Sunday, April 15, 2012

దైవ కారుణ్యం 15 April 2012


దైవ కారుణ్యం 15 April 2012
అ.కా. 4: 32-35, I యోహాను 5:1-6, యోహాను 20:19-31

Fr. John Antony Polisetty OFM Cap
Gerrmany

క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమును దైవ కారుణ్య పండుగగా జరుపుకోవాలని పరిశుద్ధ రెండవ జాన్ పౌల్ పాపుగారు పిలుపునిచ్చారు.  అప్పటినుండి రోమను కతోలిక సంఘమునందు ఈ పండుగను జరుపు కొంటున్నారు.

అసలు 'దివ్య కారుణ్యం' అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దివ్య కారుణ్యం అంటే, 'దేవుని కరుణ' అని అర్ధం. 'కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో 'Mercy' అందురు.  'Mercy' అనే ఆంగ్ల మాట mercedem లేదా merces అనే లాటిన్ మాట నుండి ఉద్భవించింది.  ‘mercedem’ లేదా ‘merces’ అనే మాటకు ప్రతిఫలము, జీతము, కిరాయి అనే అర్ధాలు గలవు.  బైబిలు పరి భాషలో ఈ మాటకు (Mercy) ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించ బడినది అని అర్ధము.

Friday, April 6, 2012

క్రీస్తు పునరుత్థాన మహోత్సవము, 8 April 2012


క్రీస్తు పునరుత్థాన మహోత్సవము, 8 April 2012
అపో.కా. 10:34, 37 -43, కోలో 3:1-4, యోహాను 20:1-9

Fr. Inna Reddy Allam OFM Cap

"మీరు భయపడకుడు. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు.  ఆయన పునరుత్తానుడైనాడు.  ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు" (మార్కు 16:6).

ఈ రోజు మనం ప్రభు ఉత్తాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము.  మనం జరుపుకొనే పండుగలన్నింటిలో, క్రీస్తు ఉత్తాన పండుగ ఒక గొప్ప పండుగ. ఈరోజు ప్రత్యేకముగా క్రీస్తు విశ్వాసులందరూ కలసి ఆయన ఉత్తానాన్ని, ఉత్తాన సందేశాన్ని ప్రపంచానికి, సర్వమానవాళికి ప్రకటించుచున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు, తన వెలుగును, శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు.

ఈ క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యమునకు నోచుకున్న మరియు మొదట కాలి సమాధిని దర్శించిన ముగ్గురు వ్యక్తులను గూర్చి తెలుసుకొందాం.  ఆ ముగ్గురు - మగ్దల మరియమ్మ, పేతురు మరియు యోహాను.  ఈ ముగ్గురిలో ఒకే నిరీక్షణ, ఒకే ఎదురుచూపును చూస్తున్నాము. యేరూషలేములో జరిగిన సంఘటనల తరువాత శిష్యులందరు భయాందోనలతో ఎవరి దారిని వారు చూసుకొన్నారు.  పేతురుగారు "నేను ఆయనను ఎరుగను" (యోహాను 18:27) అని మూడు సార్లు బొంకాడు.  యోహాను సిలువ వరకు క్రీస్తును వెంబడించినను, ఎంతో భయపడ్డాడు.  మగ్దల మరియమ్మ, యేసు ప్రభువును అనుసరించడం నేర్చుకొన్న స్త్రీ.  ఈమె ప్రభువును అధికముగా ప్రేమించింది.  కలువరి కొండ వరకు ఆయనను వెంబడించింది.  ఆయన సిలువపై వ్రేలాడే సమయములో ఆయన ప్రక్కనే ఉన్నది.  ఆయన చనిపోవడం చూసింది.  ఆయనను సమాధిలో ఉంచడం చూసింది. ఒంటరిగా, దు:ఖముతో నిండిన హృదయముతో ఆదివారం తెలతెల వారక ముందే సమాధి దగ్గరకు వెళ్లి యేసు భౌతిక శరీరాన్ని దర్శించుకోవాలని అనుకొన్నది. ఆయన భౌతిక దేహాన్ని చూసి విలపించాలని అనుకొన్నది. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలను పూసి అలంకరించాలని అనుకొన్నది. చివరికి సమాధి దగ్గరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలచింది.


Tuesday, April 3, 2012

HE IS RISEN, AS HE SAID (EASTER)

Easter Sunday, 8 April 2012
HE IS RISEN, AS HE SAID

Fr. Charles Sérignat OFM Cap.

What can anyone say about the Resurrection? By definition, it is a unique event. Certainly, no-one could possibly have expected anything like it, after the events of the last few days.

The title of a well-known spiritual book is “The God of Surprises”: the Resurrection is God’s biggest surprise! It proclaims that even the most horrible events – even death itself – do not have the final word. It is the reason for hope.

Another difficulty we have is that it’s hard to “picture” the resurrection as it happened. No-one was there to see it or record it. Like the apostles, we cannot prove it, we can only go by the word of someone who saw, and felt, its effects, and was totally changed by them. 

In the accounts of Jesus’ appearances to the apostles after his resurrection, it’s obvious that something has changed: Jesus is still recognisable, he still carries the wounds of his passion, but his body is no longer bound by the laws of our material world (he can appear when the doors are closed!). It is still the “physical” Jesus, but now in a new dimension. Will our humanity, too, be transformed in this way?

One of the most moving scenes in John’s gospel is when Mary of Magdala is outside the tomb, weeping. She sees a man there whom she takes to be the gardener. The stranger turns and calls her by her name: “Mary!”. The voice is unmistakable, instantly she replies “Master!” (Jn 20: 11-18)

To be known by name by the Risen Lord! We need time for the mystery to sink in. That is why the Church gives us 50 days, when “Alleluia” is heard again and we ponder the beautiful readings that unfold the heart of the mystery. Is it too much to hope that, at the heart of it all, we will hear the Risen Jesus calling each of us by name, as Mary did? In the midst of the sadness, grief and suffering which are part of our human condition, we too can hear the unmistakable voice, calling gently, calling our name, and giving us new hope.