4 వ సామాన్య ఆదివారము, Year B

4 వ సామాన్య ఆదివారము, Year B
ద్వితీ. 18:15-20; భక్తి కీర్తన 95:1-2, 6-9; 1 కొరి 7:32-35; మార్కు 1:21-28
దేవుని వాక్కు శక్తి గలది: ఆలకింపుము

ఉపోద్ఘాతము: దేవుని వాక్కు శక్తిగలది
"మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మమ్ము అన్ని దేశములనుండి రప్పించి తిరుగ ఏకము చేయుడు. అపుడు మేము మీ నామ సంకీర్తనము చేయుచు మీకు ప్రస్తుతి చేయుటలో ఆనందము కలిగియుందుము".
గతవారం, "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" (మార్కు 1:14) అంటూ యేసు దైవరాజ్యమును ప్రకటించియున్నాడు.  ఈ వారం యేసు తన సువార్తా వాక్య బోధనద్వారా, తన అధికారముతో, శక్తితో, సాతానును గద్దించి పారద్రోలుచున్నాడు. దేవుని వాక్యం మన మధ్యలోనికి అనేక విధాలుగా వచ్చును. "దేవుని వాక్యం సజీవమును, చైతన్యవంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియు వరకును, అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను, అది విచక్షింపగలదు" (హెబ్రీ 4:12). దేవుని వాక్యం, మన హృదయములోనికి దూసుకొని పోగలదు. మన ఆలోచనలను, మన జీవితాలను మార్చగలదు. మనలను శుద్ధులను గావించి, మనలోని పాపమును తొలగించగలదు. ఈలోక విలువలకు వ్యతిరేకముగా, దైవరాజ్య విలువల వైపునకు మనలను నడిపించ గలదు. దేవుని వాక్యమునకు పాపోశ్చరణ శక్తిగలదు. మనలోని విభేధములను తొలగించి, ఒకటిగా చేయగలదు.
మొదటి పఠనము: దేవుడు పంపు ప్రవక్త బోధను ఆలకింపుము
మోషే ప్రవక్త (క్రీ.పూ 13వ శతాబ్దం) ఇశ్రాయేలు ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశమును ఇస్తున్నాడు. వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించు వారికి, వారిని నడిపించుటకు, జీవిత మార్గమును చూపుటకు దేవునివాక్యం వారితో ఎల్లప్పుడు ఉంటుందని చెప్పాడు. తన మరణం తర్వాత, దేవుడు వారిని విడచి వేయక వారితో తన ప్రవక్తలద్వారా మాట్లాడతాడని అభయాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్తను ఆలకించిన విధముగా, రాబోవు ప్రవక్తలను, వారి ప్రవచనాలను ఆలకించాలి. ప్రవక్తలను నిర్లక్ష్యము చేసిన యెడల, వారి జీవితాలు ప్రమాదములో పడిపోతాయి. యోర్దాను నది దాటి, వాగ్ధత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాతకూడా, దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోషే గుర్తుకు చేస్తున్నాడు. దేవుని ఒప్పందాలకు విశ్వాసపాత్రులుగా జీవించిన యెడల, వారు అనేక దైవవరములను పొందెదరు. నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారికి కష్టాలు తప్పవు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నపుడు, వారికి దేవుడు ఎలా అవసరపడి యున్నాడో, అలాగే, వాగ్ధత్త భూమిలో కూడా, దేవుని అవసరం, సహాయం, శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అనేక ప్రవక్తలద్వారా వచ్చు దేవుని సందేశమును, వాక్యమును శ్రద్ధగా ఆలకించి, పాటించాలి.
ఈవిధముగా మోషే, భవిష్యత్తులో రాబోవు గొప్ప ప్రవక్త (యేసు క్రీస్తు) ను గూర్చి ప్రవచిస్తున్నాడు. "నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారిచెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నియు అతడు వారితో చెప్పును" (ద్వితీ 18:18). క్రీస్తునందు ఈ ప్రవచనం నెరవేరినది. క్రీస్తుద్వారా మనం నిజమైన వాగ్ధత్తభూమికి (పరలోకం, నిత్యజేవము) నడిపించాడు. కనుక దేవుని చిత్తమును, సత్యమును బయలుపరచు నిజ ప్రవక్తల బోధనలను శ్రద్ధగా ఆలకించాలి.
రెండవ పఠనము: వివాహితుల బాధ్యతలు
దేవునిచేత ప్రత్యేకముగా ఒసగబడిన పిలుపును విశ్వాసముతో జీవించాలని, పునీత పౌలుగారు బోధిస్తున్నారు. ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవివాహితులకు మాత్రమేగాక, వివాహితులకుకూడా అని గుర్తించాలి. సకల విచారముల నుండియు దూరము కావలయుననియు, అత్మచేత ప్రేరేపింపబడి, ప్రభువును నమ్మిన పౌలుగారు చెబుతున్నారు. అవివాహితులు, విధవరాండ్రు దేవుని విషయములందు నిమగ్నులై ఉండాలి. దేవున్ని సంతోష పెట్టుటకు ప్రయత్నించాలి. అలా శారీరకముగా, ఆత్మయందును పరిశుద్ధులై ఉండెదరు. వివాహితులు ఈలోక విషయాలలో చిక్కుకొని ఉండెదరు. భర్త భార్యను, భార్య భర్తను ఎలా సంతోషపెట్ట వలయునని లౌకిక వ్యవహారములలో చిక్కుకొని ఉండెదరు. వారి జీవితం దేవునికి-లోకానికి మద్య విభజింప బడుతూ ఉంటుంది. వారు విచారములనుండి దూరము కావలయునంటే, ప్రభువునకు సంపూర్ణముగా వారి జీవితాలను అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవరచు కోవాలి. కుటుంబ భాధ్యతలను నేరవేరుస్తూనే, దేవుని విషయాలయందుకూడా నిమగ్నులై యుండాలి. పొరుగువారిని ప్రేమిస్తూ, దైవాజ్ఞలను విధేయిస్తూ, సజీవ విశ్వాసము కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి.
సువిశేష  పఠనము: యేసు బోధ అధికారము గలది
యేసు విశ్రాంతి దినమున (సబ్బాతు) కఫర్నాములోని (గలిలీయ సముద్ర తీరమున ఒక చిన్న గ్రామము; పేతురు అతని సోదరుడు అంద్రేయ అక్కడ నివసించిరి; నజరేతును వీడిన యేసు, కఫర్నామును తన నివాస మేర్పరచు కొనెను మత్త 4:13; మా 2:1) యూదుల ప్రార్ధన మందిరములోకి (సినగోగు - ప్రార్ధన, బోధన, ఆరాధన, సంఘకూడిక) ప్రవేశించి, ధర్మశాస్త్రబోధకులవలెగాక (యూదచట్టం యొక్క అధికారిక వ్యాఖ్యాతలు), అధికారపూర్వకముగా బోధించాడు. అనగా ఆత్మవిశ్వాసముతో లేఖనాలను వివరించాడు. ధర్మశాస్త్రబోధకులు, ఆత్మసంబంధమైన విషయాలకుగాక, బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. "వారు బోధించునది వారే ఆచరింపరు" (మత్త 23:3) అని వారి గురించి యేసు చెప్పాడు
యేసు దైవీక అధికారాన్ని కలిగియున్నాడు. ఆయన బోధనలయందును, కార్యములందును శక్తిగల ప్రవక్త, మెస్సయ్య. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్తలో, ప్రభువును, ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకరునిగా, ప్రార్ధనాపరునిగా చూస్తాము. ఇవన్నియు, ప్రభుని అనుదిన చర్యలో భాగాలే! ఆయన, ఓ గొప్ప గురువు, బోధకుడు. ప్రజలకు దర్మశాస్త్రమును గూర్చి బోధించాడు. ఆయన వద్దకు విశ్వాసముతో వచ్చిన ప్రతీవారిని స్వస్థపరచాడు. గురువు తన వ్యక్తిగత జీవితముద్వారా, అనుభవముద్వారా, జ్ఞానాన్ని ఇతరులకు ఒసగుతాడు. ప్రభువు, తన జీవితాంతముకూడా, దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధించాడు. సువార్తను అర్ధము చేసికొనుటకు, ఉపమానాలద్వారా విశదపరచాడు. క్రీస్తు బోధన కేవలం మదిలోనికేగాక, హృదయములోనికి కూడా ప్రవేశిస్తుంది. ప్రజలు అతని చర్యలలో దేవుని దయను, కరుణను అనుభవించారు. రోగులను, పాపాత్ములను, సమాజముచే వెలివేయబడిన వారిని ప్రేమతో ఆదరించాడు. నేటి సువార్తలో దయ్యము పట్టినవానికి స్వస్థతను చేకూర్చాడు (మార్కు 1:23-26). అందుకే ప్రజలు, ఆశ్చర్యపడి "ఇది యేమి? ఈ నూతన బోధయేమి?" (మార్కు 1:27) అని గుసగుసలాడారు.
యేసు తండ్రిప్రేమను బోధించాడు. యేసు అధికారము - తండ్రి దేవుని ప్రేమ యొక్క శక్తి. ఆయన నిశ్చయముగా, అధికార పూర్వకముగా బోధించాడు, ఎందుకనగా, ఆయన బోధన తండ్రిచిత్తమని, తండ్రివాక్కు అని ఎరిగియున్నాడు. యేసుప్రభువు దేవుని వాక్యమును బోధించాడు. దేవునిగూర్చి, రక్షణ ప్రణాళికనుగూర్చి బోధించాడు. ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తిని చూపారు. ఈ సందర్భాలలోనే ఆయన ఎన్నో అద్భుతాలను చేసాడు. ఈనాడు, అపవిత్రాత్మతో ఆవేశించిన వానిని, ప్రభువు స్వస్థపరచాడు. ఆ అపవిత్రాత్మ ప్రభువు శక్తిని అణగత్రొక్కుటకు ప్రయత్నం చేసింది. కాని, ప్రభువు దానిని తన శక్తితో, అధికారముతో గద్దింపగా, అది వదలి పోయింది. క్రీస్తు అధికారపూర్వకముగా బోధించాడు. యేసు బోధనలు అధికార పూర్వకమైనవి, ఎందుకన, ఆయన దేవుడు, నిత్యజీవపు మాటలు కలవాడు. అందుకే, ఆయన బోధ మనసున, హృదయమున నాటుకొని పోతుంది. అదే యేసుప్రభువునకు, ధర్మశాస్త్రబోధకులకు మధ్యనున్న వ్యత్యాసము. యేసు తన అధికారాన్ని ఇతరుల శ్రేయస్సు, స్వస్థత, రక్షణ కొరకు ఉపయోగించాడు (చదువుము మా 10:45). మనం కూడా యేసువలె జీవించాలి (చదువుము మా 10:42-43). ఎందుకన, మన జ్ఞానస్నాముద్వారా, యేసు అధికారములో భాగస్వామ్యం అవుతున్నాము. ఇతరుల సేవకై మనకున్న అధికారాన్ని వినియోగించాలి.
సందేశము
అయితే, ఈ రోజుల్లో, 'అధికారం' ఓ చెడు పదముగా మారింది. అధికారం అంటే డబ్బు, పదవులు, ఆధిపత్యం, విజయాలు అని తప్పుగా భావిస్తున్నాం. దేవుని దృష్టిలో, అధికారం అనగా, సేవ, వినయము, ప్రేమ.
ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తాం. అలా అధికారముతోగాక, మన మంచి జీవితముద్వారా, ఇతరుల గౌరవాన్ని పొందాలి. అప్పుడే, మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు. ఆరవ పౌలు పాపుగారు, ఓ సందర్భములో 'ఈ లోకం బోధకులకన్న ఎక్కువగా సాక్షులు అవసరం ఎంతో ఉన్నది' అని అన్నారు. ఈ రోజు, గురువులను, బోధకులను గౌరవిస్తున్నారంటే, వారికున్న అధికారమునుబట్టి కాదు. కాని వారి జీవితమును బట్టి. వారు ఎలాంటి వ్యక్తులు, ఎలా జీవిస్తున్నారో వారి బోధనలను బట్టి చెప్పగలరు. యేసు ప్రభువు అధికారపూర్వకముగా బోధించాడు. ఆయన గొంతెత్తి బోధించాడనో , శిక్షనుగూర్చి బోధించాడనో కాదు. ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారముగా సాగింది. ఆయన జీవించినదే, బోధించాడు. అందుకే, అధికారముతో బోధించగలిగాడు.
పునీత అస్సీసి పుర ఫ్రాన్సిసు వారు ఒకసారి, ఒక సహోదరుని పిలచి, మనం పట్టణానికి వెళ్లి దేవుని సువార్తను బోధిద్దాం అని చెప్పాడు. అలాగే, ఆ ఇరువురు పట్టణ వీధులలో తిరిగి, ఒక్క వాక్యమైన బోధించకుండా, దారిలో కలిసిన వారందరిని పలుకరించి తిరిగి వచ్చారు. ఆ సహోదరుడు, ఎందుకు మనం ఏమీ బోధించలేదని అడుగగా, మనం పట్టణములో నడచినంత సేపూ మన జీవిత ఆదర్శము ద్వారా బోధించామని ఫ్రాన్సిసువారు చెప్పారు. మన బోధ కేవలం మాటలద్వారా మాత్రమేగాక, మన బోధ జీవితమై యుండాలి.
క్రీస్తు ఓ గొప్ప బోధకుడు. మనమందరం ఆయన శిష్యులం, అనుచరులం. దేవుడు, జ్ఞానస్నానము ద్వారా, మనకొక్కరికి ఓ విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించునట్లు చేసాడు. ఆ పిలుపునకు మనం ఎల్లప్పుడు స్పందించాలి. ఎలాంటి విచారములకు లోనుకాకుండా, లోకవ్యవహారములలో చిక్కుకొనక, ప్రభునిలో నమ్మకముంచి, ముందుకు సాగిపోవాలి. మనలోనున్న అపవిత్రాత్మ శక్తులను, లోకవ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్దన చేద్దాం. యేసుక్రీస్తు శక్తిని, అధికారాన్ని మన అనుదిన జీవితాలలో గుర్తించి ప్రతిస్పందించాలి. 
దయ్యములను వెడలగొట్ట బడటం పాత నిబంధనలో 1 సమూ 16:14-23; తోబితు 8:1-3); పాత నిబంధనలో ప్రేషిత సేవలో భాగముగా చూడవచ్చు (మత్త 9:32-34; 12:22-32; మా 1:22-27; 3:14-30; 5:1-206:7; 7:24-30; 9:17-29; 16:17; అపో.కా. 5:16; 8:7; 19:12). ఇది శ్రీసభ పరిచర్యలో కూడా భాగమే (శ్రీసభ చట్టం 1172 1,2).
తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, గురువులుగా, మఠవాసులు, మఠకన్యలుగా, పాలకులుగా, ప్రజాధికారులుగా మనం కలిగియున్న అధికారము, మనము జీవించే జీవిత విధానమునుండి (సేవ, వినయము, ప్రేమ) రావాలి. అప్పుడే, మనం చెప్పేదానిని ఇతరులు ఆలకిస్తారు. మనమూ గౌరవాన్ని పొందగలము. 
నేడు ప్రార్ధనాలయములాంటి మన హృదయములో అధికారముతో మనకు బోధిస్తున్నారు. ఆయన మాటలను హృదయపూర్వకముగా ఆలకించు చున్నామా? ప్రస్తుత కాలములో ఎన్నో విధములైన ‘అపవిత్రాత్మలతో’, నిండియున్నాము, శోధింప బడుచున్నాము. స్వస్థపరచమని యేసు క్రీస్తును వేడుకుందాం.

