పునీత అపోస్తలులు పేతురు, పౌలుల మహోత్సవ సందర్భంగా,
ఎక్యుమెనికల్ పేట్రియార్కేట్ ప్రతినిధి బృందానికి
పరిశుద్ధ పోప్ లియో XIV ప్రసంగం
28 జూన్2025
మాన్యులు, క్రీస్తునందు ప్రియ సహోదరులారా!
రోము బిషప్‌గా
మరియు అపోస్తలుడైన పేతురు వారసుడిగా ఎన్నికైన తర్వాత, రోమన్ కతోలిక సంఘానికి పాలక
పునీతులైన పేతురు, పౌలుల మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ
తరుణంలో, సోదర సంఘమైన కాన్‌స్టాంటినోపుల్‌కు ప్రాతినిధ్యం
వహిస్తున్న ప్రతినిధి బృందాన్ని మొట్టమొదటిసారిగా స్వాగతించడం నాకు చాలా ఆనందంగా
ఉంది. ఈ రెండు సంఘాల పాలక పునీతుల మహోత్సవ సందర్భంగా ఇప్పటికే ఉన్న సహవాస బంధం,
అపోస్తలులైన పేతురు, అంద్రేయలను ఐక్యం చేసిన
సహోదర బంధానికి ప్రతీకగా ఉన్నది.
శతాబ్దాల
అపార్థాలు, విభేదాల తర్వాత, రోమ్, కాన్‌స్టాంటినోపుల్
సోదర సంఘాల మధ్య నిజమైన చర్చ మళ్ళీ మొదలవడానికి పోప్ పాల్ VI మరియు ఎక్యుమెనికల్ పాట్రియార్క్ అథెనాగోరస్ తీసుకున్న ధైర్యవంతమైన,
దార్శనిక చర్యలే కారణం. వారి గౌరవనీయ వారసులు, రోమ్, కాన్‌స్టాంటినోపుల్ సింహాసనాల నుండి, అదే సయోధ్య మార్గంలో నమ్మకంతో ముందుకు సాగారు. దీనివల్ల మన సంబంధాలు మరింత
బలపడ్డాయి. ఈ సందర్భంగా,
ఎక్యుమెనికల్ పేట్రియార్క్,
పరిశుద్ధ బర్తోలోమియో
గారు, కతోలిక సంఘము పట్ల చూపిన సాన్నిధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలలో వ్యక్తిగతంగా పాల్గొన్నారు.
అంతేకాకుండా, నా పోంటిఫికేట్ ప్రారంభోత్సవ దివ్యపూజా
బలిలో కూడా ఆయన పాల్గొన్నారు.
ఇప్పటివరకు
సాధించిన ప్రగతిని కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటూ, మన సంఘాల మధ్య పూర్తి
ఐక్యతను పునరుద్ధరించడానికి నేను కట్టుబడి ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను. దైవ
సహాయంతో, పరస్పర గౌరవంతో కూడిన సంభాషణ, సోదర భావంతో కూడిన చర్చ ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలం. ఈ
విషయంలో మీరు ఏమైనా సూచనలు అందిస్తే, వాటిని స్వీకరించడానికి
నేను సిద్ధంగా ఉన్నాను. అయితే, ఇది ఎల్లప్పుడూ కతోలిక సంఘములోని
నా సహోదర బిషప్‌లతో సంప్రదింపుల ద్వారానే జరుగుతుంది. సంఘము యొక్క పూర్తి మరియు
ప్రత్యక్ష ఐక్యతకు సంబంధించిన బాధ్యతను వారంతా తమదైన శైలిలో నాతో పంచుకుంటారు.
(రెండవ వాటికన్, ఎక్యుమెనికల్ కౌన్సిల్, డొగ్మాటిక్
కాన్స్టిట్యూషన్ లుమెన్ జెన్షియుమ్, 23).
మాన్యులు, క్రీస్తునందు
ప్రియ సహోదరులారా! ఈ పవిత్ర సందర్భంలో మీరు రోమ్‌కు విచ్చేసినందుకు నా హృదయపూర్వక
ధన్యవాదాలు. పేట్రియార్క్ బర్తోలోమియో గారికి, పవిత్ర సినడ్
సభ్యులకు నా సాదర శుభాకాంక్షలు తెలియజేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సంవత్సరం
కూడా ప్రతినిధి బృందాన్ని పంపినందుకు వారికి నా కృతజ్ఞతలు. పరిశుద్ధుల
పరిపూర్ణ సహభాగంలో నిత్యం జీవించే పునీత పేతురు మరియు పౌలు, పునీత
అంద్రేయ మరియు దేవుని పవిత్ర తల్లి, సువార్త సేవలో మనం చేసే
ప్రయత్నాలకు తోడుగా నిలిచి, వాటిని బలపరచుదురు గాక. ధన్యవాదాలు!
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/speeches/2025/june/documents/20250628-patriarcato-ecumenico.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment