జ్ఞానవివాహము 4
1. వివాహము-కుటుంబము: దేవుని ప్రణాళిక
వివాహము, కుటుంబ జీవితము రెండుకూడా దేవుని ప్రణాళికలే! దేవుడు ఈ విప్రణాళికను మానవాళికి సృష్టి ఆరంభముననే బహిర్గతపరచాడు. వివాహస్థాపనకు ముఖ్యకారణం: మొదటిగా, దేవుడు మానవులను తన పోలికలో సృజించి, తన దైవస్వభావములో పాలుపంచుకొనుటకు పిలచియుండటం. (1 యోహా, 4:16). రెండవదిగా, వారిని స్త్రీ,పురుషులుగా సృజించడం. మూడవదిగా, దైవప్రేమ. దేవుడు ప్రేమ, అలాగే, దేవుడు మానవునికి ఏర్పాటు చేసిన విధి లేదా గమ్యం. ఈ మూడు కారణాల వలన, మానవుడు ఎప్పుడుకూడా దేవునితో బాంధవ్యాన్ని కలిగియున్నాడు. మనిషి దేవునిపై ఆధారపడి జీవిస్తూ యున్నాడు. అలాగే, స్త్రీ,పురుషులుగా సృజించబడ్డారు కాబట్టి, ఒకరితో ఒకరుకూడా బాధవ్యాన్నికలిగియున్నారు. ఈ బాంధవ్యం వివాహానికి, కుటుంబ జీవితానికి నడిపిస్తుంది. వివాహము, కుటుంబ జీవితానికి నాంది. దానర్ధం, కుటుంబ జీవితం, వివాహ వ్యవస్థపై ఆధారపడి యుండాలి. “సహజీవనం’నకు (cohabitation) చోటు లేదు.
వివాహము అనగా జ్ఞానస్నానం పొందిన ఒక స్త్రీ, ఒక పురుషుని మధ్యన ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ (no gay and lesbian marriages, Eunuch marriages?). కనుక, వివాహ వ్యవస్థ, మానవాళియొక్క పితృస్వామ్యం (patrimony) మరియు మానవాళి ఉమ్మడి ప్రయోజనం (common good) కోసం ఏర్పాటు చేయబడింది. శ్రీసభ యొక్క చట్టం (నం. 1055) కూడా ఈ విషయాలను స్పష్టం చేస్తుంది. 1917 చట్టం, వివాహం ఒక ఒప్పందం అని చెప్పినను, ద్వితీయ వాటికన్ మహాసభ వివాహము ఒక ఒడంబడిక (covenant) అని తెలియజేయుచున్నది. ఎందుకంటే, వివాహము అనేది కేవలం ఒక చట్టపరమైన ఒప్పందం మాత్రమేగాక, అది ఒక ఆధ్యాత్మిక ఒప్పందం. ఈ ఆధ్యాత్మిక ఒప్పందం ప్రతిజ్ఞలు, వాగ్దానాలు చేయుటనుండి వస్తుంది. ఈకారణం చేతనే, ఈ ఒడంబడిక వలననే, స్త్రీ,పురుషులు జీవితాంతము అనగా మరణం వరకు, తమ బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటారు.
ఈ ఆధునిక ప్రపంచములో, ప్రబలిపోతున్న, విస్తరించిపోతున్న అపోహ భావాలు, తప్పుడు భావాలు వివాహముయొక్క సత్యాన్ని మరుగున పడేస్తున్నాయి. కుటుంబం అనేది మానవీయ మరియు ఆధ్యాత్మిక నెరవేర్పు, ప్రక్రియ అని, ప్రభువు, తన అనుగ్రహముతో ఎల్లప్పుడు కుటుంబాలలో ఉంటాడని మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. ఈరోజు, అపోహ భావాలకు, తప్పుడు భావాలకు ఆకర్షితులై, దేవుని ప్రణాళికను అనేకమంది కాలరాస్తున్నారు. దేవుని ప్రణాళికను గౌరవించడం లేదు. మనం ఎంత వరకు వెళ్ళామంటే, వివాహ వ్యవస్థలో కొత్తకొత్త పద్ధతులను సూచించే వరకు వెళ్తున్నాము!
ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని, తిరుసభను నిర్మించాలంటే, స్త్రీ-పురుషుల మధ్యగల వివాహముపై ఆధారపడిన కుటుంబం వలన మాత్రమే సాధ్యమగునని తెలుసుకోవాలి. ‘వివాహసత్యము’లోనున్న అందాన్ని యేసుప్రభువు కూడా గుర్తించాడు. మత్తయి 19వ అధ్యాయములో, పరిసయ్యులు, “ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్దమా?” అని ప్రశ్నించారు. అందుకు యేసు, ప్రారంభమునుండి సృష్టికర్త వారిని స్త్రీపురుషులుగా సృజించెనని మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొని యుండును. వారు ఇరువురు ఏక శరీరులై యుందురు. కనుక వారు భిన్నశరీరులు కాక, ఏకశరీరులై యున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు” అని సమాధాన మిచ్చాడు (19:4-6). యేసుయొక్క ఈ సమాధానం సృష్టి ఆరంభములోని దేవుని ప్రణాళికను గుర్తుచేస్తుంది: ఆది. 1:27 – “దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీపురుషులుగా వారిని సృజించెను.” అలాగే ఆది. 2:24 – “కావుననే, నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొనును. వారిరువురు ఏక శరీరులగుదురు.”
కాబట్టి, వివాహము, కుటుంబము సృష్టి ఆరంభములోనే స్త్రీపురుషుల సృష్టితోనే, స్వాభావికముగా ఏర్పాటు చేయబడ్డాయి. కనుక, నేటి ఆధునిక కాలములో, వివాహానికి, కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని, సృష్టి ఆరంభములోనే దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో కనుగొనాలి. సృష్టికర్త, రక్షకుడు అయిన దేవునియందుగల విశ్వాస వెలుగులో పరిష్కారాలను చవిచూడాలి.
గుర్తించండి: వివాహం, కుటుంబం స్వాభావికముగా ఏర్పాటు చేయబడ్డాయి మరియు దేవుని చట్టముతో ఏకీభవిస్తున్నాయి. స్త్రీపురుషుల మధ్య బాంధవ్యం సహజమైనది లేదా అంతర్గతమైనది (intrinsic). కనుక, భార్యాభర్తల బంధం సహజమైనది, వాస్తవమైనది. కనుక, వివాహ బంధాలు అవసరంకొద్ది ఏర్పడేవి ఎంతమాత్రము కావు. సృష్టి ఆరంభములోనే దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, వ్యవస్థ. దేవుడు ఏర్పాటు చేసిన వివాహము, లైంగిక జీవితము, సంతానము వలన, కుటుంబములోని సహవాస జీవితము, ప్రేమద్వారా, దేవునియొక్క ఐఖ్యతలోను, సహవాసములోను పాలుపంచుకొను చున్నాము. ప్రేమ, ఐఖ్యత కలిగి జీవించినప్పుడే, దేవుని పోలికలో జీవించగలుగుతాము.
2.
వివాహము – దివ్యపూజలో కొనియాడు వేడుక
దివ్యసంస్కార వివాహము క్రీస్తుకు-తిరుసభకు మధ్యనున్న ఒడంబడిక బంధానికి ప్రతీక, ప్రతిరూపం. దేవునికి-మానవునికి మధ్యన ఎప్పటికి మాయని బంధానికి ఇది సూచన, గుర్తు. కనుక, ఎప్పుడైతే, వివాహము ఇరువురు జ్ఞానస్నానం పొందిన స్త్రీపురుషుల మధ్యన జరుగుతుందో, అప్పుడే అది ఒక దివ్యసంస్కారముగా మారగలదు. అందుకే, బయట చేసుకున్న వివాహాలను, తిరుసభలో సరిదిద్దుతారు (that is why rectification of the marriages in the Church).
వివాహము దివ్యబలి పూజలో జరుగుతుంది. పూజలో
వివాహ ఆశీర్వాదం (nuptial blessing) ఇవ్వబడుతుంది (CCC
నం. 1621). “దివ్యపూజలో, క్రీస్తు తననుతాను శ్రీసభకు బహుమానముగా ఇస్తున్నాడు. వివాహములో కూడా ఇరువురు వ్యక్తులు
ఒకరికి ఒకరు సంపూర్ణముగా అర్పించుకొనుచున్నారు. కనుక, వివాహం, తప్పక
దివ్యపూజాబలిలో జరగడం సహజం, అర్ధవంతం.