3వ సామాన్య ఆదివారం, YEAR B

3వ సామాన్య ఆదివారం, Year B
యోనా 3:1-5, 10, భక్తి కీర్తన 25 : 4-9, 1 కొరి 7: 29-31, మార్కు 1:14 -20
"సర్వేశ్వరునికి ఒక కొత్త స్తుతి గీతమును పాడుడు. సర్వ ప్రజలారా, సర్వేశ్వరుని ప్రస్తుతి చేయుడు, ఆయన పవిత్ర సమక్షమున విశ్వాసము, సౌందర్యము, పవిత్రత, వైభవములు కలవు."

పిలుపు అనునది దేవుని వరం. పిలిచేది భగవంతుడు. భగవంతుడు ప్రతి వ్యక్తిని ఒక ముఖ్య ఉద్దేశముతో పిలుస్తాడు. దేవుని పిలుపును భక్తితో ఆలకించాలి. దేవుని పిలుపును కనుగొనాలి. మనం అలా ఆరుబయట నడచుకొంటూ ముఖ్యముగా కొండప్రక్కన పెద్ద పెద్ద రాళ్ళను చూస్తాము. ఆ రాళ్ళవైపు మనం ఎంతసేపు చూసిన అది మనకి రాయిలాగే కనపడుతుంది. అది రాయేకదా అని అనుకొని వెళ్లిపోతాము. కాని ప్రపంచ ప్రసిద్దిగాంచిన శిల్పి మైఖిల్ అంజేలో అలా కాదు. ఆయన రాయిలో ఒక శిల్పాన్ని కనుగొన్నాడు. ఒకరోజు ఆయన ఒక పెద్ద రాయిని చెక్కుతుండగా, ఒక బాటసారి వచ్చి, నీవు ఏమి చేయుచున్నావు? అని అడిగాడు. అందుకు, అతను 'నేను ఈ రాయిలో ఉన్న దేవదూతను బయటకు తీయుచున్నాను' అని సమాధానమిచ్చాడు. మనం కూడా దేవుడు మనకు దయచేసిన పిలుపును కనుగొనాలంటే, దేవుని సహాయం అవసరం.

నేటి సువిషేశములో, యేసుప్రభువు బెస్తలను చూచి ఇలా ఆహ్వానించాడు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుషులను పట్టువారిగా చేసెదను". వెంటనే, వారు తమ వలలను విడచిపెట్టి యేసును వెంబడించారు, 'మేము రాము', 'మాకు కుదరదు', 'ఆలోచించుకొని నిర్ణయం తీసుకొంటాము' అని చెప్పలేదు. యేసు ప్రభువు పిలుపునకు బెస్తలు స్పందించిన తీరు అమోగం, అద్భుతం. వలలను, పడవలను (జీవనోపాధి), తండ్రిని (కుటుంబాన్ని) విడచి పెట్టి ప్రభువును అనుసరించడానికి వారు చూపిన భక్తి, విశ్వాసం, నమ్మకం, త్యాగం ప్రశంసనీయం. వారికి ఉన్నటువంటి శక్తిని, సామర్ధ్యమును, ఇకనుండి చేపలను పట్టుటకు కాకుండా, మనుష్యులను పట్టడానికి వారు తీసుకొన్న నిర్ణయం మహాద్భుతం.

ప్రభువు పిలుపును స్వీకరించినప్పుడు మన జీవితములో మనకు ప్రీతికరమైన ఎన్నో వస్తువులకు మనం దూరం కావలసి వస్తుంది. బెస్తల పిలుపులో గమనించదగిన విషయం. వారు సాధారణ వ్యక్తులు. మరో ఆలోచన లేకుండా ప్రభువు పిలుపును అందుకొని దానికి తగిన విధముగా స్పందించారు.

యేసు ప్రభువు పేతురుతో ఒక బెస్తవానిని కాక, శ్రీసభకు పునాదిరాయి అయిన శక్తిని అతనిలో చూశారు. అతడు ఏమి కాగలడో కేవలం ప్రభువునకు మాత్రమే తెలుసు. "మీ జీవితాన్ని నాకర్పించిన యెడల దాని సామర్ధ్యమును బట్టి నేను తీర్చి దిద్దుదును" అని యేసు ప్రభువు ప్రతి ఒక్కరిని ఈ విధముగా ఆహ్వానిస్తున్నారు.

మనలో ప్రతి ఒక్కరము ప్రభువు చేత పిలువబడినాము. ప్రవక్తలుగా జీవించడానికి, ప్రవచనాలు పలకడానికి, ప్రభోదం చేయడానికి, పరిరక్షకులుగా ఉండి, ఇతరులను సాతానునుండి రక్షించడానికి మనం పిలువబడి యున్నాము. ప్రవక్తలుగా, భోదకులుగా, దేవునిచేత ఎన్నుకొనబడిన బిడ్డలుగా మనందరి భాద్యత ఏమంటే - యేసప్రభువు గలిలయ సరస్సు తీరములో మొదలు పెట్టిన ప్రేషితకార్యాన్ని మనం కొనసాగించడం.

మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన అభిషేకాన్ని పొందిన బిడ్డలుగా, దేవుని పిలుపును అందుకొని జీవించే బిడ్డలుగా, ఆయన రాజ్యానికి చెందిన బిడ్డలుగా జీవించడానికి ఆశిస్తున్నప్పుడు అన్ని రకాలైన దుష్టశక్తులు మనకు ఆటంకములుగా నిలబడతాయి.  అదే సమయములో ప్రభునివాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, "ఈ జీవిత పోరాటం నీది కాదు. నాది. నేను నీకు తోడైయుండి నిన్ను నడిపిస్తాను". దైవపిలుపును అందుకొని, దైవపిలుపుకు తగిన విధముగా స్పందించి, దైవపిలుపులో ముందుకు సాగే ప్రతీ బిడ్డలో ప్రభువు పలికే పలుకులు. - "నేను నీకు తోడైయుండి నిన్ను ముందుకు నడిపిస్తాను."

కష్టం, దు:ఖం, వేదన సమయములో దేవుడు మనకు దయచేసిన ఉన్నతమైన జీవమును, జీవితమును తప్పకుండ కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును కాపాడు కోవాలి. యేసు ప్రభువుకు సాక్షులుగా నిలబడాలి. మనం ఈ లోకములో దుష్టుడైన సాతానుతో పోరాడుతున్నప్పుడు, మనం ధరించియున్న ఆయుధాలు ఈ లోకానికి చెందినవి కావు. దేవునికి చెందినవి అని పునీత పౌలుడు రెండవ కొరింతీయులకు వ్రాసిన లేఖలో 10వ అధ్యాయం 3-5 వచనాలలో చెబుతున్నారు. అంతేకాదు, పునీత పౌలు కొలస్సీయులకు వ్రాసిన లేక 3:12 లో "మనం దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలం. మనం పరదేశులం కాదు. మనం అనాధలం కాదు. చీకటినుండి ఉన్నతమైన దేవుని వెలుగులోనికి నడిపింపబడుతున్నాం." ఇటువంటి ఉన్నత జీవితం కోసం మనం దేవుని ప్రార్ధించాలి. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు. వెళుతున్నప్పుడు ఏమి తీసుకొని పోలేము. జీవించినంత కాలం దేవునికి ఉన్నతమైన బిడ్డలుగా, సాక్షులుగా, దేవుని పిలుపును, దేవుని పిలుపు యొక్క గొప్పతనాన్ని, దేవుని పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని లోకానికి చూపించే బిడ్డలుగా మారాలి. అటువంటి ఉన్నతమైన బిడ్డల్ని, సాక్షులను యేసయ్య ఈనాడు వెదకుచున్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా?

దైవ సేవకుడు, బ్రదర్ జోసఫ్ తంబి 

దైవ సేవకుడు, బ్రదర్ జోసఫ్ తంబి ఆధ్యాత్మిక జీవితం మనందరికి ఓ సవాలు!

దేవుడు పరమ రహస్యం. పరమ రహస్యమైన దేవుడు తన కరుణ, అనంతమైన ప్రేమలద్వారా, తననుతాను, ఈలోకానికి, ముఖ్యముగా, తన ప్రియబిడ్డలమైన మనందరికి బహిరంగ పరస్తూఉన్నాడు. తనకుతానుగానే కాకుండా, అనేక విధాలుగా (వ్యక్తులు, సంఘటనల ద్వారా) పరమరహస్యాన్ని బహిర్గతమొనర్చడం రక్షణచరిత్రయ౦తయు చూస్తున్నాము. దేవుడు ప్రేమ, మరియు ఆ ప్రేమ అనంతమైనది, అపారమైనది, ఏమియు ఆశించనటువంటిది. ఈ ప్రేమే మనలను ఆ దేవునికి, ఆ ప్రేమకి అంటిపెట్టుకొనేల చేస్తుంది. తన ప్రియకుమారుడు, యేసుక్రీస్తుప్రభువుద్వారా, దేవుడు ఏవిధముగా, తననుతాను మరియు తన హద్దులులేనిప్రేమను బహిరంగపరచినది మనందరికీ తెలిసినదే! దేవుడు అయినప్పటికిని, మానవరూపమును, స్వభావమునుదాల్చి, జీవించి, మరణించి, మనలను ఇహలోకమునకుచెందిన జీవితమునుండి విముక్తినిగావించి, తండ్రి రాజ్యమునకు, అర్హులను మరియు వారసులుగా చేసియున్నాడు. క్రీస్తునందు, దైవప్రేమ రూపమునుదాల్చి యున్నది. తద్వారా, ఆ పరమరహస్యముతో, బాంధవ్యాన్ని ఏర్పరచుకోగల్గుతున్నాము. దేవుడు పరమరహస్యం. కాని, క్రీస్తునందు తననుతాను బహిర్గతమొనర్చుతూ మనదరికి చేరువవుతూ ఉన్నాడు. ఈ పరమరహస్య బహిర్గత, ప్రతి క్రైస్తవ జీవితముద్వారా, ఈనాటికి కొనసాగుతూ ఉన్నది. ఎందుకన, క్రీస్తునందు ప్రతి ఒక్కరు సంపూర్ణ జీవితమునకు పిలువబడి ఉన్నారు. పునీతులు, దైవభక్తులు, ఈ కార్యాన్ని ప్రత్యేక విధముగా ప్రదర్శించి మనందరికీ ఆదర్శ ప్రాయులుగా నిలుస్తున్నారు. దైవమానవ ప్రేమలో సంపూర్ణముగా ఎదగడానికి మనం పిలువబడినామని గుర్తు చేస్తున్నారు.

అలాంటివారిలో మనం గుర్తుకుచేసుకోదగ్గ వారు దైవసేవకుడు బ్రదర్ . జోసఫ్ తంబి. తనదైనశైలిలో, దేవుని అపారప్రేమను, దైవ రక్షణ సందేశమును బహిర్గతమొనర్చుటకు తన జీవితాన్ని అంకితముచేసిన ఓ గొప్ప మహనీయుడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితము అతనికి ప్రధాన ప్రేరణగా నిలచింది. ఫ్రాన్సిస్ వారి జీవిత ఆదర్శవిలువలు ఆయన జీవితాన్ని ముందుకు నడిపించాయి. దైవకృపతో పునీత ఫ్రాన్సిస్ వారి మార్గములో, శ్రమల కొలిమిలో, పవిత్ర వస్త్రాన్ని ధరించిన కుసుమం బ్రదర్. జోసఫ్ తంబి.

పునీత ఫ్రాన్సిస్ వారి త్రితీయ సభలో సభ్యునిగా ఉండి , తన జీవిత చివరి అంఖము వరకూ, అనంతమైన దేవుని ప్రేమను, నలుదిశల వ్యాపింపచేయడానికి కృషిచేసియున్నాడు. ఈ క్రమములోనే, విజయవాడ మేత్రాసనములోని పెద్దావుటపల్లికి చేరుకొని యున్నాడు. ఆయన అచ్చట 1939 వ సం.ము నుండి 1945 వ సం.ము వరకు, దైవ ప్రేమను, రక్షణ సందేశమును బోధిస్తూ, దైవ సేవలో జీవించి యున్నాడు. తన బోధన మరియు సేవాజీవితము తన వాక్తుచర్యము వలనగాక, సాధారణమైన, ప్రమాణసిద్ధమైన మరియు సిలువలోని క్రీస్తానుకరణము ద్వారా కొనసాగింది.

దీనదైవసేవకుడు, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి అనుచరుడు, దైవపుత్రుడైన బ్రదర్ జోసఫ్ తంబీ గారు జనవరి 15, 1945 సం.ము తన 63 వ యేట మరణించారు. ఆయన మరణానంతరం, కుల, మత, జాతి, అంతస్తు అను బేధాలు లేకుండా విశ్వాసులు ఆయనను ఒక పునీతునిగా గౌరవించడం ప్రారంబించారు. ఆయన సమాధిచెంతకుచేరి, ప్రార్ధన సహాయాన్ని కోరుచున్నారు. గడచిన శతాబ్దాలలో, విశ్వాసుల సందర్శన అధికమదికముగా పెరిగింది. అదేవిధముగా, దివ్యపూజాబలి పీటముయందు, పునీతుల బాంధవ్యములో తంబీగారిని చూడాలని అనేకమంది విశ్వాసులు వ్యక్తపరచియున్నారు. దీని నిమిత్తమై, విజయవాడ పీఠాధిపతుల సలహా మరియు సహాయసహకారాలతో, ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమావేశ సహాయముతో, మేరిమాత కపూచిన్ ప్రావిన్సు, బ్రదర్ జోసఫ్ తంబిగారి పునీతపట్టముయొక్క కార్యమునకు ప్రతిబూనింది. అందునిమిత్తమై, 24 జూన్ 2007 సం.న, పెద్దవుటపల్లిలో, యేసుతిరుహృదయ దేవాలయమున, పవిత్ర దివ్యపూజాబలిలో, రెవ.మల్లవరపు. ప్రకాష్, విజయవాడ పీఠాధిపతులు, బ్రదర్ జోసఫ్ తంబిగారిని ''దైవసేవకుడు''గా ప్రకటించియున్నారు. తద్వారా, పునీత పట్టముయొక్క కార్యం ప్రారంభించడమైనది.

''దైవ సేవకుడు'' బ్రదర్ జోసఫ్ తంబీ గారు, మన కాలములోనే జీవించియున్నారు. తన జీవితముద్వారా, పుణ్యముగా జీవించడం సాధ్యమేనని సాక్ష్యం ఇచ్చియున్నాడు. ఈ దైవసేవకుని పుణ్యజీవితమును చాటిచెప్పడానికి, ఆంధ్రప్రదేశ్లోని కపూచిన్సభ సహోదరులు, తంబిగారి భక్తిగీతాలు, ''తంబి వెలుగు'' ద్విమాస పత్రిక, తంబి ప్రార్ధనకూటాలు మొ,,గు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. స్వర్గీయగురువులు, కపూచియన్ సభకు చెందిన అవిటో పొట్టుకులం గారు 1984వ సం.లో, ''బ్రదర్ జోసఫ్ తంబిగారి జీవిత చరిత్ర'' అను పుస్తకమును ఆంగ్లములో రచించియున్నారు. ఈ పుస్తకం, తెలుగు, తమిళం, మలయాళం, ఫ్రెంచి భాషలలోనికి అనువాదం చేయబడింది. మూడుదశాబ్దాల అనంతరం, 2002వ సం.లో, స్వర్గీయ గురువులు ఒస్వాల్డు ప్రతాప్ కుంపలకురి గారు, తంబిగారి జీవితమునుగూర్చి చక్కటి అద్బుతమైన పుస్తకమును ఆంగ్ల బాషలో రచించియున్నారు. ఈ పుస్తకాన్ని 2011వ సం.లో తెలుగులోనికి అనువాదం చేయబడింది.

బ్రదర్ జోసఫ్ తంబి గారు దైవ ప్రేమను, కరుణను, ప్రకటించియున్నారు. ఈనాడు, మనము అదే చేయాలని దైవ సేవకుడు మనల్ని సవాలు చేస్తున్నారు. దైవరహస్యం ప్రేమరహస్యమే. ఆరహస్యాన్ని బయలుపరచడం మన అందరి ధర్మం.

పాదువాపురి పునీత అంతోని మహోత్సవము: 13 జూన్

పాదువాపురి పునీత అంతోని మహోత్సవము: 13 జూన్

నేడు మనం ‘అద్భుతాల అంతోని పాదువా పురి’ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడు చున్నాము. అయితే, అతని అసలు పేరు అంతోని కాదు; అసలు ఊరు పాదువా కాదు. మరి పాదువా పురి’ అంతోనిగా ఎలా మారారో తెలుసుకుందాం. ఆ పుణ్యాత్ముని జీవితాన్ని ధ్యానిద్దాం. ఆయన జీవించిన సువార్త సుగుణాలను మనంకూడా జీవించ ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరికీ అంతోనివారి పండుగ శుభాకాంక్షలు!

పునీత అంతోనివారు క్రీ.శ. 1195 ఆగుష్టు 15, పోర్చుగల్ (అప్పట్లో స్పెయిను దేశములో భాగం)లోని లిస్బన్ నగరంలో, మార్టిన్, తెరెసా దంపతులకు జన్మించారు. పాత లిస్బనులోని కేథీధ్రలునందు (పెద్ద దేవాలయములో) జ్ఞానస్నానము పొంది ఫెర్నాండో అనే పేరుతో నామకరణం చేయబడ్డాడు. అక్కడ జ్ఞానస్నానపు తొట్టిపై ఇలా వ్రాసియుంటుంది: ఇక్కడ పవిత్రమైన బాప్తిజపు జలాలు అంతోనివారిని, జన్మపాపమునునుండి శుభ్రము చేసెను. ప్రపంచము ఆయన కాంతిలోను, పాదువా ఆయన శరీరమందును, పరలోకం ఆయన ఆత్మయందు ఆనందించుచున్నది. 

తండ్రి పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫోన్సు కొలువులో రెవెన్యూ అధికారి. చిన్ననాటినుండే క్రైస్తవ విశ్వాసములో, మరియతల్లిపట్ల ప్రత్యేక భక్తితో పెరిగాడు. మంచి ప్రవర్తనతో పెరిగాడు. గ్రామప్రజలు అతనిని ‘చిన్న దేవదూత’ అని పిలిచేవారు. ఫెర్నాండో 15 సం.ల ప్రాయమున లిస్బనులోని, పు. అగుస్తీనువారి మఠములో (Canons Regular of St. Augustine) చేరారు. రెండు సం.ల తర్వాత కోయింబ్రాలోని సాంతక్రూజ్ అగస్తీను ఆశ్రమానికి పంపబడ్డాడు. 9సం.ల పాటు ప్రార్ధనా జీవితం, దైవశాస్త్ర అధ్యయనంద్వారా వేదపండితుడు అయ్యాడు.

ఫెర్నాండోకు 25 సం.ల వయస్సు ఉన్నప్పుడు, అతని జీవితములో గొప్ప మార్పు, అద్భుత సంఘటన జరిగింది. ఇది తన జీవితాన్నే మార్చివేసింది. అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఐదుగురు సహోదరులు మొరాకోలో జరిగిన వేదహి౦సలలో చంపబడ్డారు. ముక్కలుగావున్న వారి దేహాలను శవపేటికలో చూచిన తర్వాత, ఫెర్నాండో చలించి తానుకూడా వేదప్రచారకుడిగా, వేదసాక్షి మరణాన్ని పొందాలాని, క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాలనే కోరిక తనలో దహించి వేయగా, పునీత ఆగస్తీనువారి మఠాన్ని విడచి, ఫ్రాన్సిస్ వారి సభలో చేరాడు. 1221 సం.లో ఫ్రాన్సిస్ సభ అంగీని ధరించి, తన పేరును అంతోనిగా మార్చుకున్నాడు. కొన్ని మాసాలలోనే, క్రీస్తు సువార్తను ప్రకటించి, ఇతరులను క్రైస్తవులుగా మార్చి, వేదమరణము పొందాలనే ఆశయముతో మొరోకో ప్రాంతానికి బయలుదేరాడు. అయితే, దేవుని చిత్తము వేరుగా ఉండినది. మార్గమధ్యములో తీవ్ర మలేరియా జ్వరమునకు గురియగు వలన వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. దేవుడు తననుండి వేరేరకమైన త్యాగాన్ని కోరుతున్నాడేమోనని గ్రహించాడు. తిరుగు ప్రయాణములో ఉధృతమైన గాలితుఫాను వలన, వారు ప్రయాణించే ఓడ ఇటలీ దేశములోని సిసిలి తీరప్రాంతానికి చేర్చబడింది. అక్కడ ఫ్రాన్సిసు సభ సోదరులు అతనికి సపరిచర్యలు చేయగా, పూర్తిగా కోలుకున్నాడు.

అక్కడనుండి 23 మే 1221వ సం.న అస్సీస్సిపురములో జరిగిన ఫ్రాన్సిసు సభ సర్వసభికుల సమావేశము (great Chapter of Mats)లో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారిని కలుసుకొన్నారు. పునీత ఫ్రాన్సీసువారి జీవితము, బోధనలు అంతోనివారిని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఫ్రాన్సీసు వారి సభలో చేరిన తర్వాత, అంతోని వారు, తన చదువును, తెలివితేటలను ప్రక్కన పెట్టి, చాలా సాధారణమైన జీవితాన్ని జీవించాడు. ఆశ్రమములో చాల సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. తాను గురువు కనుక, సహోదరులకు ప్రతీరోజు దివ్యపూజను చేసేవారు. ఆతరువాత, వంటగదిలో పాత్రలను కడిగేవాడు. నేలను తుడిచి శుభ్రం చేసేవాడు. ఈ సాధారణ జీవితాన్ని అంతోనివారు ఎంతగానో ఆస్వాదించాడు. మిగతా సమయమంతా దగ్గరలోని గుహలో సుదీర్ఘ ప్రార్ధనలు చేసేవాడు.

1222వ సం.లో, అంతోనివారికి 27 సం.లు ఉన్నప్పుడు, ఫోర్లి అనే ప్రాంతములో ఒకరోజు, అనేకమంది దోమినిక్ సభకు, ఫ్రాన్సీసు సభకు చెందిన మఠవాసులు గురుపట్టమును పొందియున్నారు. ఆరోజు ప్రసంగీకులు రాకపోవడము వలన, ఎవరినైనా ప్రసంగించమని కోరారు. కాని, అంతమంది ఎదుట ప్రసంగించడానికి ఎవరుకూడా ముందుకు రాలేదు. చివరికి అంతోనివారిని కొన్ని మాటలు చెప్పవలసినదిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన ప్రసంగించు చుండగా, అందరి హృదయాలు పరిశుద్దాత్మతో నింపబడ్డాయి. అక్కడ ఉన్న వారందరు వారు ఓ గొప్ప ప్రసంగీకుని మధ్యలో, ఓ గొప్ప వేదాంతి సన్నిధిలో జీవిస్తున్నామని అప్పుడు గుర్తించారు.

పునీత ఫ్రాన్సీసువారు, పని, చదువు, బోధనల కన్న, 'ప్రార్ధన, భక్తి విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఆతరువాత ఫ్రాన్సీసువారి అనుమతితో ఇతర మఠవాసులకు వేదాంత శాస్త్రాన్ని భోదించాడు. ఆయన గొప్ప ప్రసంగీకులు. అనేకచోట్ల, ముఖ్యముగా ఇటలీ, ఫ్రాన్సు దేశములలో విజయవంతముగా సువార్తా ప్రచారము చేయడం జరిగింది. ఈ సమయములో, అంతోనివారు పేరుప్రఖ్యాతలను గాంచాడు. అవిశ్వాసులు, దేవుని వాక్యమును విననప్పుడు, ఆయన అనేక అద్భుతాలనుకూడా చేసేవాడు. ఒకసారి, అద్రియాటిక్ సముద్రము ప్రక్కనే ఉన్న రిమిని అనే పట్టణములో ప్రజలు ఆయనను ఆలకించక పోవడముతో, ప్రక్కనే ఉన్న నీళ్ళవైపుకు తిరిగి చేపలకు ప్రసంగించడం మొదలుపెట్టాడు. చేపలన్నీ కూడా తలలను బయటకు పెట్టి సువార్తను విన్నాయి. అంతోనివారు వాటిని ఆశీర్వదించాకే, నీళ్ళలోకి వెళ్లిపోయాయి.

