పాస్కా నాలుగవ శనివారము
అ.కా. 13:44-52; యోహాను
14:7-14
ధ్యానం: తండ్రియు,
కుమారుడు ఒక్కరే
“ప్రభూ! మాకు
తండ్రిని చూపుము మాకు అది చాలును!” అని ఫిలిప్పు అన్నాడు. ప్రభునిలో తండ్రిని ఎలా
చూడగలము? తండ్రి కుమారున్ని ఈ లోకమునకు మనలను రక్షించుట కొరకే గాక, తండ్రిని మనము
తెలుసుకొనుటకు పంపెను. “నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు” (యో 14:9). శిష్యులు
ప్రార్ధన నేర్పమని కోరినప్పుడు, పరలోక తండ్రి... అను జపమును నేర్పించాడు (మత్త
6:9-10). ఆదిలో వాక్కుగా క్రీస్తు తండ్రితో ఉండగా, దేవుని కుమారునిగా ఈ లోకములో
అవతరించినాడు. “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (యో 10:30). యేసును చూచినచో,
తండ్రిని చూచినట్లే.
యేసు ఎప్పుడు కూడా
తండ్రితో ఐఖ్యమై జీవించాడు. తండ్రి చిత్తమునకు లోబడి జీవించాడు. నిత్యజీవమును
పొందుటకు మనం కూడా క్రీస్తువలె తండ్రి దేవునితో ఐఖ్యమై, ఆయన సహవాసములో జీవించాలి.
తండ్రి ప్రేమలో మనం జీవించాలి. దైవీక జీవితమును మనలో నింపుకొని జీవించాలి. క్రీస్తును
విశ్వసించు వారు ఆయన చేయు క్రియలను చేయును. అంతకంటె గొప్ప క్రియలను చేయును (యో
14:12). గొప్పక్రియలు అనగా కేవలం అద్భుతాలు మాత్రమే కాదు. క్రీస్తు ప్రేషిత
కార్యము (యో 4:34; 17:4) అని, నైతిక కార్యాలు (యో 3:19-21; 7:7; 8:39, 41) అని
కూడా అర్ధము. దేవుని ఆజ్ఞలను పాటించడం (యో 14:15) దేవుని యొక్క కార్యమును చేయడం.
ఎందుకన, సువార్తలలో “క్రియలు” అనగా దేవుని చిత్తమును నెరవేర్చడం అన్న అర్ధాన్ని
స్పురిస్తుంది. కనుక, క్రీస్తు ప్రేషిత కార్యాన్ని మన మాటలలో, చేతలలో
కొనసాగించాలి.
క్రీస్తు ప్రేషిత కార్యాన్ని కొనసాగించడం ద్వారా, పవిత్రాత్మ కార్యముద్వారా క్రీస్తులో పరిపూర్ణముగా ఐఖ్యమగుట వలన, తద్వారా తండ్రి దేవునితో ఐఖ్యమగుచున్నాము. క్రీస్తు ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలంటే, దేవునిపట్ల, తోటివారిపట్ల షరతులులేని ప్రేమను కలిగి జీవించాలి. షరతులుగల ప్రేమ ఐఖ్యతకు ఆటంకం. షరతులులేని ప్రేమ సామరస్యం, శాంతి, ఐఖ్యతను పెంపొందించును.
No comments:
Post a Comment