పునీత అలెగ్జాండర్ (అలెగ్జాండ్రియ)

పునీత అలెగ్జాండర్ (అలెగ్జాండ్రియ) - Feb 26


అలెగ్జాండ్రియకు (ఐగుప్తు) చెందిన పునీత అలెగ్జాండర్ 313లో జన్మించారు. సున్నిత మనస్కుడు, మర్యాదస్థుడు; దయగలవాడు; ఉత్సాహభరితుడు; సేవాతత్పరుడు; దేవునిపట్ల గొప్ప ప్రేమ కలవారగుటచే, అలెగ్జాండ్రియకు పితరునిగా (Patriarch) నియమింప బడినారు. అలెగ్జాండర్ పట్ల అసూయను కలిగిన ఏరియస్ అను దుష్ట గురువు వలన ప్రభలిపోయిన అసత్య బోధన (ఏరియనిజం), అలెగ్జాండర్ తీవ్రముగా ఖండించాడు. ఏరియనిజం క్రీస్తు దైవత్వమును తృణీకరించినది. ఆరంభములో ఏరియస్ పట్ల దయ ఉంచి, తిరిగి శ్రీసభలోనికి రావాలని కోరారు. అలెగ్జాండర్ ఆహ్వానాన్ని అంగీకరించక పోవడముతో, 321లో అతను శ్రీసభనుండి బహిష్కరింప బడినాడు.
325లో 'నైసియ' పట్టణంలో జరిగిన అఖిల పీఠాధిపతుల సమావేశములో పాల్గొన్నారు. ఆ సమావేశములో అధికార పూర్వకముగా ఏరియస్ బహిష్కరింప బడినాడు. సమావేశం అతని అసత్య బోధనలను తీవ్రముగా ఖండించింది.
పునీత అతనాసియుసును అలెగ్జాండ్రియకు పీఠాధిపతిగా ప్రకటించి, 328లో మరణించారు.

No comments:

Post a Comment