1227వ సం.లో ఫ్రాన్సిస్ వారి సభ ఇటలీలోని ప్రావిన్స్ కు అధిపతిగా నియమించబడ్డారు. మూడు సంవత్సరాలు 9వ గ్రెగోరి పోపుగారికి రాయబారిగా పనిచేసారు. రాయబారిగా ఇటలీ దేశమంతటా సువార్తా ప్రచారం చేసారు. 1228వ స౦.లో, రోమునగరములో, 9వ గ్రెగోరి పోపుగారి సమక్షములో గురువులకు, ప్రజలకు ప్రసంగించారు. అప్పుడు అంతోనివారిలోని పాండిత్యాని, దైవజ్ఞానాన్ని గుర్తించిన పోపుగారు ఆయనను గూర్చి ఇలా చెప్పారు. అంతోనివారు ఒక బైబిలు ఆయుధాగారం. లోకమున ఉన్న బైబులు గ్రంధాలన్నీ కోల్పోయినను, అంతోనివారు తప్పనిసరిగా తిరిగి వ్రాయగలరు.

ఆ తరువాత, వేదప్రచారము నిమిత్త౦ ఇటలీలోని పాదువాపురిలో నియమించబడ్డారు. అక్కడ అనేకమంది మారుమనసు కలిగేలా ప్రసంగించటమేకాక అనేక అద్భుత కార్యములు చేసి ఎంతో పేరు పొందారు. దేవుని కృపను నమ్ముకోవాలని, దేవుని క్షమాపణను కోరుకోవాలని బోధించాడు. ప్రజలలోనున్న గొడవలను ప్రశాంతముగా పరిష్కరించేవాడు. అనైతిక జీవితాన్ని ప్రజలు వీడేలా చేసాడు. తన ప్రసంగాలను వినడానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు. పేదలపట్ల శ్రద్ధ కలిగి యుండేవారు. అవినీతి పనులకు వ్యతిరేకముగా బోధించాడు.

ప్రసంగిస్తూ తన తోటి సహోదరులతో తన స్నేహితుని ఎస్టేటులో ఉండేవారు. అక్కడ ఉండగా అనారోగ్యంతో అంతోనివారు తన మరణము సమీపించినదని తెలుసుకొని అక్కడనుండి పాదువాపురికి కొనిపొమ్మని కోరగా, పాదువాపురి చేరకముందే మార్గమధ్యలోనే అర్చేల్ల అనే స్థలములో, పునీత క్లారమ్మ సభకు చెందిన మఠములో చివరిగా ప్రార్ధన స్తుతి గీతాలు పాడుతూ తన 36వ ఏటనే, 13 జూన్ 1231 సం.లో తుదిశ్వాస విడిచారు.

మరణించి సంవత్సరం పూర్తి కాకముందే అనగా 30 మే 1232వ సం.న, 9వ గ్రెగోరి పోపుగారు, అంతోనివారి పవిత్రతను, పవిత్ర జీవితాన్ని గుర్తిస్తూ పెంతకోస్తు పండుగ రోజున పునీతపట్టం కట్టారు. తన మరణము తరువాత, అద్భుతాల అంతోనివారిగా ప్రసిద్ది గాంచారు.

పునీత అంతోనివారికి నవదిన జపములు, మంగళవార ప్రత్యేక భక్తి

పునీత అంతోనివారి అంత్యక్రియలు మంగళవారం జరిగినందున, మొట్టమొదటిసారిగా అతని మద్యవర్తిత్వం వలన అద్భుతాలు మంగళవారం రోజున జరిగినందున, పాదువాపురి ప్రజలు మంగళవారమును ఆయనకు అంకితం చేసారు. ఆనాటినుండి ఫ్రాన్సీసు వారి సభకు చెందిన దేవాలయములలో అతని గౌరావార్థం మంగళవార భక్తిని ప్రారంభించారు. ఆ తర్వాత అది ప్రపంచం మొత్తం ప్రచారం చేయడం జరిగింది. పునీత అంతోనివారి జీవితచరిత్రను వ్రాసిన జాన్ పేక్ హోంగారు ఈ విముగా వ్రాసారు: ఆ పునీతుని శవపేటికను తాకిన వారందరును వారిభాదల నుండి స్వస్థతను పొందారు.

పునీత అంతోనివారి గౌరవార్ద౦ మంగళవారం నవదిన జపములు చెబుతారు. వరుసగా 9 మంగళవారాలు పునీత అంతోనివారి గుడిని దర్శించి లేదా పునీత అంతోనివారి స్వరూపమున ప్రార్ధనలు చెప్పువారికి, పరిపూర్ణ ఫలము లభించును.

బొలోన నివాసియగు ఒక స్త్రీ బాధలో ఉన్నప్పుడు, పునీత అంతోనివారే స్వయముగా కనిపించి ఇలా చెప్పారు: స్త్రీ! నా సభకు చెందిన ఒక గుడికి 9 మంగళవారాలు ప్రార్ధనలు చేసి, దివ్యపూజాబలిలో పాల్గొని, దివ్యసత్ప్రసాదం స్వీకరించిన, నీ ప్రార్ధనలు నెరవేరును. ఆ స్త్రీ అలాచేసి ఫలితం పొందినది. మనముకూడా పునీత అంతోనివారి యెడల భక్తిని చూపుదము. మన తండ్రియైన దేవునికి మన విన్నపాలను పునీత అంతోనివారి మధ్యస్థ ప్రార్ధనలద్వార తెలుపుదము.

గొప్ప సువార్తా సేవకుడు: దేవున్ని అమితముగా ప్రేమించాడు; అవిశ్రాంతముగా సువార్తా సత్యాన్ని ప్రకటించాడు. ఇటలి మరియు ఫ్రాన్సు దేశాలలో విశ్వాసులను బలపరచాడు. పాపాత్ములను హృదయ పరివర్తన చెందమని పిలుపునిచ్చాడు. అసత్యములో జీవించేవారిని సత్యములోనికి నడిపించాడు. ఈవిధముగా క్రీస్తు సువార్తకు అద్భుతమైన, శక్తివంతమైన సాక్షిగా మారాడు. కేవలం బోధించడమే కాకుండా, బోధించిన దానిని తన అనుదిన జీవితములో పాటిస్తూ అందరికి సుమాత్రుకగా ఉండేవాడు. క్రైస్తవ విశ్వాస సత్యాలను తన ఆదర్శ జీవితముద్వారా సమర్ధించారు. ఇది అంతోనివారిలోని ప్రత్యేకత! “వాక్కు, జీవితముద్వారా, బోధకుడు ఇతరులకు సూర్యునివలె ఉండాలి” అని అంతోనివారు ఒకసారి అన్నారు. “మన బోధన ఇతరుల హృదయాలను రగిలించాలి. మన బోధన వారిని ప్రకాశవంతం చేయాలి.

 అంతోని వారి అద్భుతాలు:

      చేపలకు సువార్తను బోధించడం (గొప్ప సువార్త బోధకులు)
గాడిద దివ్యసత్ప్రసాదమును మొకాలూని ఆరాధించడం (దివ్యసత్ప్రసాదము అత్యంత భక్తి – క్రీస్తు సాన్నిధ్యం)
కుంభ వర్షాన్ని ఆపడం
మరణించిన ఒక వ్యక్తిని సజీవముతో లేపడం
పోయిన రొట్టెల పెట్టె తాళము అంతోని వారు అద్భుత రీతిన తెరచుట; రొట్టెలు పంచుట (అంతోనివారి బ్రెడ్)
అంతోనివారిని చూసి దుష్టాత్మలు భయపడేవి (విశ్వాసము, ప్రార్ధన)
దివ్యవెలుగులో దివ్యబాలయేసు దర్శనం
అంతోని వారి నాలుక అద్భుతరీతిన అలాగే ఉండటం

    దేవుని దయ,మంచితనమును ఎరిగిన వ్యక్తి అంతోనివారు. శక్తివంతమైన ప్రసంగాల ద్వారా, తన జీవితాదర్శము ద్వారా, యేసును అనుసరించుటకు అనేకమందికి ప్రేరణగా నిలిచాడు. అలాగే, మన జీవితాలను కూడా మలుచుకుందాం!

2వ సామాన్య ఆదివారము, Year B, (15 January 2012)

2వ సామాన్య ఆదివారము, Year B, (15 January 2012)
పఠనాలు: 1 సమూయేలు 3:3-10,19; భక్తి కీర్తన: 40: 1,3,6-9;
1 కొరింథీ 6:13-15, 17-20; యోహాను 1: 35-42

కనబడుటలేదు - వినబడుటలేదు: ఎందుకు?

ఓ పరమోన్నత సర్వేశ్వరా! లోకమంతయు మిమ్మారాధించి, మీ ప్రస్తుతి చేయునుగాక. మీ నామ సంకీర్తనమందు నిమగ్నమై యుండును గాక.

దీపము వెలుగుచున్నది; కళ్ళున్నాయి. కాని, కనబడుటలేదు.
ఎవరో మాట్లాడుతున్నారు; చెవులున్నాయి. కాని, వినబడుటలేదు. ఎవరికి? ఎందుకు?

సాధారణముగా, ఈ ఆదివార పఠనాలను చదివినప్పుడు, మనం సామూయేలు పిలుపునుగూర్చి, దేవునిసేవకు ఆయన సంసిద్ధతనుగూర్చి వింటూఉంటాం, చెబుతూఉంటాం లేక ధ్యానిస్తూఉంటాం. ఈనాడు ఈ పఠనాలయందు దాగియున్న మరోసత్యాన్ని, మరొక కోణాన్ని పరిశీలించి, ధ్యానిద్దాము!


లేవి గోత్రమునకు చెందిన ఏలీ, షిలోవద్ద ప్రభుమందిరముచెంత యాజకుడు (1 సామూయేలు 1:9). ప్రజల తరుపున, ప్రభువుసన్నిధిలో బలులను అర్పిస్తూ, ప్రజలకొరకై ప్రార్ధిస్తూ, ప్రభువుచిత్తాన్ని, ఆయనమాటను ప్రజలకు వివరిస్తూఉండేవాడు. ఆవిధముగా, ప్రభువుమందిరమున సేవలుచేస్తూ ఉండేవాడు. యావేసేవకుడిగా, ఆయనకు అత్యంత సన్నిహితముగా ఉండి సేవలుచేస్తున్న ఏలీకి, ప్రభువుప్రత్యక్షత కనబడలేదు. ఆయనమాట, ఆయనస్వరం వినబడలేదు. ఎందుకు? వయసుభారము వలన, చూపుమందగించినదా? లేక మరేమైన కారణమున్నదా?

మనం బైబిలుగ్రంధమును పరిశీలించినచో, దైవసన్నిధిలో సేవలుచేయుచున్నవారికి, ఆయనకు ప్రీతీపాత్రులుగా, నీతిమంతులుగా జీవించువారికి వయస్సు మళ్ళినను చూపు మందగించలేదు. ఉదాహరణకు, మోషేను తీసుకొందాం! ''చనిపోవునాటికి మోషేవయస్సు 120 యేండ్లు. ఐనను, అతని దృష్టి మందగించనులేదు. అతనిశక్తి సన్నగిల్లలేదు (ద్వి.కాం. 34:7). అదేవిధముగా, సిమియోను (లూకా 2: 25-27), హన్నా (లూకా 2: 36-38). వీరికి వయస్సు మళ్ళినను చూపుమందగించలేదు. శక్తి సన్నగిల్లలేదు. వారికి దేవునిమాట వినబడుతూనే ఉంది. ఆయన ప్రత్యక్షత, ఆయన రక్షణకార్యమును చూస్తూనే ఉన్నారు. కానే, ఏలీకి దేవుని మందిరములోఉన్నను, ఆయన సన్నిధిలో దీపమువెలుగుచున్నను, ఆయనకు కనబడదాయెను. యావే, సమూయేలుతో మాట్లాడుతున్నను ఆయనకు వినబడదాయెను. ఎందుకు?

