్తాడు. మనం అతనిని ‘మంచివాడు’ (మంచి సమరయుడు) అని పిలుస్తాము, కానీ సువార్తలో అతను కేవలం ఒక వ్యక్తి. సమరీయుడు గాయపడిన వ్యక్తి ‘దగ్గరకు వెళ్ళాడు’. మీరు ఒకరికి సహాయం చేయాలనుకుంటే, దూరం పాటించాలని, తప్పుకోవాలని అనుకోలేరు; మీరు పాల్గొనాలి, మురికిగా మారాలి, బహుశా కలుషితం కావచ్చు. అతను గాయాలకు తైలముతో శుభ్రం చేసి, తర్వాత ద్రాక్షారసము పోసి కట్టు కట్టాడు. పిమ్మట అతనిని తన గుర్రంపై కూర్చుండబెట్టి, ఆ వ్యక్తి భారాన్ని మోసాడు. ఎందుకంటే మరొకరి బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే, నిజంగా సహాయం చేయగలరు. ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించాడు. అక్కడ అతను డబ్బు, ‘రెండు దీనారములు’ (రెండు వెండి నాణెములు), సుమారు రెండు రోజుల తన సంపాదనను సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టాడు. మరియు ఎక్కువ వ్యయము అయినచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లించడానికి అంగీకరించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి డెలివరీ చేయాల్సిన పార్సిల్ కాదు; శ్రద్ధ వహించాల్సిన వ్యక్తి.
ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనం కూడా ఎప్పుడు మన ప్రయాణాన్ని ఆపి, కనికరం చూపగలం? వీధిలో గాయపడిన వ్యక్తి మనలో ప్రతి ఒక్కరిని సూచిస్తాడని అర్థం చేసుకున్నప్పుడు, అలాగే యేసు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆగిన సమయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవసరంలో ఉన్న వారిపట్ల మనం మరింత కనికరపడేలా చేస్తుంది.
కాబట్టి, మనం మానవత్వంలో ఎదగాలని ప్రార్థన చేద్దాం! అప్పుడు, మన సంబంధాలు మరింత నిజమైనవిగా, కరుణతో నిండినవిగా ఉంటాయి. యేసు హృదయం వలెనే కనికరం కలిగి ఉండటానికి ఆ తిరు హృదయాన్ని వేడుకుందాం
విజ్ఞప్తి
ఈ రోజుల్లో, నా ఆలోచనలు తరచుగా ఉక్రేనియన్ ప్రజల వైపు వెళుతున్నాయి. పౌరులు మరియు మౌలిక సదుపాయాలపై తీవ్రమైన కొత్త దాడుల వల్ల వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులందరికీ, ముఖ్యంగా పిల్లలు మరియు కుటుంబాలకు, నా సాన్నిహిత్యాన్ని మరియు ప్రార్థనను హామీ ఇస్తున్నాను.
యుద్ధాన్ని ఆపాలని మరియు సంభాషణ, శాంతికి సంబంధించిన ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని నేను నా విజ్ఞప్తిని గట్టిగా పునరుద్ఘాటిస్తున్నాను. ఉక్రెయిన్‌లో మరియు యుద్ధం వల్ల బాధపడుతున్న ప్రతిచోటా శాంతి కోసం ప్రార్థనలో పాలుపంచుకోవాలని అందరినీ కోరుతున్నాను.
గాజా స్ట్రిప్‌లో, పిల్లల నిర్జీవ దేహాలను పట్టుకున్న తల్లిదండ్రుల ఆక్రందనలు ఆకాశానికి మరింత తీవ్రంగా పెరుగుతున్నాయి. అలాగే, బాంబు దాడుల నుండి కొద్దిపాటి ఆహారం మరియు సురక్షితమైన ఆశ్రయం కోసం వారు నిరంతరం ఒక చోట నుండి మరొక చోటకు కదలవలసి వస్తుంది.
నేను నాయకులకు నా విజ్ఞప్తిని పునరుద్ధరిస్తున్నాను: కాల్పుల విరమణ చేయండి, బందీలను అందరినీ విడుదల చేయండి, మానవతా చట్టాన్ని పూర్తిగా గౌరవించండి. సమాధాన రాజ్ఞి మరియా, మా కొరకు ప్రార్థించు.
ప్రత్యేక శుభాకాంక్షలు:
నేడు ఈ సాధారణ సమావేశములో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులు మరియు సందర్శకులకు, ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్వే, ఘనా, కెన్యా, ఆస్ట్రేలియా, చైనా, హాంగ్ కాంగ్, ఇండియా, ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారికి సంతోషంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రభువు మోక్షారోహణను మనం స్మరించుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ మరియు మీ కుటుంబాలు నిరీక్షణ మరియు ఆనందాన్ని పునరుద్ధరించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక!

పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:
ప్రియమైన సహోదరీ సహోదరులారా: “క్రీస్తు మన నిరీక్షణ” అనే జూబిలీ అంశంపై కొనసాగుతున్న బోధనలలో, ‘మంచి సమరయుడు’ అను మరొక ఉపమానమును ధ్యానిద్దాం. ఈ కథ ద్వారా, కనికరం చూపడం ద్వారా నిత్యజీవితం లభిస్తుందని యేసు మనకు బోధిస్తున్నారు. చూచియు తప్పుకొని పోయిన యాజకుడు మరియు లేవీయుడు వలె, కొన్నిసార్లు మనం మన స్వంత ప్రయోజనాలలో మరియు జీవితంలోని బిజీలో చిక్కుకొని, మన చుట్టూ ఉన్నవారికి నిజమైన పొరుగువారుగా ఉండటంలో విఫలమవుతున్నాము. మంచి సమరయుడు తన కనికరముతో మనలను ఆశ్చర్యపరచాడు మరియు అతని ఉదారత మన స్వార్థాన్ని విడనాడటానికి మనల్ని సవాలు చేస్తుంది. దొంగల చేతుల్లో పడిన వ్యక్తిలో మనం కూడా మనల్ని చూసుకోవచ్చు, ఎందుకంటే మనమందరం జీవితంలోని కష్టాలను మరియు పాపం వల్ల కలిగే బాధను అనుభవిస్తున్నాము. మన బలహీనతలో, క్రీస్తు స్వయంగా మన గాయాలను నయం చేసి, మన నిరీక్షణను పునరుద్ధరించే మంచి సమరయుడు అని మనం కనుగొంటాము. కాబట్టి, నిజమైన మానవత్వానికి నమూనైన యేసు పవిత్ర హృదయం వైపు తిరుగుదాం, మరియు మన హృదయం ఆయన వలెనే మారాలని ఆయనను వేడుకుందాం.
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250528-udienza-generale.html
ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment