జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి తృతీయసభ (Third Order) సభ్యుడు. తన జీవిత చివరికాలాన్ని (1939 వ సం,,మునుండి) విజయవాడ మేత్రాసణము, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ఉత్తర భారరత దేశంలోని పెదావుటపల్లి గ్రామములో గడిపియున్నాడు. అక్కడే ఆయన 15 జనవరి 1945 వ సం,,లో పరమపదించియున్నారు. ఇంతకుముందు ఆయన పుదుచేరి, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో పనిచేసియున్నారు. ఆయన నిరాడంబరత్వం, ప్రార్ధన మరియు పరోపకారముతో కూడిన జీవితాన్ని జీవించారు. తన అంతరార్ధమైన (mystical) అనుభవాలవలె, ఆయన సువార్త బోధనా కార్యక్రమాలు బాగా ప్రసిద్ధిలోఉండెడివి. ఇంతలో, ఆయన కుటుంబము భారత దేశములోను మరియు బయట చెదరిపోయినది. తన వినయత్వమువలన తననుగూర్చితాను మాట్లాడటానికి ఎప్పుడూ నిరాకరించెడివారు. తన జీవితమునుగూర్చి ఈనాడు ఖచ్చితమైన మరియు విలువైన సమాచారమును ఇచ్చియుండెడు పత్రాలను, అధారాలన్నింటినీ ఆయన తప్పక కాల్చివేయడముగాని, నాశనం చేయడముగాని జరిగియున్నది.

జోసఫ్ తంబి, శవరిముత్తు, అన్నమలైతంబివారి దంపతులకు సెప్టంబరు 1883 వ సం,,లో జన్మించారు. ఆయన సిరోనెలోని వెల్లాలా అను ఉన్నత వర్గమునకు చెందినవారు. అప్పట్లో ఫ్రెంచికాలనీ అయిన పాండుచేరిలో పెరిగాడు. అతని తమ్ముడు మైకేల్ ధైరియాను. జోసఫ్ తంబికి ఏడు సం,,లు, తమ్ముడికి రెండు సం,,లు ఉన్నప్పుడే, తల్లి మరణించింది. అతని తండ్రి మరల వివాహమాడాడు; మేరీ రెండవ వివాహ సంతానము. జోసఫ్ తంబికి 12 సం..ల ప్రాయమున్నప్పుడు, తన తోటివారితో కలసి దివ్యసంస్కారములైన సత్ప్రసాదము మరియు భద్రమైన అభ్యంగము పొందుటకు సిద్ధమగుచున్నాడు. అతని సవతితల్లి అభ్యంతరాన్ని వ్యక్తపరచినను, ఆయన దివ్యసంస్కారములను స్వీకరించాడు. ఆ తర్వాత, సవతితల్లి చూపించిన ప్రతికూల పరిస్థితులవలన, జోసఫ్ తంబి ఇల్లువిడచి కేరళరాష్ట్రమునకు వెళ్ళాడు. అక్కడ ఒక దైవభక్తురాలి చెంత విద్యాభ్యాసాన్ని పొందాడు. తమ్ముడు మైకేల్ ధైరియాను వియత్నాములో, 1956 వ సం,,ము వరకు ఫ్రెంచికాలనీగానున్న సైగానునకు వెళ్ళాడు. అక్కడే, మరియ తెరెసాను వివాహమాడాడు. వారికి ముగ్గురు మగసంతానం మరియు గాబ్రియేలు తెరెసా అను ఒక కుమార్తె. కుమార్తె కార్మెల్ సభలో కన్యాస్త్రీగా మాటపట్టు చేసారు. మైకేల్ ధైరియాను 1935 వ సం,,లో మరణించారు. కేరళ రాష్ట్రములో జోసఫ్ తంబి విద్యాభ్యాసముతో పాటు, మంచి క్రైస్తవ కతోలిక ఆధ్యాత్మికపరమైన విద్యనుకూడా స్వీకరించియున్నాడు. అప్పటికే ఆత్మయొక్క విషయాలపై పట్టుకలిగియుండిన జోసఫ్ తంబి, ఆయన జన్మస్థలమును అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉండేవాడు. అక్కడ ఎవరిచేత గుర్తింపబడకుండా, దానధర్మాలకోసం యాచించెడివాడు. ఒకసారి అతని తండ్రి జోసఫ్ తంబిని గుర్తించకుండానే కొన్ని చిల్లరడబ్బులను ఇచ్చాడు. కాని, 1928 వ సం,,ము లో, ఒకానొక బంధువుని అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆతని నాయనమ్మ అతనిని గుర్తుపట్టింది. ఈ సందర్శనలలో, పునీత ఫ్రాన్సిసువారి తృతీయసభకు చెందిన అంగీని ధరించి, భిక్షకునివలె సంచరించాడు. ఇప్పటికే అతని పవిత్ర జీవితమువలన ఖ్యాతిని పొందారు. 14 అక్టోబరు 1932 వ సం..ములో, ఫ్రాన్సిసుసభ అంగీని ధరించి, తన తమ్ముని కుమార్తెయైన గాబ్రియేలు తెరెసా మాటపట్టునకు, పాండుచేరిలోని కార్మెల్ మఠవాసములో హాజరైనారు. ఆమె 1985 వ సం..ములో మరణించారు. జోసఫ్ తంబి ఎక్కడ జీవించేవాడోనని, అనేకమంది పదేపదే అడిగినప్పుడు, కేరళరాష్ట్రములోని కొల్లంలోనున్న తన ఆశ్రమానికి వెళ్లాలని చెప్పేవారు. అప్పటికి ఆయన వయస్సు యాభై సంవత్సరాలు.