ఏలీ మంచివాడే. కాని, తను చేయవలసిన పని చేయలేదు. తన కుమారులు హోఫ్నీ, ఫీనెహాసులు (వారుకూడా దేవుని సన్నిధిలో యాజకులు) దేవునిసన్నిధిలో, ఆయన మందిరములో అగౌరవముగా, అసభ్యకరముగా ప్రవర్తించినను, జీవించినను (1 సామూయేలు 2:12), అతడు మిన్నకుండెను. వారి చెడుకార్యములనుగూర్చి తెలిసినను వారిని గద్ధించలేదు, హెచ్చరించలేదు. ఈ విషయములను గూర్చి ప్రజలు మాట్లాడుకొంటున్నారని విని, చెప్పిచెప్పనట్లుగా మందలించాడు (1 సామూ యేలు 2:22-24). తన కుమారులను గౌరవించి, యావేను అలక్ష్యము చేసాడు (1 సామూ యేలు 2:29). పాపము చేయుచున్న తన కుమారులను, యావేకు సమర్పించబడిన బలికి అగౌరవము తీసుకొని వచ్చిన కుమారులను గౌరవించాడేతప్ప, యావేనుగాని, ఆయన నియమములనుగాని చెవియొగ్గలేదు. ఆయన మాటను పెడచెవినపెట్టాడు. తండ్రిగా, యాజకుడిగా, దేవుని సేవకుడిగా తన భాద్యతను మరచినాడు. తన కళ్ళముందే, తన ఆధీనములో జరుగుచున్న పాపకార్యమును, అపవిత్రకార్యమును ఆపలేక పోయాడు. అందుకే, దేవునిస్వరము అతనికి వినబడలేదు. దేవునిప్రత్యక్షత ఆయనకు కనబడలేదు. దేవునిపవిత్రతకు, ఆయన మందిరమునకు కలుగుతున్న అప్రతిష్టతను, అగౌరవమును కట్టడి చేయలేకపోయాడు. అందుకే, అతని చూపు మందగించింది, మసక బారినది.

ఈనాటి రెండవ పఠనములోకూడా పౌలుగారు కొరింథీలోని దేవుని మందిరమునుకు (దేహమునకు) కలుగుతున్న అప్రతిష్టతనుగూర్చి హెచ్చరిస్తున్నాడు. సజీవయాగముగా సమర్పించబడే మన శరీరాలను (రోమా 12:1) దేవునిఆత్మకు, మహిమకు, కృపకు, గౌరవమునకు నిలయముగా మార్చాలని పిలుపునిస్తున్నాడు. తండ్రిదేవునిచే సృజింపబడి, కుమారుడైన యేసుక్రీస్తు వెలనిచ్చి కొనబడిన (1 కొరింథీ 6:20), పరిశుద్ధాత్మ వసిస్తున్న (1 కొరింథీ 3:16) దేహములను తండ్రి మహిమార్ధం ఉపయోగించాలని భోదిస్తున్నాడు. ఆ మాటలను తనకు అనువయించుకొని, తనకు బాధకలిగినను, శ్రమలువచ్చినను, కారాగారములో బంధీగాఉన్నను, జీవించినను, మరణించినను, నా సర్వస్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును (ఫిలిప్పి 1:20) కలిగించెదను అని దృఢముగా చెప్పుచున్నాడు. అదే మనకు స్ఫూర్తి, మన జీవితానికి నియమావళి.

ఈ గొప్ప భాగ్యమును పొందుటకే, ప్రభువు సువార్త పఠనము ద్వారా మనలనందరినీ ఆహ్వానిస్తున్నాడు: ''వచ్చి చూడుడు (యోహాను 1:39). వచ్చి అనుభవించండి. తండ్రి నాకిచ్చిన భద్రత, సంరక్షణ ఆయన ప్రసన్నతే! ఆయన ప్రత్యక్షతే! నాకున్న సర్వస్వం ఆయనే. దానిని మీరు కూడా అనుభవించండి. జీవించండి అని ప్రభువు పిలుపుని స్తున్నాడు. ప్రధమ శిష్యులవలె, వచ్చిచూసి, యేసుక్రీస్తును అనుసరించడమనగా, ఆయనతో సంపూర్ణముగా ఉండుట, మన మనస్సును, హృదయాన్ని, ఉనికిని, జీవాన్ని, జీవితాన్ని, సంపూర్ణముగా అర్పించడం మరియు పవిత్రమైన జీవితాన్ని జీవించడం.

సహోదరీ, సహోదరులారా!

ప్రభువుచిత్తమును నెరవేర్చుటకు, ఆయనస్వరమును ఆలకించుటకు, ఆయనను గాంచుటకు, మనలను ముఖ్యముగా ఆటంకపరచేవి, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పాపం, స్వార్ధపరత్వము, స్వప్రయోజనము, స్వీయపోషణ, లోకాషలు, నిరంకుశత్వం, నటనజీవితం, తల్లిదండ్రుల, గురువుల, పెద్దల మాటలు పెడచెవినపెట్టడం...మొ,,వి. 2005 వ సం,,లో 16 వ బెనెడిక్టు పోపుగారు తను వ్రాసిన ''వాక్కు యొక్క వెలుగు'' లో మనం ఎదుర్కొనే సవాళ్లలో ఇవి కొన్ని అని గుర్తించారు. ఏలీ కుమారులవలె, స్వార్ధముతో, స్వీయ కోరికలను సంతృప్తిపరచక, పవిత్రముగా జీవిద్దాం. ప్రభువు పిలుపును ఎల్లప్పుడూ శ్రద్ధగా ఆలకించుదాం! ఆ పిలుపు మన పొరుగువాని ద్వారా కావచ్చు, లేక ఇతరుల ద్వారా కావచ్చు!

కొద్దిసేపు మౌనముగా ఉండి, ఆత్మ శోధన చేసుకొందాం! మనలను మనమే ప్రశ్నించుకొందాం!

ఏలీలాగా భాద్యతలను మరచినానా? ఇతరుల గౌరవముకొరకు, మంచి పేరు కొరకు ప్రభువు కార్యమును ఆయన మాటను అలక్ష్య పెట్టితినా? ప్రత్యక్షముగాకాని, పరోక్షముగాకాని ఆయన నామమునకుగాని, ఆయన మందిరమునకుగాని అగౌరవమును కలిగించితినా? ఏలీ కుమారులవలె తండ్రిమాటను పెడచెవిన పెట్టితినా? ఇష్టము వచ్చినట్లు చేసితినా? కొరింథీలోని కొందరివలె, ప్రేమతో నన్ను సృష్టించిన - తండ్రిని, త్యాగముతో నన్నుకొనిన - క్రీస్తును, కరుణతో నాలోవసిస్తున్న - పరిశుద్ధాత్మను అగౌరవపరుస్తున్నానా? ఆయన దిద్దుబాటును, ఆయనతో ఉండుటకు యిచ్చిన పిలుపునకు స్పందిస్తున్నానా? ఆయనను నాలో, ఇతరులలో, చుట్టుప్రక్కల వారిలో కనుగొంటున్నానా? ఆయన స్వరము, ఆయన హెచ్చరిక, ఆయన పిలుపు నాకు వినబడు తున్నదా? ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత నాకు కనబడుతున్నదా? ఆమెన్.

Fr. John Antony Polisetty OFM Cap, Germany


Prayer for the Beatification of Br. Joseph Thamby, Servant of God

Prayer for the Beatification of Br. Joseph Thamby, Servant of God

God our Father, your servant Brother Joseph Thamby gave witness to your son, Jesus Christ, by a radical living of the Gospel in his life and by proclaiming it to the poor with great missionary zeal and Franciscan simplicity. May his total commitment to Christ, filial devotion to the blessed virgin, untainted loyalty to the church and compassionate love for the poor be an inspiration for all of us in our work of evangelization. We implore you to count him among your saints, if it serves your plan of salvation of the people. Mary our Blessed Mother, Saint Joseph, Saint Francis of Assisi and all the saints, intercede before the Triune God for the Beatification of Brother Joseph Thamby. Look kindly on the innumerable people who flock to your lowly servant, imploring your graces through his intercession. Loving Father, we humbly beg of you to grant us this favor through the intercession of Brother Joseph Thamby, so that your name be glorified in the world. We make this prayer through Christ our Lord. Amen.

జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి తృతీయసభ (Third Order) సభ్యుడు. తన జీవిత చివరికాలాన్ని (1939 వ సం,,మునుండి) విజయవాడ మేత్రాసణము, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ఉత్తర భారరత దేశంలోని పెదావుటపల్లి గ్రామములో గడిపియున్నాడు. అక్కడే ఆయన 15 జనవరి 1945 వ సం,,లో పరమపదించియున్నారు. ఇంతకుముందు ఆయన పుదుచేరి, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో పనిచేసియున్నారు. ఆయన నిరాడంబరత్వం, ప్రార్ధన మరియు పరోపకారముతో కూడిన జీవితాన్ని జీవించారు. తన అంతరార్ధమైన (mystical) అనుభవాలవలె, ఆయన సువార్త బోధనా కార్యక్రమాలు బాగా ప్రసిద్ధిలోఉండెడివి. ఇంతలో, ఆయన కుటుంబము భారత దేశములోను మరియు బయట చెదరిపోయినది. తన వినయత్వమువలన తననుగూర్చితాను మాట్లాడటానికి ఎప్పుడూ నిరాకరించెడివారు. తన జీవితమునుగూర్చి ఈనాడు ఖచ్చితమైన మరియు విలువైన సమాచారమును ఇచ్చియుండెడు పత్రాలను, అధారాలన్నింటినీ ఆయన తప్పక కాల్చివేయడముగాని, నాశనం చేయడముగాని జరిగియున్నది.

Br. Joseph Thamby, Servant of God (1883-1945)

Joseph Thamby, Servant of God (1883-1945)

The Servant of God Joseph Thamby was a Franciscan tertiary layman who spent the last years of his life (from 1939 onwards) in Peddavutapally, in the federal State of Andhra Pradesh in South India, where he died on 15 January 1945. He had previously worked in the federal States of Puducherry, Kerala and Tamil Nadu, leaving behind him a reputation for austerity, prayer and charity. His works of evangelisation, like his mystical experiences, were well known. Meanwhile, his family had been scattered within India and beyond; he himself, on account of his humility, always avoided talking about himself, and he meticulously burned or made sure to destroy documents which today might have provided a more accurate reconstruction of his life, which cannot be documented in all its stages.

fr. Joseph Thamby, Servo di Dio (1883-1945)

Joseph Thamby, Servo di Dio (1883-1945)

Thamby Joseph, laico, terziario francescano, Servo di Dio. Joseph trascorse gli ultimi anni (dal 1939) della sua vita in Peddavutapally, nello stato federale di Andhra Pradesh in India, dove morì il 15 gennaio 1945. Egli aveva prima dimorato e lavorato negli stati federali di Puducherry, Kerala e Tamil Nadu, lasciando un ricordo di austerità, preghiera, e carità; erano ben conosciute le sue opere di evangelizzazione come le sue esperienze mistiche. Nel frattempo, la sua famiglia si era dispersa dentro e fuori l’India; egli stesso, per la sua umiltà, evitò sempre di parlare di sé e meticolosamente bruciava o faceva distruggere documenti che oggi avrebbero potuto servire per una più accurata ricostruzione alla sua vita, che non può essere documentata in ogni sua fase.

Nacque nel settembre 1883 dai coniugi Thamby Savarymuthu e Annamalle; la sua era una famiglia benestante della comunità Vellala in Sirone. Crebbe in Puducherry (Pondicherry), allora una colonia francese in India. Ebbe un fratello più giovane, Dhayirian; la madre morì quando i due avevano rispettivamente sette e due anni. Il padre si risposò e dal secondo matrimonio nacque Maria. A dodici anni Giuseppe, insieme con altri compagni, stava preparandosi alla prima comunione e alla cresima; la matrigna si mostrava contraria, ma nonostante ciò, egli ricevette i sacramenti. A causa delle avverse circostanze create dalla matrigna, il ragazzo lasciò la famiglia e raggiunse il Kerala, dove fu accolto ed educato da una pia donna. Il fratello, invece, andò a Saigon, in Vietnam, colonia francese fino al 1956, dove sposò Mary Therese: ebbero tre maschi e una femmina, che divenne monaca carmelitana a Puducherry. Dhayirian Thamby morì nel 1935.

క్రీస్తు బప్తిస్మ పండుగ, Year B

క్రీస్తు బప్తిస్మ పండుగ, Year B
పఠనాలు: యెషయ 55:1-11; 1 యోహాను 5:1-9; మార్కు 1:7-11

రక్షకుడు బప్తిస్మము పొందిన సమయమున, ఆకాశము తెరచుకొనెను. పవిత్రాత్మ పావురరూపమున వచ్చి ఆయన మీద నిలచెను. ''నా కానందము కలిగించు నా ప్రియతమ పుత్రుడితడే'' నను పితస్వరము వినిపించెను.

క్రీస్తు బప్తిస్మ పండుగతో క్రీస్తుజయంతి కాలము ముగిసి, సామాన్యకాలము ప్రారంభమవుతుంది. క్రీస్తు బప్తిస్మము, త్రిత్వైక దేవుని మహిమను, క్రీస్తు బహిరంగ సువార్తాబోధనను సూచిస్తుంది. బప్తిస్మయోహాను మరోసారి క్రీస్తుకు సాక్షమిచ్చిన రోజు: ''నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగీ ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును'' (మా 1:7-8). బప్తిస్మ యోహాను పాపక్షమాపణ, హృదయపరివర్తనగూర్చి ప్రకటించుచుండెను. తన సందేశాన్ని ఆలకించి, వారి పాపములను ఒప్పుకొనినవారిని, యోర్దానునదిలో స్నానము చేయించుచుండెను. మరియు, పవిత్రాత్మతో స్నానము చేయించు వానియొద్దకు వారిని నడిపించియున్నాడు. ఈ సాక్షముకన్న మిన్నదైన సాక్ష్యమును తండ్రి దేవుడు, పవిత్రాత్మలు ఇచ్చిన రోజు: ''నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను'' (మా 1:11). యేసు బప్తిస్మము పొంది వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరువబడి, పవిత్రాత్మ పావురరూపమున ఆయనపైకి దిగివచ్చెను.


