ప్రపంచ యువత దినోత్సవం 2023 - జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ సందేశము

 ప్రపంచ యువత దినోత్సవం 2023
జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ సందేశము
మరియమ్మ లేచి త్వరితముగా ప్రయాణమై పోయెను” (లూకా 1:39)
ప్రియమైన యువతీ యువకులారా!
పనామాలో జరిగిన యువత దినోత్సవ సందేశం, “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక” (లూకా 1:38). ఈ సంఘటన తరువాతమండుతున్న హృదయాలతో లేచిదేవుని తక్షణ పిలుపుతో మనం క్రొత్త గమ్యమువైపు ప్రయాణమై పోవుచున్నాము – ‘లిస్బన్’ 2023. 2020వ సం.లో, “చిన్నవాడా! లెమ్ము అని నీతో చెప్పుచున్నాను” (లూకా 7:14) అన్న ప్రభువు మాటలను ధ్యానించియున్నాము. గతసంవత్సరము కూడా ఉత్థానక్రీస్తుఅపోస్తలుడు పౌలుగారి వ్యక్తిత్వముచేత ప్రేరణను పొందియున్నాము. ప్రభువు పౌలుతో, “నీవు లేచి నిలువ బడుము. ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నియమించుచున్నాను” (అ.కా. 26:16) అని పలికిన మాటలను ధ్యానించియున్నాము. లిస్బన్’ చేరుకోవడానికిమనం ప్రయాణం చేసే మార్గములో, ‘మంగళవార్తను స్వీకరించిన వెంటనే త్వరితముగా ప్రయాణమై పోయిన” (లూకా 1:39) నజరేతు కన్య మరియ మనకు తోడుగా ఉంటుంది. ఈ మూడు ధ్యానాంశములలో, “లెమ్ము” అన్న పదాన్ని గమనించవచ్చు. మనం నిద్రనుండి లేవడాన్నిమనచుట్టూ ఉన్న జీవితాన్ని మేల్కొల్పడాన్ని గూర్చియని గుర్తుచేసుకుందాం.
కరోన మహమ్మారిచేత పరీక్షింపబడియుద్ధమను విషాదకర వాతావరణములో చిక్కుకున్న మానవ కుటుంబము ఎదుర్కొంటున్న ఈ క్లిష్టసమయాలలోమరియమనదరికిముఖ్యముగా మీకుతనలాంటి యువతకు సామీప్యతకుఅనుభూతికి మార్గాన్ని చూపుతుంది. ఆగష్టు మాసములో లిస్బన్లో మీలో చాలామంది పొందబోవు అనుభూతియువత అయిన మీకునుఅలాగే సర్వమానవాళికి ఇది క్రొత్త ఆరంభాన్ని సూచిస్తుందని నేను ఆశిస్తున్నానుదృఢముగా నమ్ముచున్నాను. “మరియ లేచి...”
            మంగళవార్త’ అనంతరం, మరియ తన గురించి, తన క్రొత్త పరిస్థితి గురించి, తన చింతలు, భయాల గురించి దృష్టి పెట్టియుండవచ్చు. కానిదానికి బదులుగా, తననుతాను పూర్తిగా దేవునకు అప్పగించుకొని యున్నది. ఆమె ఆలోచనలు ఎలిశబేతమ్మ వైపునకు మరలాయి. లేచి, జీవితం కదలికల ప్రపంచములోనికి సాగింది. దేవదూత సందేశం తన ప్రణాళికలో ప్రకంపనలకు కారణమైనప్పటికినీ, యువ కన్యమరియ అక్కడే ఉండిపోలేదు, ఎందుకన, ఉత్థానము, నూతన జీవితముయొక్క శక్తిని కలిగియున్నది. తనలో సజీవముగానున్న అప్పటికే వధింపబడిన గొర్రెపిల్లను కలిగియున్నది. మరియ లేచి బయలుదేరినది, ఎందుకన, దేవుని ప్రణాళిక తన జీవితానికి ఉత్తమమైన ప్రణాళికయని ఖచ్చితముగా తెలుసుకొని యున్నది. మరియ దేవుని ఆలయం, యాత్రిక శ్రీసభ, సేవకొరకు ముందుకు సాగే శ్రీసభ, అందరికి శుభవార్తను అందించే శ్రీసభ.
