ప్రపంచ యువత దినోత్సవం 2023 - జాగరణ ప్రార్ధన: పొప్ ఫ్రాన్సిస్ సందేశం

ప్రపంచ యువత దినోత్సవం 2023
జాగరణ ప్రార్ధన - పొప్ ఫ్రాన్సిస్ సందేశం
శనివారం5 ఆగష్టు 2023


ప్రియమైన సోదర సోదరీమణులారాశుభ సాయంత్రం!

మీ అందరిని చూడటం నాకు చాలా సంతోషముగా ఉన్నది. మీరందరు ఇక్కడకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు! ఎలిశబేతమ్మను సందర్శించుటకు ప్రయాణమై పోయిన మరియమ్మను నేను జ్ఞాపకం చేసికొనుచున్నాను. మరియమ్మ లేచి త్వరితముగా ప్రయాణమై పోయెను” (లూకా 1:39). ఎలిశబేతమ్మను చూడటానికి మరియ ఎందుకు త్వరితముగా వెళ్ళినదని ప్రశ్నించవచ్చు. ఎలిశబేతమ్మ గర్భముతో నున్నదని మరియకు అప్పుడే దూతద్వారా తెలిసింది. అలాగేమరియకూడా గర్భము దాల్చినది. ఆమెను ఎవరు అడగనప్పుడుఎందుకు వెళ్లడంఎవరు అడగని దానినిచేయాల్సిన అవసరం లేకున్ననుమరియ ఇష్టపూర్తిగా చేయుచున్నది. మరియ ప్రేమించింది కనుకయిష్టపూర్తిగా వెళ్ళినది. 

మరియ ఆనందం రెండు రెట్లు: లోకరక్షకుడిని తన గర్భాన స్వాగతిస్తున్నదన్న దేవదూత శుభవార్తను అందుకొని యున్నది. అలాగేతన చుట్టమగు ఎలిశబేతమ్మ గర్భము ధరించినదన్న వార్త తెలుసుకోవడం. మరియ వెంటనే తన గురించి ఆలోచించకుండాఇతరుల గురించి ఆలోచించింది. ఎందుకన నిజమైన సువార్తానందం ఇతరులతో పంచుకున్నప్పుడే కనుక. ఇక్కడ మీరందరు కూడా ఇతరులను కలుసుకోవడానికిక్రీస్తు సందేశాన్ని కనుగొనడానికిజీవిత పరమార్ధాన్ని చవిచూచుటకు వచ్చియున్నారు. మరి ఈ ఆనందాన్ని మీతోపాటే ఉంచుకుంటారా లేక ఇతరులతో పంచుకుంటారామీరు ఏమంటారుఖచ్చితముగా ఇతరులతో పంచుకొంటారుఎందుకననిజమైన సంతోషం ఇతరులతో పంచుకోవడమే!

మనం ఈ ఆనందాన్ని పొందుటకు మనకు ఇతరులు సహాయం చేసియున్నారు. మనం పొందిన సహాయాన్ని వెనుకకు తిరిగి చూద్దాం. అది మన హృదయాలను ఆనందముతో నింపినది. మన జీవితాలలో వెలుగులు నింపినవారు మన తల్లిదండ్రులుతాతమామ్మలుస్నేహితులుగురువులుఆధ్యాత్మిక వ్యక్తులుఉపదేశకులుయువనాయకులుఉపాధ్యాయులు ... వారే మన ఈ ఆనందానికి కారకులు. వారే మన మూలాలు. వారి గురించి తలంచుకుంటూ కొద్ది క్షణాలు మౌనముగా గడుపుదాం. 

మనకు సహాయం చేసిన వారి ముఖాలుసంఘటనలు గుర్తుకు వచ్చాయామన ఆనందానికి కారకులైన వారికిసహాయం చేసిన వారికి హృదయపూర్వకముగా ధ్యన్యవాదములు తెలియచేద్దాం. అలాగేమనంకూడా ఇతరుల ఆనందానికి కారకులము కావాలి. ఇది క్షణికమైన ఆనందం గురించి కాదు. శాశ్వతమైనలోతైన ఆనందం.