పాపపరిహార్ధమై, ముఖ్యముగా జన్మపాప పరిహారానికి, జ్ఞానస్నాన దివ్యసంస్కారం అత్యవసరమని శ్రీసభ బోధిస్తున్నది. యేసు జన్మ పాపములేక జన్మించియున్నాడు. మరియు జీవితాంతము కూడా పాపరహితునిగా జీవించాడు. అట్లయినచో, క్రీస్తు ఎందుకు బప్తిస్మమును పొందియున్నాడు? క్రీస్తు బప్తిస్మయోహాను నుండి జ్ఞానస్నానము పొందుటవలన, మనకు సుమాత్రుకగా యున్నాడు. ఆయనలో జన్మపాపము మరియు ఏ ఇతర పాపము లేకున్నను, జ్ఞాన స్నానమును స్వీకరించియున్నప్పుడు, పాపచీకటినుండి విడుదల చేయు జ్ఞానస్నానం మనకి ఇంకెంత అవసరమో! బప్తిస్మము క్రీస్తుకు అవసరమని కాదు, కాని మనకి ఎంత అవసరమోయని తెలియజేస్తున్నది. క్రీస్తు బప్తిస్మము, జ్ఞానస్నాన దివ్యసంస్కార స్థాపనకు మూలం. ఆయన శరీరం, నీటిని ఆశీర్వదించియున్నది. పవిత్రాత్మ పావురరూపమున దిగిరావడం, తండ్రి ఆయనగూర్చి ఆనందించడం యేసుక్రీస్తుని సువార్తాబోధన ఆరంభానికి సంకేతాలు. ''పవిత్రాత్మతోను, శక్తితోను, దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించెను. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచశక్తికి లోబడిన వారందరును బాగుచేసెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను'' (అ.కా. 10:38).

జ్ఞానస్నాన దివ్యసంస్కారం

ఏడు దివ్యసంస్కారాలలో మొదటిది, మరియు ఇతర సంస్కారములన్ని దీనిపై ఆధారపడి యున్నాయి. క్రీస్తు ప్రభువే స్వయముగా తన శిష్యులతో ఇలా చెప్పియున్నారు: ''సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు'' (మ 28:19). యేసు నికోదేముతో సంభాషిస్తూ ఇలా చెప్పియున్నాడు: ''ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవునిరాజ్యములో ప్రవేశింపలేడు'' (యో 3:5). ఈ విధముగా, రక్షణ పొందుటకు, జ్ఞానస్నానము తప్పనిసరి అని ప్రభువు తెలియజేసియున్నాడు. కతోలికులకు, జ్ఞానస్నానము ఓ ఆనవాయితీ మాత్రమే కాక, క్రైస్త్వవత్వమునకు గురుతుగా నున్నది. ఎందుకన, బప్తిస్మము, క్రీస్తులో మనకి ఓ నూతన జీవితమును ఒసగుచున్నది. అయితే, జ్ఞానస్నానము పొందినవారు మాత్రమే రక్షింపబడుదురా? జ్ఞానస్నానము పొందాలని కోరిక కలిగియుండి మరణించినవారు కూడా రక్షింపబడుదురు. మరియు, వారి తప్పిదమువలనగాక, క్రీస్తు సువార్తను ఎరిగియుండకపోయినను, సహృదయముతో, ఆత్మ ప్రేరణతో, దైవాన్వేషణ చేస్తూ, వారి మంచి కార్యముల ద్వారా, ఆత్మసాక్షి అనుసారముగా, దైవ చిత్తమును నేరవేర్చువారుకూడా రక్షింపబడుదురు. (Constitution on the Church, Second Vatican Council).

జ్ఞానస్నానమువలన ముఖ్యముగా ఆరు అనుగ్రహాలను పొందెదము:

1. జన్మపాపము మరియు వ్యక్తిగత పాపదోషము తొలగించబడును.
2. ఈలోకమున మరియు ఉత్తరించు స్థలమున, పాపము వలన ప్రాప్తించు తాత్కాలిక మరియు శాశ్వత శిక్షనుండి ఉపశమనమును పొందెదము.
3. దైవానుగ్రహముతో మనము నింపబడెదము. అనగా దేవునియొక్క జీవితము మనలో కలిగియుండెదము. పవిత్రాత్మ వరాలైన దైవజ్ఞానము, తెలివి, దైవనిర్ణయం, దైవబలం, వివేకము, దైవభక్తి, దైవభీతిలను పొందెదము. దివ్య సుగుణాలైన విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమలను పొందెదము.
4. క్రీస్తులో భాగస్తులమయ్యెదము.
5. భూలోకమున క్రీస్తు శరీరమైన శ్రీసభలో భాగస్తులమయ్యెదము.
6. మిగతా సంస్కారములలో పాల్గొనునట్లు చేయును. దైవానుగ్రహములో మన ఎదుగుదలకు తోడ్పడును.

మన జ్ఞానస్నానం

దివ్య సంస్కారం (''an outward and visible sign of an inward spiritual grace'') అయిన జ్ఞానస్నానం క్రైస్తవ సమాజములోనికి ప్రవేశసాంగ్యము; దీని ద్వారా, దేవుడు మనలను తన దత్తపుత్రులనుగా చేసికొనుచున్నాడు. మరియు ఈ బంధం ఎన్నటికిని విడదీయరానిది. యేసు బప్తిస్మమునందువలె, మన బప్తిస్మముయందు త్రిత్వైక దైవం మనతో వాసం చేయుచున్నది. దేవునకు దత్తపుత్రులుగా మారుచున్నాము మరియు మనకోసం పరలోకం తెరువబడుచున్నది. ఈరోజు మనం కొనియాడే యేసు బప్తిస్మ పండుగకు అర్ధాన్ని చేకూర్చాలంటే, మన జ్ఞానస్నానము ద్వారా, క్రీస్తుకు, శ్రీ సభకు మనతోనున్న సంబంధాన్ని గుర్తించాలి. మన జ్ఞాన స్నానముద్వారా బోధించుకార్యాన్ని, భాద్యతను స్వీకరించియున్నాము. . ఇదే మన జ్ఞానస్నాన పిలుపు.

మొదటి పఠనములో (యెషయ 55:1-11), బాబిలోనియాలో బానిసత్వములోనున్న ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమునకు తిరిగిరావాలని, పూర్వము దేవునిలో జీవించిన విధముగా వారు జీవించాలని యెషయా పిలుపునిస్తున్నాడు. ''దప్పిక గొనిన వారెల్లరును నీటిచెంతకు రండు'' (55:1) అని ప్రవక్త ప్రతీకాత్మకముగా పిలుపినిస్తున్నాడు. ఇదే ఆధ్యాత్మిక నవీకరణ మనకీ ఎంతో అవసరం. ఈ లోకమున ప్రభువునువిడచి ఎన్నింటికో బానిసలై జీవిస్తున్న మనం, ఆ బానిసత్వాన్ని విడచి తిరిగి దేవుని చెంతకు రావాలి.

రెండవ పఠనము ఇలా బోధిస్తున్నది: యేసు, మెస్సియా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతీ వ్యక్తియు ఆయన పుత్రునికూడా ప్రేమించును. దైవ కుమారుడైన క్రీస్తును విశ్వసించుట వలన మనము దేవుని కుటుంబానికి చెందినవారమని నిరూపిస్తున్నాము. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుటద్వారా, మనము దేవుని బిడ్డలైన ఇతరులను కూడా ప్రేమించుచుంటిమి. దేవుని ప్రేమలో వెలుగుటకు, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి ఏమీకావు. ఎందుకన, మనము జ్ఞానస్నాన దివ్యసంస్కారము ద్వారా, దేవునిలో జన్మించియున్నాము. ఈ లోకాశలను, కోరికలను జయించుటకు పరలోకతండ్రి అనుగ్రహమును, పవిత్రాత్మ దేవునిశక్తిని, పవిత్రమైన యేసునామమున పొందియున్నాము. యేసు, దేవుని పుత్రుడని నమ్మినచో, ఈ లోకమును జయించగలము. విశ్వాసము దేవుని వరము. విశ్వాసము చేతనే మనం లోకముపై గెలుపొందుదము. యేసు క్రీస్తు జలముతోను, రక్తముతోను వచ్చెను, అనగా, బప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణము. ఇలా ఆయన ఈ లోకాన్ని జయించి, మనము దేవుని బిడ్డలుగా జీవించులాగున చేసియున్నాడు.

క్రీస్తు బప్తిస్మపండుగను కొనియాడుచున్న మనం మన జ్ఞానస్నాన ప్రమాణాలను నూత్నీకరించుదాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించుదాం. తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, సుతుడైన క్రీస్తు ద్వారా మనయందు, మన జ్ఞానస్నానమందు ఆనందించును గాక!

Br. Joseph Thamby, Servant of God (1883-1945)

Br. Joseph Thamby
A Franciscan Tertiary, Servant of God
September 1883 to 15 January 1945

little brother gopu, Rome.

Early life and his desire to become a Capuchin

• Born in September 1883 in Sirone and brought up in Pondicherry, Tamil Nadu, South India.
• At the age of 12 (1895), he received the sacraments of Holy Communion and Confirmation.
• Left home as a boy to Kerala, the neighboring state and was educated with the help of a pious lady in whose house, he must have worked as a house taker.
• Though he had frequent visits to his home-town from Kerala, only in 1928 he was recognized by his grandmother on the occasion of a funeral service of a relative. He was then 45.
• He joined the Capuchins at Kollam in 1930. He was then 47.
• On 14 September 1932, he was present for the religious profession of his niece Gabrielle Marie Therese OCD (died in 1985) in Puducherry.
• By the time he has finished his training as a Franciscan Tertiary, he was around 50. So, for sure, his being aged around fifty was not in his favour to be admitted into the novitiate of the Capuchin Order. Hence, he had to leave the Capuchins in 1933.
• Br. Roch Vengathanam of Kozhuanal, the first Capuchin brother from Kerala, vested 14 July 1930 has given witness about Br. Joseph Thamby for not being admitted to the Capuchin Order: “he was not accepted to the Capuchin Order because of elephantiasis in his right leg and on account of his ‘excessive piety’ and his experiences of ecstasy were judged to be the fruit of epileptic fits.”
• After leaving the Capuchins, the Tertiary Brother Joseph Thamby continued to wear the habit, as confirmed by a few photographs and a number of testimonies. He remained a staunch member of the Third Order.

His Ministry as a Franciscan Tertiary

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year B

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year B

మనమంతా కొన్ని రోజుల క్రితమే మరో నూతన సంవత్సరాన్ని ప్రారభించాము. ఈ సం,,ము ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. మన భవిష్యత్తు ఎలా ఉంటుదో అసలు ఎవరికీ తెలియదు. మనలో ఏదో ఆందోళన, ఆరాటం! అవకాశం ఉంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరము ఆరాటపడుతూ ఉంటాము. కాలజ్ఞానం తెలుసు అంటున్న వ్యక్తులదగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాము. అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచి పోతూ ఉంటాం!. అదే మన వ్యక్తిగత చరిత్ర. అది ఎప్పుడూ ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసి ఉండదని తెలుసుకోవాలి. మనం ఈరోజు జీవించే జీవితము రేపు చరిత్రగా మారుతుంది. కాబట్టి, భవిష్యత్తును తెలుసుకోవాలని ఆరాటపడటముకన్నా, ఈరోజు, ఈ క్షణం చాలా ముఖ్యమైనదని, విలువైనదని తెలుసుకొందాం. ఇప్పుడు, ఈ క్షణములో, మనం తీసుకొనే నిర్ణయాలనుబట్టి, ఎంచుకొనే విషయాలనుబట్టి, అలవరచుకొనే విధానాన్నిబట్టి, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, గతములోనికి తిరిగి వెళ్ళలేము. కొత్త ఆశతో, నమ్మకముతో ముందుకు సాగిపోదాం. ఈ నాటి పండుగ సారాంశం, క్రీస్తు తననుతాను ఈ లోకానికి సాక్షాత్కరింపచేసుకొనడం. జ్ఞానులు క్రీస్తును గాంచడానికి ఏవిధముగా ముందుకు సాగిపోయారో, అలాగే మనము కూడా ముందుకు సాగిపోదాం.


తూర్పు దిక్కున జ్ఞానులు, ఖచ్చితముగా ఎక్కడ ఉంటాడో తెలియని వ్యక్తికోసం దూరదేశానికి బయలుదేరారు. వారి ప్రయాణములో అనేక నక్షత్రాలు, కాంతి దీపాలుగ మారి దారినిచూపిస్తూ గమ్యాన్నిచేరడానికి తోడ్పడ్డాయి. మన జీవితం ఓ ప్రయాణం. ఏమీ తెలియనటువంటి భావిష్యత్తులోనికి చూస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. మన ప్రయాణములోకూడా నక్షత్రాలు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని నిండు వెలుగును ప్రకాశిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి, మరికొన్ని వెలుగు లేకుండా ఎలాంటి గమ్యాన్ని చేర్చకుండా ఉంటాయి. కాని, ప్రతీది మనలను ఆకర్షిస్తూనే ఉంటుంది! ఇంతకీ మనం ఏ నక్షత్రాల గూర్చి మాట్లాడుతున్నాం? ధనం, వస్తుప్రపంచం, మందు, పదవి, కీర్తి ప్రతిష్టలు మొ,,గు కాంతిలేని నక్షత్రాలు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే, సేవ, శాంతి, సమాధానం, దయ, ప్రేమ, విశ్వాసం మొ,,గు తేజోవంతమైన నక్షత్రాలు మన ప్రయాణములో సహాయపడుతూ ఉంటాయి.

తేజోవంతమైన నక్షత్రాల కన్నా, కాంతిహీనమైన నక్షత్రాలే మనలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దేవుని రూపములో సృష్టింపబడిన బిడ్డలముగా, తేజోవంతమైన మరియు మన గమ్యాన్నిచేర్చే నక్షత్రాలను మనం అనుసరించాలి. మన జీవితాలను సార్ధకముచేసే, నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇచ్చే నక్షత్రాలను అనుసరించి దేవున్ని చేరుకోవాలి. జ్ఞానులుకూడా, వారి ప్రయాణములో ఎన్నో నక్షత్రాలను చూసి ఉంటారు. కాని, వారి గమ్యాన్ని నడిపించిన నక్షత్రాన్ని ఎన్నుకొని, అనుసరించి, క్రీస్తుని దర్శించుకోగలిగారు. రక్షణను పొందియున్నారు.

మన జ్ఞానస్నానములో, ఆ నక్షత్రాన్ని కనుగొన్నామా? క్రీస్తు చూపించే వెలుగు బాటలో పయనిస్తామని, ఆయన కొరకు మాత్రమే జీవిస్తామని మాట ఇచ్చియున్నాము. ఆ వాగ్దానాన్ని నూత్నీకరించుకొని, ఆయన బాటలో, వెలుగులో నడవటానికి ప్రయాస పడదాం.

జ్ఞానుల ప్రయాణములో, ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అవమానాలు ఎదురయ్యాయి. అన్నింటిని జయిస్తూ బెతేలేహేమునకు చేరుకొన్నారు. దివ్య బాలున్ని కనుగొని సంతోషించారు. దీనస్తితిలోనున్న బాలున్ని చూసి వారు అనుమానించలేదు, నిరాశ చెందలేదు. అతనే లోకరక్షకుడని గుర్తించి, అంగీకరించి, ఆరాధించారు. జ్ఞానుల వలె ఒకరికొకరము, ధైర్యము చెప్పుకుంటూ, కలసి మెలసి, ఒకే క్రీస్తుసంఘముగా ముందుకు సాగుదాం. క్రీస్తుకు సాక్షులముగా జీవించుదాం. సమస్యలు, అనుమానాలు, నిరాశ నిస్పృహలు అనే మేఘాలు నక్షత్రాన్ని కనపడకుండా చేసినప్పుడు, అధైర్యపడక, విశ్వాసముతో ముందుకు సాగుదాం.

జ్ఞానులు తెచ్చిన కానుకలు, బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను సంతోషముతో దివ్య బాలునికి అర్పించారు. క్రీస్తుకు మనం ఏ కానుకను ఇవ్వగలం? బెత్లేలేహేము అనే మన విచారణలో, శ్రీసభలో, కుటుంబములో, మన సమాజములో, మనం పనిచేసే స్థలములో, మనకి రోజు ఎదురుపడే వ్యక్తులలో దివ్యబాలున్ని కనుగొని, మన స్నేహాన్ని, ప్రేమను, సేవను, మంచి క్రియలను, ప్రభువుకు కానుకగా ఇద్దాం. ఎక్కడైతే దేవుని వాక్యాన్ని వింటామో, ప్రభువు శరీర రక్తాలను దివ్యబలిలో స్వీకరిస్తామో, అదే మన బెత్లెహేము. ఎందుకన, ప్రభువు గూర్చి తెలుసుకొంటున్నాం. ప్రభువు వెలుగును, దివ్య కాంతిని మనం దర్శించుకోగలుగుతున్నాం.

జ్ఞానులు, క్రీస్తును కనుగొని, ఆరాధించి, కానుకలను సమర్పించి, వేరొక మార్గమున వెనుతిరిగి పోయారు. మనం నిజముగా క్రీస్తును దర్శించగలిగితే, మనమూ ఓ నూతన మార్గములో పయానిస్తాము. పాత మార్గాలను, పాత జీవితాన్ని విడిచి పెట్టగలుగుతాము. మనలో నిజమైన మార్పు కలుగుతుంది. ఈ మార్పునే ప్రభువు మనలనుండి కోరుతున్నాడు. ఆయన చూపించిన మార్గములో, విస్వాసములో జీవించమని పిలుస్తున్నాడు. కనుక, జ్ఞానులవలె, ప్రభువును, ఆయన సువిశేషాన్ని కనుగొందాము. సంతోష హృదయముతో ఆయనతో ఐక్యమై, విశ్వాసముతో జీవించడానికి ప్రయాసపడుదాం. పరలోక రాజ్యములో క్రీస్తుదరికి చేరి ఆయన నిత్యవెలుగులో శాశ్వతజీవితాన్ని పొందుటకు ప్రయాసపడుదాము.

యేసు సాక్షత్కార మహోత్సవము

యేసు సాక్షత్కార మహోత్సవము
పఠనాలు: యెషయా 60: 1-6; కీర్తన 72: 1-2, 7-8 , 10-13; ఎఫెసీ 3:2-3, 5-6; మత్తయి 2:1-12
ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతియందు రాజ్యాధికారము, శక్తి సామర్ధ్యములను కలిగి వచ్చుచున్నాడు.

ఉపోద్ఘాతము:

క్రీస్తు జనమ్మునకు దాదాపు 550సం.ల పూర్వమే, ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వ చివరి దశలో ఉన్నప్పుడు, యెషయ ప్రవక్తద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు, "నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును" (యెషయ 49:6). కీర్తనకారునిద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చెప్పియున్నాడు: "తర్శీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరు అతనికి శిరము వంతురు." (కీర్తన. 72:10-11). నేటి మొదటి పఠనములో, "జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడ వత్తురు" (యెషయ 60:3) అని చదువుచున్నాము. చీకటి ఆవరించిన జీవితాలలో (ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత దుర్భలస్థితి) దేవుడు వెలుగును (భవిష్యత్తులో క్రీస్తుద్వారా రక్షణ) నింపునని యెషయ ప్రజలకు ఒక గొప్ప ప్రవచనాన్ని తెలుయజేయుచున్నాడు. ఈ ప్రవచనాలన్ని క్రీస్తులో నెరవేరాయని మత్తయి సువార్తికుడు చూపించాడు.

ఎన్నో సం.లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానులద్వారా, వారి కానుకలద్వారా, సకల దేశాలు, జాతులు, రక్షణ వెలుగులోనికి ప్రవేశించియున్నాయి.

జ్ఞానుల శిశుసందర్శనము - దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు, ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి.  జ్ఞానుల శిశుసందర్శనము దేవుని మంచితనాన్ని, ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము.

సాక్షాత్కారము: 
సాక్షాత్కారము అనగా 'కనబడుట', 'బహిర్గతమొనర్చుట', ముఖ్యముగా దైవీకమునకు సంబంధించినవి; కనుక, సాక్షాత్కారము అనగా, క్రీస్తుద్వారా దేవుడు తననుతాను ఈ లోకములో కనబరచుట లేదా బహిర్గత మొనర్చుట. "యిస్రాయేలు ప్రజలు నిరీక్షించిన మెస్సయ్యా, దేవుని కుమారుడు, ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారం" (సత్యోపదేశం నం. 528).

నేడు, ప్రభువు మొదటిసారిగా అన్యులకు సాక్షాత్కరిస్తున్నాడు. దీని సందేశం, యూదులతో పాటు, దేవుడు సమస్త మానవాళిని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ పండుగకు నిజమైన అర్ధం, ఎఫెసీ. 2:14లో చూడవచ్చు: "యూదులను, అన్యులను ఏకమొనర్చుటద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరుచేసి, విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను." సిమియోను బాలుని హస్తములలోనికి తీసుకొని, "అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు" (లూకా. 2:32). అనగా, దేవుని రక్షణ అందరికీ అని స్పష్టమగుచున్నది.

నేటి రెండవ పఠనములో ఇలా చదువుచున్నాము; "గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మద్వారా పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియ జేసెను. అనగా, సువార్త వలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసుద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము" (ఎఫెసీ. 3:5-6).

కనుక, నేటి పండుగ, సంఘటన సారాంశం:  క్రీస్తు ప్రతీరోజు అనేక విధాలుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షిద్వారా, శ్రీసభ బోధనలద్వారా, దేవుని కృపావరములద్వారా, ఇతర వ్యక్తులు, సంఘటనలద్వారా, మనకి దర్శనమిస్తున్నాడు. హేరోదువలె కలతచెంది, క్రీస్తును నిరాకరించుటకు ప్రయత్నింపక, జ్ఞానులవలె, గొల్లలవలె సంతోషముగా, ఆనందముతో ఆయనను సందర్శించాలి, మనలోనికి, మన జీవితములోనికి ఆయనను ఆహ్వానించాలి. రక్షకుడిగా, రాజుగా అంగీకరించాలి. ఆరాధించాలి. మన జీవితాలనే ఆయనకు కానుకగా అర్పించాలి. అలాగే, అందరూ క్రీస్తుద్వారా దేవుని చెంతకు నడిపింప బడాలని, అందరూ రక్షింపబడాలని కోరుకోవాలి. మనలను ద్వేషించే వారిని ప్రేమించాలి. మతం, కులాలు, ప్రాంతాలకు అతీతముగా వ్యవహరించాలి. ఇది నిజముగా ఓ గొప్ప సవాలు!

వాటికన్ II, 'లోకానికి వెలుగు శ్రీసభ' అను అధికార పత్రంలో ఇలా చదువుచున్నాము: దేవుడు నిర్దేశించిన రక్షణ ప్రణాళిక అన్యజనులకు కూడా విస్తరింప జేశాడు. వారు దేవుడు ఉన్నాడనీ ఆయనే సమస్త విశ్వానికి సృష్టికర్త అనీ మనసారా విశ్వసిస్తే చాలు - వారందరు దేవుడనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని స్వీకరించడానికి యోగ్యులవుతారు. కొంతమందికి, క్రీస్తు సువార్తా సందేశం గురించిగాని, శ్రీసభ గురించిగాని తెలియదు. అలా తెలియక పోవడానికి పరిస్థితులే కారణంగాని, అందులో వారి దోషమేమీ ఉండదు. అయినా, వారు చిత్తశుద్ధితో దైవసాన్నిధ్యాన్ని, సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ, నిజాయితీగా దేవుడి కోసం అన్వేషిస్తూ ఉంటారు. దేవుడు అనుగ్రహించే కృపావర ప్రభావముతో తమ అంతరాత్మల ప్రబోధాలకు విధేయులై ధర్మబద్ధంగా జీవిస్తూ, తమకు తెలియకుండానే దైవసంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటారు. ఇలాంటివారు సైతం, రక్షణభాగ్యం పొందడానికి యోగ్యులు కాగలుగుతారు (నం. 16). కనుక, క్రీస్తు విశ్వాసులుగా, శ్రీసభగా క్రీస్తును గురించి తెలియని వారికి తెలియబరచాలి. సువార్తను బోధించాలి.

నిజమైన, పరిపూర్ణమైన సాక్షాత్కార పండుగను మనం కొనియాడాలి అంటే, మనముకూడా మన మంచి క్రైస్తవ విలువలు కలిగిన జీవితము ద్వారా, ఇతరులకు క్రీస్తును సాక్షాత్కరం చేయగలగాలి.

దైవరాజ్యము, శ్రీసభ
జ్ఞానుల శిశుసందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా, స్వార్ధముతో జీవించి యున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరుప్రతిష్టలకోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకునిపట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు, రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడి యున్నాయని గ్రహించారు.

క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను, అనగా, సర్వమానవాళిని ఆధ్యాత్మికముగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈలోకమున దైవరాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనలద్వారా, ఆయన చూపించిన మార్గములద్వారా, ముఖ్యముగా, శ్రీసభద్వారా ఆ దైవరాజ్యం ఈనాటికిని కొనసాగుతూనే ఉంది. దైవరాజ్యములో అందరు భాగస్తులే. కాలగతిలో, అనేకమంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హేరోదువలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనములో నుంచుటకు ప్రయత్నించారు. కాని, ఎవరూ నాశనం చేయలేక పోయారు. శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ది చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకన, ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యము కలకాలము నిలచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది.

