సోమవారం, ఆగమన కాల మొదటి వారము (II)

దేవుని ప్రేమ సందేశంఅనుదిన ధ్యానాంశాలు
సోమవారం, ఆగమన కాల మొదటి వారము
యెషయా 2:1-5; మత్తయి 8:5-13

ధ్యానాంశము: యేసు స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: నేను వచ్చి వానిని స్వస్థ పరతును” (మత్తయి 8:7) 
ధ్యానము: రోమీయ శతాధిపతి (100 మంది సైనికులకు అధిపతి) ఒకరు యేసును సమీపించి తన సేవకుని అనారోగ్యము గురించి తెలుపగాయేసు చాలా చక్కనిఅందమైన సమాధానం ఇచ్చారు: నేను వచ్చి వానిని స్వస్థ పరతును” (మత్తయి 8:7). శతాధిపతి యూదుడు కాదుఒక అన్యుడు. యహోవా దేవునిని విశ్వసింపని వాడు. అయినను యేసు అతనికి అనుకూలమైన సమాధానం ఇచ్చాడు. దీనిని బట్టి రక్షణ అందరికి అని అర్ధమగుచున్నది. రక్షణ దేవుని బహుమానం. క్రీస్తునందు విశ్వసించు వారందరు రక్షింపబడుదురు. మరిశతాధిపతి యేసును విశ్వసించాడా? "ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును. నా సేవకుడు స్వస్థత పొందును" (8:8) అని తన విశ్వాసాన్ని వెల్లడించాడు. అతని విశ్వాసానికి యేసు సైతము ఆశర్యపడ్డారు (8:10). యేసు కాలములోయూదులు అన్యులను (యూదేతరులు) అత్యంత నీచమైనఅవమానకరమైనదయనీయమైన జంతువులుగా పరిగణించేవారు. అన్యుల యింటిలోనికి ప్రవేశించేవారు కాదు. ఒక యూదుడు అన్యజనుల ఇంట్లోకి ప్రవేశించినట్లయితేఅతడు చట్టబద్ధంగా అపవిత్రుడుమైలపడినవాడిగా అవుతాడు (చదువుము: యోహాను 18:28; అ.కా. 11:3). అయినను యేసు అతని యింటికి వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. శతాధిపతి యొక్క యేసునందు విశ్వాసంనమ్మిక మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనం కూడా దేవుని శక్తిపైప్రేమలోదయలో విశ్వాసంనమ్మకం ఉంచాలి. దేవుడు మన ప్రార్ధన వింటాడా లేదా అని ఆందోళన పడుతూ ఉంటాము. యేసునందు సంపూర్ణ విశ్వాసం మన సమస్యలను పరిష్కరిస్తుంది. "దేవుడు మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నియు ఆయనపై మోపుడు" (1 పేతురు 5:7).

ఆగమన కాల మొదటి భాగములో (డిసెంబర్ 16 వరకు) మొదటి పఠనాన్ని యెషయా ప్రవక్త గ్రంధమునుండి వింటాము. ముఖ్యముగా మెస్సయ్యను గూర్చిన ప్రవచనాలను ధ్యానిస్తాము. నేటి పఠన భాగములోరానున్న దినములలో సకల జాతులు ప్రభువు మందిరమునకు ప్రవాహమువలె వత్తురు అని యెషయా దర్శనాన్ని గాంచాడు. ఇదే విషయాన్ని నేటి సువిశేషములో యేసు (మెస్సయ్య) సుస్పష్టం చేశారు: "తూర్పు పడమర నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రాహాముఈసాకుయాకోబుల పంక్తిలో కూర్చుందురు" (8:11).  దేవుడు ఒక్కడే అనిఆయనే సకల ప్రజలకు తండ్రి అనిమనమందరం ఆయన బిడ్డలమనిజగమంతా one కుటుంబం అనిమనమంతా సోదరులమని యేసు బోధిస్తున్నారు. 

యేసు మెస్సయా అనిలోక రక్షకుడని ధ్యానిద్దాం. శతాధిపతి ప్రార్ధనవిశ్వాసంనమ్మకం గురించి ధ్యానిద్దాం. అధికారం కలవాడైననుతన సేవకునిపట్ల చూపించిన శ్రద్ధశ్రేయస్సుక్షేమం గురించి ధ్యానిద్దాం. నీ వద్ద పని చేసే వారిపట్ల నీ ప్రవర్తన ఎలా ఉందినీ విశ్వాసం నీకే కాదుఇతరులకు కూడా స్వస్థత కలిగించునని నమ్ముతున్నావా

దేవుని రాజ్యములో చేరుటకు క్రీస్తునందు విశ్వాసం ప్రధానం అని గుర్తించావా?

No comments:

Post a Comment