ఆనందం అనేది తాళం వేసిన లైబ్రరీలో దొరకదు. ఆనందాన్ని మనం వెదకాలికనుగొనాలి. ఇతరులతో సంభాషించేప్పుడు కనుగొనాలి. అక్కడ మనం పొందిన ఆనందాన్ని పంచుకుంటాము. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను: మీరు ఎప్పుడైనా అలిసిపోతారాఅలిసిపోయినప్పుడు ఏమి చేస్తాముఆలోచించండి! ఏమీ చేయాలని అనిపించదు. కొన్నిసార్లు వస్తువులను విసిరేస్తూ ఉంటాము. జీవితములో ఓటమిని చవిచూసినవారిజీవితములో పడిపోయినవారి లేదా జీవితములో పెద్దపెద్ద తప్పులు చేసిన వారి జీవితాలు ముగిసిపోయినవని మీరు నమ్ముతారాలేదు! కాబట్టి ఏమి చేయాలివారు తిరిగి లేవాలి. ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను: పర్వతాలను అధిరోహించడానికి ఆల్ఫ్ నుండి వచ్చేవారుఒక అందమైన పాటను పాడుకుంటారు. అదేమిటంటే, “పర్వతము ఎక్కే కళలోపడిపోవడం ముఖ్యం కాదుపడిపోయి అక్కడే ఉండక లేచి ముందుకు సాగడం ముఖ్యం.

పడిపోయి అక్కడే ఉన్నవారు జీవితముపై ఆశలు వదిలేసుకున్నటువంటివారు. అలాంటివారు జీవితములో ఆశను కోల్పోయినవారు. జీవితములో పడిపోయిన మన స్నేహితులను చూసినప్పుడు మనం ఏమి చేయాలివారిని పైకి లేపండి. వారికి మనం ఎలా సహాయం చేయాలిముందుగా మనం వారిని చిన్నచూపుతో చూడరాదు. వారికి సహాయం చేయండి.

జీవితములో ముందుకు ఎలా సాగాలిజీవితములో ఏదైనా సాధించడానికిజీవితములో ప్రయాణం చేయడానికిమనం శిక్షణ పొందాలి. కొన్నిసార్లు జీవితములో ముందుకు వెళ్లాలని అనిపించదు. ప్రయంత్నంకూడా చేయాలనిపించదు. ఏమీ చేయడానికి ఇష్టముండదు. ఏమీ చదవాలని అనిపించదు. మనం అనుకున్న ఫలితాలు రావు. అందుకేపరీక్షలలో కాపీలు కొడుతూ ఉంటాము. మీలో ఫుట్ బాల్ ఆటను ఎంతమంది ఇష్టపడతారో ఖచ్చితముగా నాకు తెలియదు. నాకైతే చాలా ఇష్టం. గోల్ చేయడానికి ఎంత శిక్షణ అవసరమో ఆలోచించండి. ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడానికి ఎంతో ప్రయత్నం అవసరం. జీవితములో కూడా మనకు కావలసినది ఎల్లప్పుడూ చేయలేము. మన అంత:రంగములో లోతుగాపిలుపుకు తగ్గట్టుగా మనం ప్రతిస్పందించడానికి దారితీసే వాటిని మనం చేయాలి. జీవితములో ముందుకు సాగిపోతూనే ఉండండి. పడిపోతేతిరిగి లేవండి. తిరిగి లేవడానికి సహాయం చేసేవారు ఉంటారు. పడిపోయిన చోటే ఉండకూడదు. క్రమశిక్షణతో ముందుకు సాగుదాం. జీవితములో ఎలా ప్రయాణించాలో నేర్పించే కోర్సులు లేవు. అనుభవ పూర్వకముగా నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగేమన తల్లిదండ్రులనుండిపెద్దలనుండిస్నేహితులనుండి నేర్చుకుంటాము.

ఈ ఆలోచనలతో మిమ్ములను వదిలేస్తున్నాను. ముందుకు సాగండి. పడిపోతేతిరిగి లేవండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. ప్రతీరోజు శిక్షణను కొనసాగించండి. జీవితములో ఏదీ ఉచితముగా దొరకదు. అన్నింటికీ డబ్బులు వెచ్చించాల్సిందే. కానీ యేసు ప్రేమ ఒక్కటే ఉచితం. ఈ ఉచిత బహుమానముతోప్రయాణాన్ని కొనసాగించాలనే కోరికతోగొప్ప ఆశతో ముందుకు సాగుదాం. మూలలను గుర్తుంచుకోండి. భయపడకుండా ముందుకు వెళ్ళండి. ధన్యవాదములు!

No comments:

Post a Comment