నక్షత్రమువలె మార్గదర్శకులమవుదాం
"తూర్పుదిక్కున జ్ఞానులు ముందు నడచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను" (మత్త. 2:9). మన అనుదిన జీవితములోకూడా దేవుడు మనకు చూపించే నక్షత్రాల లాంటి గురుతులను, సూచనలను అనుసరించుదాం! మనం చేసే అనుదిన కార్యాలలో దేవున్ని చూడగలగాలి. "దేవుని వాక్యం" (బైబులు) మనకు గొప్ప మార్గచూపరి. బైబులు పఠనం, ధ్యానం, ఆచరణద్వారా, దేవున్ని కనుగొనవచ్చు. అలాగే, పిల్లలకు తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఉపదేశకులు, యేసును పరిచయం చేసే మార్గచూపరులు. ఇతరులు బైబులు బోధకులు, శ్రీసభ బోధనలు, పునీతుల జీవితాలు, దైవార్చన సాంగ్యాలు...

ప్రతీ ఒక్కరం ఓ నక్షత్రమువలె ఉండాలి. ఆ క్రీస్తే నిజమైన నక్షత్రము, వెలుగు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదాసాక్షులమై ఉండాలి. ఈలోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యమువైపు చూచునట్లు ప్రోత్సహించాలి. క్రీస్తురాజ్యములో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం.

అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు. కాని, పొందలేకున్నారు. ఎందుకన, ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెదకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలచే రాజ్యాన్ని చూపించగలగాలి.

మనం చేసే ప్రతీపని, మనం మాట్లాడే ప్రతీమాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం. అలాగే, జ్ఞానులకు మార్గదర్శినియై క్రీస్తువద్దకు చేర్చిన నక్షత్రమువలె మనముకూడా మన జీవితాదర్శముద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చుదాం. ఇతరుల జీవితాలలో నక్షత్రమువలె ప్రకాశించాలంటే, తోటివారిపట్ల ప్రేమ, కరుణ, క్షమను కలిగి యుండాలి. దేవుని కృపానుగ్రహమే మనలను క్రీస్తు వైపుకు నడిపించే నక్షత్రము!

మత్త. 2:1-12 వ్యాఖ్యానం: యేసు దావీదు కుమారుడు, యూద వంశములో జన్మించిన రాజు. తూర్పు దేశాలలో అనాధికాలముగా, దేవుని రాజుగా ఆరాధించడం సాధారణమే! ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుని పరలోక రాజుగా ఆరాధించేవారు. "ప్రభువు రాజు... విశ్వ ధాత్రికి అధిపతి" (కీర్తన. 97:1,5). హేరోదురాజు పరిపాలనా కాలమున [దాదాపు క్రీ.పూ. 6వ శతాబ్దములో] యూదయా సీమయందలి బెత్లెహేము నందు యేసు జన్మించెను (మత్త. 2:1). యేసు క్రీస్తు నిజమైన రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజరికం దావీదు వంశమునుండి వచ్చెను. తన జన్మముతో, యేసు యూదయాసీమలోని బెత్లెహేమున (మత్త. 2:1), దేవుని రాజ్యమును స్థాపించాడు.

అప్పుడు తూర్పుదిక్కునుండి జ్ఞానులు యెరూషలేము వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" (మత్త 2:2) అని అనిరి. జ్ఞానులు ఆ "నక్షత్రమును" ఇశ్రాయేలు దేశమున రాజ జననమునకు సూచనగా గుర్తించారు. ఇది విని హేరోదు రాజు, యెరూషలేము వాసులందరు కలత చెందారు (మత్త. 2:1-3). కారణం, హీరోదులోనున్న భయం. తన రాజ్యాన్ని, అధికారాన్ని ఇంకెవరైనా లాగేసుకుంటారేమోనన్న భయం! ఆ భయముతోనే పసిబిడ్డలను హతమార్చాడు. ఈ భయమే అతన్ని మూర్కునిగా చేసింది. ఏదేమైనప్పటికిని, హేరోదు దేవుని మార్గమును నిజాయితీగా వెదకలేదు. కాని, జ్ఞానులు మాత్రము తూర్పుదిక్కున నక్షత్రమును చూచి, యూదయా సీమలోని బెత్లేహేమునకు అనుసరించారు. వారు నిజాయితీగా దేవుని మార్గమును వెదకి కనుగొన్నారు. జ్ఞానము గలవారు దేవుని వాక్కును ఆలకిస్తారు. దేవుడు జ్ఞానమునకు, ప్రేమకు, ఆనందమునకు, శాంతికి మూలాధారుడు.

మత్తయి సువార్తీకుడు, ముగ్గురు జ్ఞానుల పేర్లను చెప్పలేదు. పశ్చిమ సంప్రదాయమున ఆ ముగురు పేర్లు: గాస్పరు, మెల్కియోరు, బల్తజారు. మత్తయి ఎంతమంది జ్ఞానులు అని కూడా చెప్పలేదు, కాని, మూడు కానుకలు సమర్పించిరని చెప్పాడు.

"జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. వారు గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి" (మత్త. 2:10-11). జ్ఞానుల దృష్టి అంతయుకూడా యేసుపై యుండెను. "ఆ శిశువునకు బంగారము (ప్రేమ), సాంబ్రాణి (ప్రార్ధన), పరిమళ ద్రవ్యములను (త్యాగాలు) కానుకలుగా సమర్పించిరి" (మత్త. 2:11). మరియ, యోసేపులు కూడా అనుకోకుండా వచ్చిన జ్ఞానులను సంతోషముతో ఆహ్వానించారు.

ఈ సంఘటనద్వారా, మనము క్రీస్తు కొరకా [జ్ఞానులవలె] లేదా క్రీస్తుకు వ్యతిరేకమా [హేరోదువలె] అన్న నిర్ణయం చేయాలి. భయము, విశ్వాసము మధ్య నిర్ణయం చేయాలి. హేరోదు ఎంతో దగ్గరలో ఉన్నను, నిజరాజును కనుగొనలేక పోయాడు. కారణం: స్వార్ధం, ద్వేషం, అధికారదాహం, కపటము, భయం... జ్ఞానులు ఎంతో దూరములో ఉన్నను, వారి ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడినను, వారు, లోకమునకు వెలుగైన  క్రీస్తు రాజును కనుగొన్నారు, ఆరాధించారు. కారణం: నిస్వార్ధం, నిజాయితీ, విశ్వాసం, దృఢసంకల్పం.

జ్ఞానుల ప్రయాణం కేవలం తూర్పు నుండి బెత్లేహేమునకు చేసిన ప్రయాణం మాత్రమే కాదు. వారి ప్రయాణం అన్యమతవాదమునుండి క్రీస్తును ఆరాధించుట! వారు యూదులు కాదు. బైబులు పండితుల ప్రకారం, వారు తూర్పుమత యాజకులు (జోరాస్ట్రియన్ పూజారులు). వారిలో ఒకరు రాజు అయి ఉండవచ్చు (అజెస్ II). ఏదిఏమైనా, వారు అన్యులు అనునది వాస్తవము. వారు నక్షత్రాలను చూసే జ్యోతిష్కులను సంప్రదించి యుండవచ్చు. నేడు ఇంకా ఎంతోమంది మార్గదర్శకాలకోసం జాతకాలు చూసేవారు ఉన్నారు. దేవుడు మన నిజమార్గదర్శకుడు అని వారు తెలుసుకోవాలి. 

మొదటి ఆజ్ఞ బహుదేవతారాధనను ఖండిస్తుంది. జీవాన్ని ఇచ్చేవాడు, చరిత్రలో జోక్యం చేసుకొను "సజీవ దైవం" అసలు దేవుడు (సత్యోపదేశం, నం. 2112). భావిజీవితం గూర్చి ఉబలాటాన్ని వదిలి భవిష్యత్తును దేవుని చేతుల్లో పెట్టడం సరైన క్రైస్తవం అవుతుంది (సత్యోపదేశం, నం. 2115). అన్నిరాకాల సోదెలను - దయ్యాలను ఆశ్రయించడం, మంత్ర ప్రార్ధనలు... మొదలగునవి తిరస్కరించాలి. అవి దేవునికి మాత్రమే ఇవ్వవలసిన గౌరవమర్యాదలకు, ప్రేమపూరిత భావనకు విరుద్ధం (సత్యోపదేశం, నం. 2116).

మన ప్రయాణములో కూడా ప్రతీక్షణం క్రీస్తుకు దగ్గర కావాలి - సంపూర్ణ విశ్వాసం, హృదయ పరివర్తన. మన ప్రయాణములో వేటిపైగాక, కేవలం దేవునిపైనే ఆధారపడాలి.

యేసు పవిత్ర నామ స్మరణోత్సవము, జనవరి 3

యేసు పవిత్ర నామ స్మరణోత్సవము (లేదా)
పరమ పవిత్ర యేసు నామకరణ పండుగ 
నాలు: 1 యోహాను 3:22-4:6; మత్త 4:12-17, 23-25

యేసు నామం జై జై, క్రీస్తు నామం జై, జై

యేసు నామము ప్రత్యేక విధముగా స్మరించుకోవడానికిగల ముఖ్య కారణం, ఈనామము అద్భుత రీతిన ఇవ్వబడినది. ఈనామము మానవునిచేతగాక, స్వయముగా పితయైన దేవునిచేత ఇవ్వబడినది. ''ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. అ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము'' (లూకా 1:31), అని గబ్రియేలు దూత మరియమ్మతో దేవుని సందేశమును చెప్పినది. ''యోసేపూ! నీ భార్యయైన మరియమ్మ.... పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు 'యేసు' అను పేరు పెట్టుము.'' (మత్తయి 1:20-21). 'యేసు' అనగా 'దేవుడు సహాయము చేయును' లేదా 'దేవుడు రక్షించును' అని అర్ధము. ''ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును'' (మత్తయి 1:21).

యేసు నామము పవిత్రమైనది, శక్తివంతమైనది. ఎందుకన, ఆ నామము కలిగిన రక్షకుని, దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వమును సూచిస్తున్నది. ఆయన శక్తిగలవాడు. ఆయన నామమున ప్రజలు స్వస్థతను పొందియున్నారు. యేసు నామముము గౌరవించెదము, ఆరాధించెదము. ఎందుకన, ఆయన నామమును స్మరించినప్పుడు, మనము దేవునికి అత్యంత గొప్పదైన, శక్తివంతమైన ప్రార్ధన చేస్తున్నాము. ఆయన నామమున ప్రార్ధన చేయమని ప్రభువే కోరియున్నారు. ''మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును'' (యోహాను 16:23). అంతేగాక, ఆయన పవిత్ర నామమును స్మరించుటవలన, మనంచేసే ప్రార్ధనలో అనేక వ్యర్ధపదాలకు దూరముగా ఉండవచ్చు (మత్తయి 6:7).

ఆయన నామము, రక్షకునిద్వారా పొందు సకల ఆశీర్వాదములను జ్ఞప్తికి చేస్తుంది. అందుకే, పునీత పౌలుగారు ఇలా వ్రాసియున్నారు: "పరలోక భూలోక పాతాళ లోకములయందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను" (ఫిలిప్పీ 1:10).

'యేసు' అను నామము ఎనిమిదవరోజున, అనగా యూదుల ఆచారము ప్రకారము సున్నతిచేయబడిన రోజున, నామకరణము చేసిరి (లూకా 2:21).

యేసు నామము ఎంతో మధురమైన నామము. ఆ నామము మనలను మంచి ఆలోచనలతో నింపుతుంది. మంచి కార్యములను చేయుటకు స్పూర్తినిస్తుంది. సద్గుణాలను బలపరస్తుంది. యేసు నామము మన నోటిలో తేనెలాంటిది, మన చూపులో వెలుగు, మన హృదయాలలో ఓ జ్వాల. యేసు నామము వలన సకల రోగాలకు స్వస్థత. భోదకులకు వెలుగు.

యేసు నామము త్రిత్వైక దేవుని దైవత్వమును, పవిత్రతను సూచిస్తున్నది. అందుకే యేసు తండ్రిని ఇలా ప్రార్ధించాడు: "పవిత్రుడవైన తండ్రీ! మనవలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన నీ నామమందు సురక్షితముగ ఉంచుము" (యోహాను 17:11-12).

పేరు ఓ వ్యక్తి స్వభావమును సూచిస్తుంది. "కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది." (కొలస్సీ 1:19). "దివ్య స్వభావపు సంపూర్ణత్వము క్రీస్తునందు ఉన్నది" (కొలస్సీ 2:9).

యేసు నామము మహోన్నతమైనది, ఘనమైనది. "దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామములకంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను" (ఫిలిప్పీ 2:9). "యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింప వలెను" (ఫిలిప్పీ 2:11). యేసు నామము ప్రేమగలది. ఆయన నామము ధర్మమును, రక్షణమును సూచిస్తుంది. "నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరివరకు సహించి నిలచినవాడే రక్షింపబడును" (మత్తయి 10:22).

యేసుపవిత్రనామాన్ని శ్రీసభ ప్రారంభదినాలలోనే స్మరించడం జరిగింది. కాని, 14 వ శతాబ్దములో మాత్రమే ఆరాధన క్రమములో చోటు కల్పించబడినది. యేసు పవిత్ర నామ భక్తిని, పునీత బెర్నార్డుగారు తన ఇతర సహచరులతోను, పునీత బెర్నార్డు సియోనగారు, పున్నేత జాన్ కపిస్త్రానో మరియు ఫ్రాన్సిసు సభ సభ్యులు వ్యాపింప జేసియున్నారు.

యేసు నామం జై జై, క్రీస్తు నామం జై, జై.