పునీత అతనాసియుస్: శ్రీసభ పితరులు

 శ్రీసభ పితరులు: పునీత అతనాసియుస్ (2 మే)


పునీత అతనాసియుస్ (Athanasius) ఐగుప్తులోని అలెక్సాన్ద్రియలో 295వ సం.లో  జన్మించారు. తెలివి, జ్ఞానం కలవారు. భక్తిపరులు. 328లో అలెక్సాన్ద్రియ పీఠాధిపతిగా అభిషిక్తులైయ్యారు. మూడు సం.లకు ముందుగా నైసియ పట్టణములో జరిగిన అఖిల క్రైస్తవ పీఠాధిపతుల సమావేశములో పాల్గొని, ఆకాలంలో ప్రబలిపోతున్న "ఏరియనిజం" అను అసత్య బోధనలకు వ్యతిరేకముగా, "యేసు-దైవత్వము"ను గురించిన విశ్వాసమును ఘాటుగా సమర్ధించారు. యేసు నిజముగా దేవుడు, నిజముగా మానవుడు అని, యేసు దైవ-మానవ స్వభావములను గురించి బోధించారు. పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని సమర్ధించారు. అదే సమావేశములో, నైసియన్ "విశ్వాస ప్రమాణము" అంగీకరించడానికి కూడా ఎంతగానో కృషి చేశారు. ఆనాటి రాజకీయం, "ఏరియనిజం" కుట్రల వలన ఐదు సార్లు దేశ బహిష్కారానికి గురైయ్యారు. అయినను విశ్వాస సత్యాలను ఘాటుగా బోధించారు. 

పీఠాధిపతిగా నిర్జన ప్రాంతాలలో జీవించే సన్యాసుల శ్రేయస్సు, సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు.

2 మే 373లో అలెక్సాన్ద్రియలో మరణించారు. ఆయన పవిత్ర అవశేషాలు ఇటలీ దేశములోని వెనిస్ నగరములో భద్రపరచ బడినవి.

No comments:

Post a Comment

Pages (150)1234 Next