            మన జీవితాలలో, ఉత్థానక్రీస్తు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటం, ఆయనను సజీవముగా అనుభూతి చెందటం గొప్ప ఆధ్యాత్మిక ఆనందం, ఎవరిని తాకకుండా ఉండలేని కాంతి విస్ఫోటనం. ఈ అనుభూతి ఆనందానికి సాక్ష్యమివ్వడానికి, శుభవార్తను ఇతరులకు తెలియజేయడానికి మరియ త్వరితముగా ప్రయాణమై పోయినది. క్రీస్తు ఉత్థానం అనంతరం, ప్రధమ శిష్యుల తొందరపాటుకు కూడా ఇదే కారణం, (స్త్రీలు) భయా నందములతో, శిష్యులకు సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తిరి” (మత్త 28:8).
            క్రీస్తు పునరుత్థాన వృత్తాంతాలలో, మేల్కొనుట’, ‘లేచుట’ అను రెండు పదాలను తరుచుగా చూస్తూ ఉంటాము. మనం దేవుని వెలుగు వైపునకు వెళ్ళేలా, మూసియున్న తలుపులన్నింటిని దాటి మనలను నడిపించేలా చేయుచున్నాడు. “శ్రీసభకు ఇది పరమార్ధాన్ని కలిగియున్నది. మనముకూడా క్రీస్తు శిష్యులవలె, క్రైస్తవ సంఘముగా త్వరితముగా ‘లేచి’ ఉత్థాన పరమరహస్యములో ప్రవేశించాలని, సూచించిన మార్గాలలో ప్రభువు మనలను నడిపించ బడుటకు పిలువబడి యున్నాము” (ప్రసంగము, పునీత పేతురు, పౌలుల మహోత్సవము, 29 జూన్ 2022).
            యాత్రిక యువతకు, అద్దంముందు నిలబడి తమనుతాము ఆలోచించలేని వారికి, “వల”లో పట్టుబడుటకు నిరాకరించు వారికి, ప్రభువు తల్లి మరియ ఒక ఆదర్శం. మరియ తన దృష్టిని ఎల్లప్పుడు ఇతరులవైపుకు, దేవుని వైపునకు, సోదరీసోదరుల వైపునకు, ముఖ్యముగా తన సోదరి అయిన ఎలిశబేతమ్మ వైపునకు మళ్ళించినది.
... త్వరితముగా పోయెను
            పునీత అంబ్రోస్ మిలాను గారు లూకా సువార్తపై తన వ్యాఖ్యానములో, మరియ పర్వత ప్రాంతమునకు త్వరితముగా ప్రయాణమై పోయినది“ఎందుకన, దేవుని వాగ్దానములో ఆమె ఆనందించినది, ఈ ఆనందమునుండి పుట్టిన ఉత్సాహముతో ఇతరులకు సేవచేయాలని కోరుకున్నది. దేవునితో నింపబడిన ఆమె ‘ఎత్తుల’ వైపునకుగాక ఇంకేచోటకు వెళ్ళగలదు? పరిశుద్ధాత్మ అనుగ్రహం ఆలస్యాన్ని అనుమతించదు” అని వ్రాశాడుమరియ తొందరపాటు, సేవ చేయాలనే ఆమె కోరికకు, తన ఆనందాన్ని ప్రకటించుటకు, పరిశుద్ధాత్మ అనుగ్రహానికి సంకోచించక ప్రతిస్పందించుటకు సంకేతం. 
మరియ పెద్దదైన ఎలిశబేతమ్మ అవసరాలచే ప్రేరేపింప బడినది. వెనక్కి తగ్గలేదు, ఉదాసీనముగా యుండలేదు. తన కన్న ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించినది. ఇదే ఆమె జీవితానికి ఉత్సాహాన్ని, దిశను ఒసగినది. ప్రతీ ఒక్కరు ప్రశ్నించుకోండి: “నా చుట్టూ ఉన్న అవసరాలపట్ల నేను ఎలా ప్రతిస్పందిస్తాను? జోక్యం చేసుకోక పోవడానికిగల కారణాలను వెంటనే ఆలోచిస్తున్నానా? లేదా సహాయం చేయడానికి ఆసక్తిని, సుముఖతను చూపిస్తానా?” వాస్తవం చెప్పాలంటే, లోకములోనున్న అన్ని సమస్యలను పరిష్కరించలేవు. అయినప్పటికిని, మీకు దగ్గరగానున్న వారి అవసరతలలో సహాయం చేయడముతో ప్రారభించండి. ఎవరో ఒకసారి మదర్ థెరెస్సాతో“మీరు చేయుచున్నది సముద్రములో కేవలం ఒక చుక్క మాత్రమే” అని చెప్పినప్పుడు, “నేను చేయకపోతే, సముద్రములో ఆ ఒక్క చుక్క తక్కువగా ఉంటుంది” అని సమాధాన మిచ్చినది.
