పెంతకోస్తు, మొక్షారోహణము తరువాత,
తోమా పార్థియనులకు (ప్రస్తుత ఖొరాసన్), మిదీయనులకు (ఇరాన్), పర్షియనులకు క్రీస్తు
సువార్తను బోధించి, ఆ తరువాత భారతదేశములో తన ప్రేషిత సేవలను కొనసాగించారు. భారతదేశములో
క్రీస్తు సువార్తను తొలిసారిగా ప్రకటించిన అపోస్తలుడు తోమా.
మొదటిగా, (బహుశా, 52లో), తోమా భారతదేశములోని (కేరళ)
మలబారు తీరప్రాంతములో ప్రభువు సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు.
సముద్ర మార్గాన ‘గురువాయూరు’ సమీపమున ‘పాలయూరు’ రేవుకు చేరుకొని, అక్కడ నాలుగు (బహుశా
బ్రాహ్మణ) కుటుంబాలకు జ్ఞానస్నాన మిచ్చాడు. వారికి క్రైస్తవ సిద్ధాంతాలను,
ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను నేర్పించాడు. బహుశా, భారతావనిలో వీరే తొలి
క్రైస్తవులు. అలాగే, కేరళలో పలు దేవాలయాలను కూడా నిర్మించారు. అనేకమంది యూదులు,
స్థానికులు, రాజ కుటుంబీకులు జ్ఞానస్నానం స్వీకరించారు.
భవన నిర్మితుడిగా తోమా పేరు గాంచారు. ఒకసారి ఒక
రాజు, రాజమందిర నిర్మాణానికై తోమాసువారికి కొంత డబ్బు ఇవ్వగా, అతను ఆ డబ్బును
పేదలకు పంచి పెట్టాడు. కొంత కాలము తరువాత, ఆ రాజు రాజభవన నిర్మాణం ఎక్కడ అని
అడుగగా, పరలోకములో నిర్మించబడినదని సమాధానం చెప్పారు.
ఆ తరువాత, తోమా మద్రాసు (చెన్నై)
నగరములోనున్న మైలాపూర్ ప్రాంతం చేరుకున్నారు. అక్కడ సువార్తను బోధించి,
అనేకమందిని క్రైస్తవ మతములోనికి స్వీకరించాడు. దానితో స్థానికులు కొంతమంది ఆయనపై
కన్నెర్ర జేశారు. అదును చూసుకొని, ఒకరోజు మద్రాసు సమీపములోని ‘కొండ’పై ప్రార్ధన
చేసుకుంటుండగా, ఆయనపై దాడిచేసి, ఈటెతో పొడిచి చంపివేశారు. ఆయన 3 జూలై 72లో
వేదసాక్షి మరణాన్ని పొందారు. మైలాపూరులో కొండపై (St. Thomas Mount) ఆయన
నిర్మించిన దేవాలయములోనే భూస్థాపితం చేసారు. అక్కడ తోమా అద్భుత సిలువను ఆరాధిస్తారు.
వీరి జ్ఞాపకార్ధం ఇప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది.
ప్రస్తుతం తోమా వెముకలలోని ఒక చిన్న అవశేషం మాత్రమే ఈ దేవాలయములో ఉన్నది. ఎందుకన, క్రీ.శ. 232లో వారి
భౌతిక అవశేషాలను సిరియాలోని ‘ఎడెస్సా’ నగరమునకు పంపడం
జరిగింది. ఆ తరువాత, 1258లో వాటిని ఇటలీ దేశానికి పంపించారు. ‘ఒర్తోనా’లోని పునీత
తోమాసు వారి పెద్ద దేవాలయములో భద్రపరచబడినవి. ఎదేమైనప్పటికిని, తోమావారి కపాలము గ్రీసు
ద్వీపమైన ‘పత్మోసు’ నందు అపోస్తలుడైన పునీత యోహాను మఠంలో ఉన్నదని ఒక నమ్మకం.
తోమా “భారతదేశ అపోస్తలుడు” అని ఆరవ
పాల్ పోపుగారు (Pope
Paul VI) 1972లో ప్రకటించారు.
పునీత తోమాసుగారికి స్తోత్రముగా
జపము
Its really useful father.Congrats
ReplyDeleteGod is great
ReplyDelete