14వ లియో పోప్ మీడియా ప్రతినిధులతో సమావేశము, 12 మే 2025
ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన మీడియా ప్రతినిధులతో పోప్ లియో XIV ప్రత్యేకముగా సమావేశమయ్యారు. ఈ సందర్భముగా, శ్రీసభ
పట్ల మీడియా ప్రతినిధులు చూపుతున్న నిబద్ధతను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. “శాంతి
స్థాపకులు ధన్యులు” (మత్తయి 5:9) అనే ప్రభువు బోధన నేటి సమాజంలో
మనందరికీ ఒక సవాలుగా నిలుస్తోందని, ఇది ప్రతి ఒక్కరి
శ్రేయస్సును కోరుకునే మార్గమని ఆయన ఉద్ఘాటించారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
·శాంతి యొక్క ప్రాముఖ్యత:
o జర్నలిస్టులు తమ కథనాల్లో శాంతిని నెలకొల్పే వారిగా ఉండాలని పోప్
ఆకాంక్షించారు. శాంతిని ప్రోత్సహించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన
నొక్కిచెప్పారు.
o విద్వేషపూరితమైన మాటలు మరియు దృశ్యాలతో కూడిన "యుద్ధానికి"
స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అర్థవంతమైన సంభాషణలు, సయోధ్యను పెంపొందించే కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు.
o శాంతి అనేది వ్యక్తులు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారనే దానిపై
ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశార.
బాధ్యతాయుతమైన జర్నలిజం:
o నిజాయితీ, నైతిక విలువలతో కూడిన వార్తా కథనాల
ప్రాముఖ్యతను పోప్ నొక్కి చెప్పారు. పక్షపాతపూరితమైన ధోరణులకు అతీతంగా
జర్నలిస్టులు వాస్తవాలను నివేదించాలని ఆయన కోరారు.
o ముఖ్యంగా సంఘర్షణలు, అన్యాయాలపై రిపోర్ట్ చేస్తున్న
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పరిస్థితులను ఆయన గుర్తించారు. వారి
ధైర్యాన్ని ప్రశంసించారు.
o అభిప్రాయ స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, అన్యాయంగా జైలు పాలైన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన
ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
ఆధునిక కమ్యూనికేషన్ యొక్క సవాళ్లు:
o కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) మీడియా రంగంపై చూపుతున్న విస్తృత ప్రభావాన్ని పోప్ ప్రస్తావించారు. ఈ
సాంకేతికతను బాధ్యతాయుతంగా, విచక్షణతో ఉపయోగించాలని ఆయన సూచించారు.
o సమాజంలో చీలికలు తెచ్చే, హాని కలిగించే
వాక్చాతుర్యాన్ని ఎదుర్కోవాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
నిర్మాణాత్మకమైన సంభాషణలు, పరస్పర అవగాహనను పెంపొందించే వార్తలను
అందించాలని మీడియాను కోరారు.
o హానికరమైన, తప్పుదోవ పట్టించే కథనాల నుండి కమ్యూనికేషన్‌ను
విముక్తం చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
సంఘీభావము, మద్దతు:
o సత్యాన్ని నివేదించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే
ధైర్యవంతులైన జర్నలిస్టులకు పోప్ తన సంఘీభావాన్ని తెలియజేశారు. వారి నిబద్ధతను
కొనియాడారు.
o శ్రీసభకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో
మీడియా చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి సహకారాన్ని
అభినందించారు.
తరచుగా సంఘర్షణలు, విభేదాలతో నిండిన ఈ ప్రపంచంలో శాంతి,
సత్యం, పరస్పర అవగాహనను
పెంపొందించడానికి మీడియా తనకున్న శక్తిని సంపూర్ణంగా ఉపయోగించాలని పోప్ లియో XIV
విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు బాధ్యతాయుతమైన
పాత్రను పోషించడం ద్వారా ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం
చేశారు.
మూలము:
vatican.va/content/leo-xiv/en/events/event.dir.html/content/vaticanevents/en/2025/5/12/media.html
గురుశ్రీ
ప్రవీణ్ గోపు, OFM Cap.
Rector,
Vianney College, Eluru, Andhra Pradesh
No comments:
Post a Comment