అత్యవసర అవసరాలను గమనించినప్పుడు, మనం త్వరితముగా స్పందించాలి. ఎంతోమంది, వారి ఆందోళనల గురించి పట్టించుకొని వారిని సందర్శించిపరామర్శించే వారికొరకు ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, రోగులు, ఖైదీలు, శరణార్ధులు ... మొదలగు వారికి సానుభూతి, సహాయం అవసరం!
ప్రియమైన యువత, మీరు ఎలాంటి “వేగిరపాటు”ను కలిగియున్నారు? లేచి వెళ్ళుటకు ఏది మిమ్ములను నడిపించు చున్నది? మహమ్మారి, యుద్ధము, బలవంతపు వలసలు, పేదరికము, హింస, వాతావరణ విపత్తుల వంటి వాస్తవాల నేపధ్యములో, చాలామంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నాకే? ఎందుకు ఇప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. కాని మనం అడగాల్సిన నిజమైన ప్రశ్న ఏమిటంటే “నేను ఎవరికోసం జీవిస్తున్నాను?” (“క్రీస్తు సజీవుడు” నం. 286).
దేవునినుండి అసాధారణమైన వరాలను పొంది, తాము పొందిన కృపను ఇతరులపై క్రుమ్మరించడానికి వాటిని ఇతరులతో పంచుకోవాలని భావించే వారి వేగిరపాటు, నజరేతు యువతి వేగిరపాటు. ఇతరుల అవసరాలను, తమ అవసరాల కంటె ఎక్కువగా భావించే సామర్ధ్యం ఉన్నవారి వేగిరపాటు. ఇతరుల ఆమోదం కొరకు (ఉదాహరణకు సామాజిక మాధ్యమాలలో ‘లైక్స్’ కోసం ఎదురుచూడటం) సమయాన్ని వృధాచేయని యువతకు మరియ ఆదర్శం. మరియ అత్యంత శుద్ధమైన దానిని కనుగొనుటకు బయలుదేరినది. ఇది కలుసుకొనుట, పంచుకొనుట, ప్రేమ, సేవ నుండి వచ్చును. 
మంగళవార్త నుండి, ఎలిశబేతమ్మ సందర్శనతో ప్రారంభమైన తన ప్రేమపూర్వక సహాయాన్ని, అవసరతలోనున్న సహోదరీ సహోదరులకు సహాయం చేయడం ఎన్నడు ఆపలేదు. మన ప్రయాణంకూడా దేవునిచే వసించినదైనచో, సహదరీ సహోదరుల హృదయాలలోనికి మనలను నేరుగా నడిపించ గలదు. మరియ సందర్శన గురించి మనం ఎంతోమంది సాక్ష్యాలను వినియున్నాము! ఈ భూమిపై ఎన్నో సుదూర ప్రదేశాలలో తన దర్శనాల ద్వారా మరియ ఎంతోమందిని సందర్శించినది! ఆమె సందర్శించని స్థలమంటూ ఈ భూమిపై లేదు. దేవుని తల్లియైన మరియ ప్రజలమధ్య తన మృదువైన, సంరక్షణగల ప్రేమతో తిరుగాడుతూ ఉంటుంది. వారి ఆందోళనలను, ఇబ్బందులను తనవిగా చేసుకుంటుంది. ఆమె పేరిట అంకితం చేయబడిన దేవాలయంగాని, పుణ్యక్షేత్రంగాని ఎక్కడ యున్నను, ఆమె బిడ్డలు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, పండుగలు, ప్రార్ధనలు, గృహాలలో చిత్రపటాలు, ఇతర భక్తిపూర్వక చర్యలు దేవుని తల్లికి, ప్రజలకు మధ్యనున్న సంబంధానికి ఖచ్చితమైన ఉదాహరణలు.