(i). రెండు దివ్యసంస్కారాలుకూడా ప్రేమ సంస్కారాలే! క్రీస్తు ప్రేమకు, బలికి,
త్యాగానికి చిహ్నం దివ్యబలి పూజ. వివాహ బంధం కూడా ప్రేమకు
చిహ్నమే!
(ii). రెండు దివ్యసంస్కారాలుకూడా ప్రేమ
సంస్కారాలే! దివ్యసత్ప్రసాదము లోకొనుట వలన, ఒక వ్యక్తి క్రీస్తులో
ఐఖ్యమగుచున్నారు. అలాగే, వివాహములో ఇరువురు వ్యక్తులు ఐఖ్యమగుచున్నారు.
(iii). రెండు దివ్యసంస్కారాలుకూడా అంకితం, సమర్పణ సంస్కారాలే! దివ్యబలిపూజలో
క్రీస్తుద్వారా దేవునికి మనలను మనం సమర్పించుకొనుచున్నాము. వివాహములో ఇరువురు
ఒకరికొకరు అంకితం చేసుకొనుచున్నారు, సంపూర్ణముగా, సమర్పించుకొనుచున్నారు (CCC నం. 1621). అందుకే, గర్భనిరోదకం ఎందుకు పాపమో అర్ధం
చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గర్భనిరోదకం వివాహంయొక్క స్వభావానికి విరుద్ధం. అలాగే,
ఈ అంకితం, సమర్పణ వలన, ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయత (fidelity) కలిగియుండాలి. వారిమధ్య విడదీయరాని ఐఖ్యత (unbreakable union) ఉండాలి (CCC 1646). పునీత పౌలు అన్నట్లుగా, “వారిరువురు ఒకే
వ్యక్తిగ ఐఖ్యము అగుదురు” (ఎఫెసీ 5:31).
(iv). రెండు దివ్యసంస్కారాలు కూడా
ఒడంబడిక సంస్కారాలే! దివ్యబలి పూజ క్రీస్తుకు-శ్రీసభకు మధ్యననున్న ఒడంబడిక.
వివాహములో ఇరువురు వ్యక్తుల మధ్యనగల ఒడంబడిక, దేవునికి-తన ప్రజలకు మధ్యననున్న
ఒడంబడికకు చిహ్నము.
(v). రెండు దివ్యసంస్కారాలుకూడా విందు సంస్కారాలే! దివ్యబలిపూజ ఆధ్యాత్మిక విందు అయితే, వివాహము పరలోక విందుకు చిహ్నము. కానాపల్లెలోని వివాహ విందు క్రీస్తు సాన్నిధ్య ఆనందాన్ని కొనియాడినది (దర్శన 19:9).
3.
వివాహము యొక్క ఫలాలు లేదా ప్రధాన ఉద్దేశాలు
వివాహయొక్క
స్వభావాలు లేడా ప్రధానమైన ఉద్దేశాలు రెండు:
(i).
భార్యాభర్తల మేలుకొరకు ప్రేమకొరకు లేదా వారి అన్యోన్యత కొరకు. భార్యాభర్తలమధ్య
ఉండాల్సినది నిజమైన, స్వచ్చమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ప్రేమ. అది భౌతిక ఆకర్షణ కాదు,
భావావేశం కాదు.
(ii).
రెండు సంతానం మరియు బిడ్డలను అన్నివిధాలుగా విద్యావంతులను, ప్రయోజకులను చేయడం. సంతానోత్పత్తిద్వారా, మానవుడు దేవుని సృష్టిలో పాలుపంచుకొనుచున్నాడు.
జీవాన్ని ఇతరులకు ఒసగుచున్నారు. ఇది
దేవుని ప్రణాళిక (ఆది.1:28). కనుక, పిల్లలు దేవుని వరము. బహు సంతతిని కలిగియుండుట దేవునివరము. భార్యభర్తల మధ్యనున్నప్రేమ ఫలితం సంతానము. సంతానపోషణ, వారిని అన్ని విధాలుగా విద్యావంతులను చేయడం తల్లిదండ్రుల భాద్యత. వివాహ దివ్యసంస్కార అనుగ్రహం, భార్యభర్తల మధ్య ప్రేమను పరిపూర్ణం చేస్తుంది, విశ్వసనీయతలో వారిరువురిని ఐఖ్యపరుస్తుంది. పిల్లలను పోషించుటకు సహాయం చేస్తుంది (CCC 2366).
No comments:
Post a Comment