1931 వ సం,,మునుండి ఫ్రెంచ్ కపూచిన్ సింఫోరియన్ ఆఫ్ పారిస్ కొల్లంలో ఉంటూ విద్యార్ధినిలయమైన పునీత అంథోనివారి ఆశ్రమ నిర్మాణపనులను పర్యవేక్షించుచుండెను. ఆ ఆశ్రమాన్ని, 1932 వ సం,,ములో ప్రారంభించడమైనది. జోసఫ్ తంబి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి కపూచిన్ సభలో చేరుటకు ప్రయత్నంచేసాడు. తన కుడికాలుకి బోదవ్యాధి ఉండుటవలనను, మరియు అతని ''అధిక దైవభక్తి'' వలనను స్వీకరించబడలేదు. అతని భక్తిభావోద్రేకములు, మూర్ఛవ్యాధివలన కలిగే లక్షణాలుగా ఇతరులు భావించారు. ఆనాటి కపూచిన్ సభ ఆచారము ప్రకారం, మొదటిగా అభ్యర్ధులు ఫ్రాన్సిసు సభ తృతీయసభలోచేరి, అంగీని [అంగీతోపాటు కలిసియుండెడు ఒకవిధమైన టోపీ (hood) లేకుండా, నడుముతాడు (cord) మరియు జపమాలతో (rosary)] ధరించెడివారు. ఆ తరువాత నొవిశియేట్ (Novitiate) నందు తర్ఫీదును పూర్తిచేసికొని మాటపట్టును చేసెడివారు. ఆ తరువాతనే, మఠవాసుల నొవిశియేట్ నందు చేరెడివారు. జోసఫ్ తంబిగారికి అప్పటికే 50 సం,,ల వయస్సు ఉండుటవలన కపూచిన్ సభలో చేరుటకు అనుకూలములేకుండా ఉండియుండవచ్చు. అయినప్పటికిని, తృతీయసభ సభ్యుడైన జోసఫ్ తంబి, కపూచిన్ మఠవాసులను వీడిన తరువాతకూడా, అంగీని ధరించియున్నాడు. ఈ విషయం, కొన్ని ఛాయాచిత్రాలు మరియు సాక్షులద్వారా ధ్రువీకరించబడినది. లతీను భాషలోనున్న రోమన్ కతోలిక ప్రార్ధనా సంగ్రహపుస్తక సహాయముతో ప్రార్ధన చేసెడివారు. అతనికి తమిళము, ఫ్రెంచి, మలయాళం, ఆంగ్లము మరియు తెలుగు భాషలు తెలుసు.