ఆరోగ్యకరమైన వేగిరపాటు, మనలను ఎల్లప్పుడు ‘ఎత్తునకు’, ఇతరులవైపు నడిపిస్తుంది
            ఆరోగ్యకరమైన వేగిరపాటు, మనలను ఎల్లప్పుడు ‘ఎత్తునకు’, ఇతరులవైపు నడిపిస్తుంది. అనారోగ్యకరమైన వేగిరపాటు, అల్పముగా జీవించునట్లును, ప్రతీది తేలికగా తీసుకునేలా చేస్తుంది. నిబద్ధత, సంబంధం లేకుండా చేస్తుంది. ఇది వ్యక్తులమధ్య సంబంధాలలో- కుటుంబాలలో, స్నేహాలలో, ప్రేమజంటలలో జరగవచ్చు. హడావిడి చేస్తే, మన కార్యాలు ఫలవంతం కావు. అవి నిర్జీవముగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. సామెతల గ్రంధములో చెప్పినట్లుగా, “జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాల లాభము కల్గును. త్వరపడినచో ఫలిత మబ్బదు” (21:5).
            మరియ జెకర్యా, ఎలిశబేతమ్మల ఇంటిని సందర్శించినపుడు అద్భుతమైన సంఘటన జరిగింది. ఎలిశబేతమ్మ స్వయముగా దేవుని అద్భుతమైన కార్యాన్ని చవిచూసింది. వృద్ధాప్యములో దేవుడు ఆమెకు బిడ్డను కలుగజేశాడు. ఎలిశబేతమ్మ తన గురించి మాట్లాడకుండా, మరియ గర్భఫలాన్ని స్వాగతించడానికి ఆతురతను చూపింది. మరియ శుభవచనములు వినగానే, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైనది. ఇతరులకు ప్రాముఖ్యతనిస్తూ, మనం నిజమైన ఆతిధ్యాన్ని ఇచ్చినప్పుడు, ఇలాంటి ఆశ్చర్యకరమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు ప్రసరించ బడతాయి. దీనిని జక్కయ్య విషయములో కూడా చూడవచ్చు. “యేసు అచటకు వచ్చినపుడు పైకి చూచి, అతనితో ‘జక్కయ్యా! త్వరగా దిగిరమ్ము. ఈరోజు నేను నీ ఇంటిలో నుండ తలంచితిని’ అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను” (లూకా 19:5-6). మనలో చాలా మందిమి ఊహించని విధముగా యేసును అనుభూతి చెందియున్నాము. యేసు మనకు అతిచేరువలో యుండి తన జీవితాన్ని మనతో పంచుకోవాలని గుర్తించాము. ఈ అనుభూతి అనుభవమే యేసును స్వాగతించడానికి, ఆయనతో ఉండాలని, ఆయనను తెలుసుకోవాలని భావించేలా చేసింది. ఎలిశబేతమ్మ, జెకర్యాలు యేసు మరియలను తమ యింటికి స్వాగతించారు. ఈ ఇరువురు పెద్దలనుండి ఆతిధ్యము గురించి నేర్చుకుందాం! దేవున్నిఇతరులను జీవితములోని ఆహ్వానించడం గురించి మీ తల్లిదండ్రులను, పెద్దలను అడిగి తెలుసుకొనండి. వారి అనుభవాలను వినడం ద్వారా మీరు తప్పక ప్రయోజనం పొందుతారు.
ప్రియమైన యువతీ యువకులారా! అవసరతలోనున్న వారివైపునకు త్వరితముగా’ వెళ్ళుటకు సరియైన సమయం ఇదే. యువ కన్యమరియవృద్ధ ఎలిశబేతమ్మ విషయములో జరిగింది కూడా ఇదియే! అప్పుడు మాత్రమేమనం తరాలమధ్యసామాజిక వర్గాలమధ్యజాతిఇతర వర్గాల మధ్యనున్న దూరాన్ని తగ్గించగలంయుద్ధాలను సైతం అంతం చేయగలం. విచ్చిన్నమైనవిభజింపబడిన మానవ కుటుంబములోయువత ఎప్పుడుకూడా ఆశను కలిగిస్తుంది. పెద్దవారి జీవితాలనుండి పాఠాలను నేర్చుకోవాలి. లోకములోనున్న తీవ్రవాదాన్ని అధికమించాలి.
పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఇలా ప్రకటించాడు, “ఇప్పుడు క్రీస్తుయేసునందు ఏకమగుటతోదూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులనుఅన్యులను ఏకమొనర్చుటద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరుచేసివిరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంస మొనర్చెను (2 :13-14). ప్రతీ యుగములోమానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకుయేసే దేవుని సమాధానము. మరియ ఎలిశబేతమ్మను సందర్శించినప్పుడు ఆ సమాధానాన్ని తనలో మోసుకొని వెళ్ళింది. మరియ ఎలిశబేతమ్మకు తెచ్చిన గొప్ప బహుమతి స్వయముగా యేసుక్రీస్తే. ఖచ్చితముగామరియ అందించిన సహాయం అత్యంత విలువైనది. అయినప్పటికినీసజీవ దేవుని దివ్యమందసమైన కన్య మరియ గర్భములోని యేసు సాన్నిధ్యం తప్పమరేదియుకూడాజెకర్యా ఇంటినిగొప్ప ఆనందముతోసంతృప్తితో నింపియుండలేదు. ఆ పర్వత ప్రాంతములోఒక్కమాట కూడా మాట్లాడకుండానేతన మొదటి కొండమీద ప్రసంగాన్ని యేసు బోధించాడు. దేవుని దయను విశ్వసించే దీనాత్ములకువినమ్రులకు ధన్యతను నిశ్శబ్దముగా ప్రకటించాడు. ప్రియమైన యువతశ్రీసభకు అప్పగింపబడిన సందేశం క్రీస్తు. మీకు నా సందేశము కూడా ఇదియే. యేసు మనపై అనంతమైన ప్రేమ వలన నిత్యజీవమునునూతన జీవితమును ప్రసాదించాడు. మరియ మనందరికీ ఆదర్శం. ఈ అపారమైన అనుగ్రహాన్ని మనం ఎలా స్వాగతించాలోఇతరులతో ఎలా పంచుకోవాలోతద్వారా క్రీస్తునుఅతని దయగల ప్రేమనుఉదారమైన సేవనుగాయపడిన మానవాళికి ఎలా తీసుకురావాలో తెలియజేయు చున్నది.
మీలో చాలామందివలెనె మరియకూడా ఒక యువతి. మరియ మనలో ఒకరు. ఫాతిమానుండి దేవుని ప్రేమయొక్క శక్తివంతమైనఅద్భుతమైన సందేశాన్ని ఈ లోకానికి అందించారు. ఈ సందేశం నిజమైన మారుమనస్సుకుస్వేచ్ఛకు పిలుపునిస్తుంది.
ప్రియమైన యువతీ యువకులారాప్రపంచ యువత దినోత్సవ వేడుకలలో మీరు దేవున్నిసహోదరీ సహోదరులను కలుసుకోవాలనే ఆనందాన్ని మీరందరుకూడా అనుభూతి చెందాలనేది నా కల. లిస్బన్లో దేవుని సహాయముతో సోదరభావములోని ఆనందాన్ని చవిచూద్దాం. లేచి ముందుకు వెళ్ళుటకుకలసి పయనించుటకు పరిశుద్ధాత్మ మీ హృదయములను మేల్కొల్పునుగాక! మరియవలె లేచి త్వరితముగా వెళ్లుదము. మన హృదయాలలో యేసును మోసుకొనిమనం కలిసే ప్రతీ ఒక్కరి యొద్దకు ఆయనను తీసుకొని వెళదాము. పరిశుద్ధాత్మ మీలో చేయు మంచిని వాయిదా వేయకండి! మీ కలలనుమీ ప్రయాణములో ప్రతీ అడుగును ఆప్యాయతతో ఆశీర్వదించుచున్నాను.
 
జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ 
పునీత యోహాను బృహద్దేవాలయమురోమునగరము, 15 ఆగష్టు 2022 
పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణ మహోత్సవము

No comments:

Post a Comment