మఠవాస జీవిత పిలుపునకు విశ్వాసముగాఉంటూ, తపస్సు, ప్రార్ధన, ప్రాయశ్చిత్తము మరియు దానధర్మాలను యాచిస్తూ దేశసంచారియై, సువార్తా ప్రచారమునకు తన జీవితాన్ని పూర్తిగా అంకితముచేసి, శాంతి సమాధానములను స్థాపిస్తూ, సమాధాన కార్యాలనుచేస్తూ జీవించాడు. తమిళనాడు రాష్ట్రములోని కుంభకోణం మేత్రాసణములో పునీత ఫ్రాన్సిసువారి ''తృతీయసభ''ను స్థాపించాడు. నాలుగు సం,,లపాటు మణత్తిడల్ లో పనిచేసి ఆపై తంజావూరునకు వెళ్ళాడు. 1939 వ సం,,ములో కేరళలోని వేరపుఱ౦ అతిమేత్రాసణములో కనిపించాడు. అచ్చట, జోసఫ్ అట్టిపెట్టి అతిమేత్రాణుల వారు సువార్తా ప్రచారము కొరకు, తాను ప్రారభించిన ''తేరేసియన్ బ్రదర్సు''కు తర్ఫీదునివ్వమని జోసఫ్ తంబిగారిని కోరియున్నారు. ముఖ్యముగా, త్రిశూరు జిల్లాలోని వారి ''పుతుర్ మిషన్'' (Puthur Mission, Ponnukara) అభివృద్ధికై ఇరువురు బ్రదర్లకు తర్ఫీదునివ్వమని కోరియున్నారు. అయితే, వారు జోసఫ్ తంబిగారిని వెఱ్ఱివానిగా భావించి, ఆయన సూచనలను నిరాకరించారు. కొన్ని స్వల్పకాలాలు మినహా, 1939 వ సం,,ము నుండి తన మరణమువరకు (1945), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని, విజయవాడ మేత్రాసణములోని పెదావుటపల్లి గ్రామములో పనిచేసియున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్తా ప్రచారం చేసియున్నాడు. అచ్చట ఆయన ఒక గుడిసెలో నివసిస్తూ, కుటుంబాలను సందర్శిస్తూ, తన వాక్తుచర్యము వలనగాక, నిష్కపట మరియు నిష్ఠతో కూడిన జీవితముద్వారా, సిలువలోని క్రీస్తానుకరణము ద్వారా, అనేక మందిని, యేసు క్రీస్తు వైపునకు ఆకర్షించియున్నాడు. తన కృషివలన, పెదావుటపల్లి గ్రామములో 30 కుటుంబాలకు పైగా కతోలిక క్రైస్తవులుగా మారియున్నారు.

అతని మరణంముందు వారంవరకు, చుట్టుప్రక్కలనున్న కేసరపల్లి, ఉప్పలూరు, మానికొండ, మరియు వట్లూరు గ్రామాలను సందర్శించియున్నాడు. 1944 వ సం,,ములో క్రీస్తుజయంతి వేడుక తర్వాత మానికొండ గ్రామమునకు వెళ్ళాడు. అక్కడనుండి, 6 జనవరి 1945 వ సం..ములో తీవ్రజ్వరముతో భాదపడుతూ పెదావుటపల్లికి తిరిగి వచ్చాడు. గ్రామాలలో అతని సపర్యలు, తరచుగా ఉపవాసాలు, మరియు నిష్టతో కూడిన కార్యాల వలన, అతని ఆరోగ్యం క్షీణించింది. 15 జనవరి రోజున, అతని ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తానే స్వయముగా కతోలిక విశ్వాసములోనికి మార్చిన బోయపాటి కుటుంబ సభ్యులు, అనేక మంది స్నేహితులు, భక్తులు ఆయన చుట్టూ గుమికూడియుండగా, తన 63 వ యేట అదేరోజు మరణించారు. బ్రదర్ జోసఫ్ తంబిగారి మరణ వార్షికోత్సవము ప్రతి సం,,ము జనవరి 13, 14, 15 తారీఖులలో అనేక వేలమంది భక్తులు పాల్గొనుచుండగా గొప్పమహోత్సవముగా కొనియాడబడుచున్నది.

మూలాలు:

1). ఫా. అవిటో పొట్టుకులం, బ్రదర్ జోసఫ్ తంబి సంగ్రహ చరిత్ర, పెదావుటపల్లి 1973.
2). ఫా. ఒస్వాల్డు ప్రతాప్, ఆవుటపల్లి పునీత ఫ్రాన్సీసు సభ పవిత్ర సభ్యుడు, దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి, ఎనికేపాడు 2009.

ఇటాలియన్: ఫా. బెనెడిక్ట్ వాడక్కేకర, OFM Cap, రోము, ఇటలీ
తెలుగు అనువాదం: ఫా. ప్రవీణ్ కుమార్ గోపు, OFM Cap
రోము, ఇటలీ.

No comments:

Post a Comment